పొత్తులేకుండా పోటీకి పనికిరాని చంద్రబాబు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పెనుమూరు (కార్వేటినగరం)/కుప్పం: స్వార్థరాజకీయాల కోసం చంద్రబాబు అనైతిక ఒప్పందాలు చేసుకుని ప్రజలను మభ్యపెడుతున్నారని రాష్ట్ర భూగర్భ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడని, పొత్తులు లేకుండా పోటీకిరాడని చెప్పారు. ఆయన ఆదివారం చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కుప్పంలోను, అంతకుముందు మండల కేంద్రం పెనుమూరులోను విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారదాహంతో నరేంద్ర మోదీతో సహా ఎవరి కాళ్లు పట్టుకోవడానికైనా వెనుకాడడని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏకమైనా వైఎస్సార్‌సీపీకి నష్టం లేదని చెప్పారు. మీ పొత్తులు, జిమ్మికులను రాష్ట్ర ప్రజల ముందే ఊహించారన్నారు. పవన్‌కళ్యాణ్ సీఎం కావాలని అతని అభిమానులు, కాపులందరూ కోరుకుంటే పవన్‌కళ్యాణ్ మాత్రం చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటూ బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ఒక్కడే ఒకవైపు ఉంటే టీడీపీ, జనసేన, బీజేపీతోపాటు అంతర్గతంగా కాంగ్రెస్ కూడా కుమ్మకై జగన్‌ను ఓడించడానికి సిద్ధపడ్డారని తెలిపారు. పొత్తులో భాగంగా పవన్‌కళ్యాణ్ కనీసం 15 శాతం సీట్లు కూడా తీసుకోలేకపోయారని చెప్పారు.
గతంలో బాబును తిట్టిన నోటితోనే నేడు చంద్రబాబు నామస్మరణ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పీసీసీ అ«ధ్యక్షురాలు షర్మిల కూడా చంద్రబాబు చదివిన స్క్రిప్టునే చదివి రాష్ట్రానికి సువర్ణపాలన అందిస్తున్న జగనన్నపై దుమ్మెతి పోయడం మంచిది కాదన్నారు. ఇంత మంచిచేసిన ప్రభుత్వాన్ని కొనసాగించాలంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకీ ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వందలసార్లు బటన్ నొక్కితే 2024 ఎన్నికల్లో లబి్ధదారులు రెండు బటన్లు నొక్కి తమ రుణాన్ని తీర్చుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రతిపక్షాలకు ఓట్లు వేస్తే లంచాలు, కులవివక్ష, భూకబ్జాలు, పెత్తందారులను ప్రోత్సాహించినట్లేనని, టీడీపీ అధికారంలోకి వస్తే పేదవాడు పేదవాడిగా మిగిలిపోవాల్సిందేనని చెప్పారు. కుప్పంలో చంద్రబాబును ఓడించే బాధ్యత తమ భుజస్కంధాలపై ఉందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సుభిక్షంగా ఉండే రాష్ట్రంలో కరువు తాండవిస్తుందని ఆయన పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తరువాత వాటిని అమలు చేయలేదని వివరించారు. తమ బలం, బలగం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే అని ఆయన చెప్పారు. మంత్రి వెంట ఎంపీ రెడ్డెప్ప, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఎమ్మెల్సీ భరత్, రెస్కో చైర్మన్ సెంథిల్, కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుదీర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment