సాక్షి, చిత్తూరు జిల్లా: రాష్ట్రంలో సైలెంట్ వేవ్ ఉందని.. 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు గెలుస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కుప్పంలో వైఎస్సార్‌సీపీ గెలవబోతుందన్నారు. కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచామని.. వరుస ఓటముల తర్వాత తనపై చంద్రబాబు కక్ష పెట్టుకున్నారన్న పెద్దిరెడ్డి.. తానను టార్గెట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అవినీతి సామ్రాట్ చంద్రబాబు. నారావారిపల్లెలో రెండు ఎకరాల భూమి బాబుకు ఉంది. ఇప్పుడు లక్షల కోట్లు సంపాదించారు. ఈ డబ్బు ఎలా వచ్చింది?. ఇది అవినీతి కాదా? అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్, నాపై తరచూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబులాగా మేము అవినీతి పరులం కాదు. పుంగనూరు, అంగళ్లు ఘటనలకు సూత్రధారి చంద్రబాబు. ఆయన ప్రభుత్వంలోని టీడీపీనేతలు రెచ్చిపోయి దాడులు చేశారు. పోలీసులను తీవ్రంగా కొట్టారు.’’ అని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.
‘‘టీడీపీ నేతలు గూండాల్లా వ్యవహరించారు. దాడులు చేయించింది చంద్రబాబు నిందలు మాపై పంపారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఘోర ఓటమి తప్పదు’’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment