
తాడేపల్లి : ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటే గనుక జర్మనీకి వెళ్లాలంటూ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆర్ కే రోజా(RK Roja) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రష్యా అల్లుడికి జర్మనీ గురించి బాగా తెలుసనుకుంటా అంటూ రివర్స్ పంచ్ ఇచ్చారు ఆర్ కే రోజా. ఈరోజు(సోమవారం) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన ఆర్ కే రోజా.. ఎవరికైనా మేలు చేయాలంటే అది వైఎస్ జగన్(YS Jagan) కే సాధ్యమన్నారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి ప్రతిపక్ష హోదా అడుగుతుంటే, దీనిపై పవన్ కళ్యాణ్ వంకరగా మాట్లాడుతున్నారని రోజా ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే రష్యా అల్లుడికి జర్మనీ గురించి బాగా తెలుసనుకుంటా అంటూ సెటైర్లు వేశారు రోజా. ఒకవేళ పవన్ కు ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఎదురుగా కూర్చొని ప్రశ్నించాలని రోజా సూచించారు. అసలు వైఎస్ జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ఎందుకంత భయమని ప్రశ్నించారు.
‘‘అసెంబ్లీ(AP Assembly Sessions)లో గవర్నర్ తో కూడా చంద్రబాబు అబద్దాలు ఆడించారు సూపర్ సిక్స్ తోపాటు 143 హామీలను చంద్రబాబు ఇచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఇరిగేషన్ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. చంద్రబాబు ఈ ఐదేళ్లలో ఏం చేస్తారో చెప్పకుండా 2047 గురించి మాట్లాడుతున్నారు. టీడీపీ జనసేన సిండికేట్ అయి లిక్కర్ మీద రేట్లు పెంచారు.. జలగల్లాగ పీల్చుతున్నారు. విద్యత్ ఛార్జీల రూపంలో రూ.15 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేశారు. కానీ గవర్నర్ తో అసలు ఛార్జీలే పెంచలేదన్నట్టుగా మాట్లాడించారు. తల్లికివందనం కింద రూ.15 వేలు అని చెప్పి మోసం చేశారు. రైతులకు ఇస్తామన్న రూ.20 వేల గురించి మాట్లాడటం లేదు.

చంద్రబాబు, కరువు కవల పిల్లలు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్నవాటినే తొలగించారు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఏమీ లేకుండా పోయాయి. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలోనే తేల్చుకుంటాం . ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పిఏసీ పదవిని కూడా ఇవ్వలేదు. అంటే వారు చేసే అవినీతిని బయటకు రానీయకుండా చేసే కుట్ర చేశారు. టీవీ ఛానళ్లను కూడా అసెంబ్లీలోకి ఎందుకు రానివ్వటం లేదు? , కూటమికి భజన చేసే ఛానళ్లకే అనుమతులు ఇస్తారా?, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నందుకు గ్రూపు-2 అభ్యర్థులు రోడ్డు మీద చెప్పులతో కొట్టుకున్నారు.
ప్రజలతో కలిసే పోరాటం చేసి కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొడతాం. మిర్చి రైతులను జగన్ కలిసేదాకా ప్రభుత్వం స్పందించలేదు. హుందాతనం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. గవర్నర్ మీద జగన్ కి గౌరవం ఉన్నందునే అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సొఙత డబ్బా కొట్టుకుంటున్నారు . అసెంబ్లీలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయటం కూటమికే చెల్లింది’ అని రోజా ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment