
విజయవాడ: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కొన్ని పత్రికలు, చానెళ్లపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విదించడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్యూజే) తప్పుబట్టింది. మీడియాపై ఆంక్షలు, పక్షపాత ధోరణి సరికాదని స్పష్టం చేసింది. అసెంబ్లీ కవరేజీకి అందరికీ అవకాశమివ్వాలని స్పష్టం చేసింది. దీనిపై స్పీకర్, ప్రభుత్వం పునరాలోచించాలని పేర్కొంది. కొన్ని పత్రికలు, చానెళ్లను అసెంబ్లీ సమావేశాల కవరేజ్ కు అనుమతించకపోవడం సరికాదని తెలిపింది, పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్యూజే పేర్కొంది.
‘సాక్షి’తో సహా నాలుగ చానెళ్లపై ఆంక్షలు
ఏపీ అసెంబ్లీ సమావేశాల కవరేజ్ లో నూ ఏపీ ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. అసెంబ్లీ సమావేశాలను కవరేజ్ అంశానికి సంబంధించి ‘సాక్షి’తో సహా నాలుగు చానెళ్లపై ఆంక్షలు విధించింది. దేశంలో ఏ అసెంబ్లీ చరిత్రలో లేని మీడియాపై నిషేధ ఆజ్ఞలు అములు చేస్తోంది చంద్రబాబు సర్కారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే మీడియాపై ఆంక్షలు విధించింది. కూటమి కుట్రలు బయటపడతాయని ‘సాక్షి’తో పాటు నాలుగు చానెళ్లను నిషేధించింది. అసెంబ్లీలో జరుగుతున్నది ప్రజలకు చూపించకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఈ కుట్రలు తెరలేపింది.