ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. | AP Assembly Sessions 5th Day Live Updates, Latest News And Highlights In Telugu - Sakshi
Sakshi News home page

AP Assembly Session Live Updates: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా..

Published Wed, Sep 27 2023 8:50 AM

AP Assembly Sessions 5th Day Live Updates - Sakshi

AP Assembly Live Updates

► ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా..

శాసన మండలిలో ఆమోదం పొందిన బిల్లులు ఇవే..
►1.ఆంధ్ర ప్రదేశ్ సివిల్ కోర్ట్స్ (అమెండ్మెంట్) బిల్లు-2023

►2. ఆంధ్రప్రదేశ్ గ్యారెంటీ పెన్షన్ సిస్టమ్ బిల్లు- 2023

►3. ఆంధ్రప్రదేశ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సెకండ్ అమెండ్మెంట్  బిల్లు -2023

►4. ఆంధ్రప్రదేశ్ రెగ్యులైజేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ బిల్లు-2023

►5. ఆంధ్ర ప్రదేశ్ అప్రాప్రియేషన్ నెంబర్ -3 బిల్లు -2023.

TIME: 03:20PM

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కామ్‌పై సభలో చర్చ

► చంద్రబాబు మోసగాళ్లకు మోసగాడు: మంత్రి ఆదిమూలపు సురేష్‌
►అవినీతి అనే  చాలా చిన్న పదం
►అమరావతి గ్రాఫిక్స్‌తో గారడి చేసిన వ్యక్తి చంద్రబాబు
►అమరావతి భూములను నొక్కేసిన టక్కరి దొంగ చంద్రబాబు
►ఐఆర్‌ఆర్‌ మలుపులు తిరిగి కొంతమంది భూముల్లోకి వెళ్లింది
►ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్‌ను ఇష్టం వచ్చినట్లు మార్చుకున్నారు.
►ఈ స్కామ్‌కు డైరెక్షన్‌ చంద్రబాబు.. పర్యవేక్షణ లోకేష్‌
►అమరావతి అనేది అంతర్జాతీయ స్కాం
►ఐఆర్‌ఆర్‌ అక్రమాలన్నింటికీ స్పష్టమైన ఆధారాలున్నాయి

TIME: 03:10PM

►అమరావతిలోని అసైన్డ్‌ భూముల రికార్డులను మాయం చేశారు: మంత్రి ధర్మాన ప్రసాద రావు
►రికార్డులను మాయం చేసి పేదలను బెదిరించి భూములు లాక్కున్నారు.
►ఒక్కరి ప్రయోజనం కోసం అప్పటి ప్రభుత్వం యంత్రాంగాన్ని ఉపయోగించుకుంది
►హైదరాబాద్‌లో అభివృద్ధి ఫలాలను తనవాళ్లకే దక్కేలా చేశారు.
►హైదరాబాద్‌లో చేసిన మాదిరిగానే అమరావతిలోనూ చేయాలని బాబుప్లాన్‌

TIME: 03:00PM

శాసనమండలిలో ఎమ్మెల్సీ కుంభ రవిబాబు కామెంట్స్

►రాష్ట్రంలో 40 సంవత్సరాల అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న అవినీతి చక్రవర్తి చంద్రబాబు గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు.
►చంద్రబాబు 40 ప్రదేశాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని 3611 కోట్లతో సీమెన్ ,డిజైన్ టెక్ స్కిల్ డెవలప్మెంట్ ఒప్పందాన్ని చేసుకున్నారు.
►సీమన్ సంస్థ 90% పెట్టుబడులు పెడుతుందని 2017 జూన్ 30న జీవో నెంబర్ 4 విడుదల చేశారు.
►చంద్రబాబు చేసుకున్న అగ్రిమెంటుకు ఇచ్చిన జీవో కి సంబంధమే లేదు.
►స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ ఆఫీసర్ సీఈఓ లక్ష్మీనారాయణ ఎండి గంట సుబ్బారావు కీలక భూమిక పోషించారు.
►100 రూపాయల బాండ్ పేపర్ పై 3611 కోట్ల కాంట్రాక్ట్ ఒప్పందాన్ని తేదీలు వేయకుండా చేసుకున్నారు.
►361 కోట్ల ఒప్పందానికి తమకు ఎలాంటి సంబంధం లేదని జర్మనీలో ఉన్న సీమన్స్ కంపెనీ తెలిపింది.
►పది శాతం వాటా తో 370 కోట్లు జీఎస్టీ తో సహా ఎందుకు చెల్లించేశారో చెప్పాలి...
►371 కోట్లు కొల్ల గొట్టడానికే షెల్ కంపెనీలను సృష్టించారు
►ఢిల్లీ కేంద్రంగా స్కిల్లర్ అనే కంపెనీని సృష్టించారు, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కోసం 241 కోట్లు సబ్ కాంట్రాక్టు ఇచ్చేశారు.
►90 శాతంఉన్న కంపెనీకి 70 కోట్లే ఖర్చయిందని చెప్పారు అప్పుడు 3611 కోట్లు ఎందుకు చూపలేదు.
►సీఐడీ, ఈడీ షెల్ కంపెనీలకు డబ్బు పంపారని ఆధారాలతో సహా చూపాయి.
►2018లో పూణేలో జీఎస్టీ ఎగవేసిన కంపెనీలను తనిఖీలలో 220 షెల్  కంపెనీల బాగోతం బయటపడింది.

►స్కిల్ డెవలప్‌మెంట్‌లో స్కిల్లర్ ఏసీ అనే కంపెనీలు షెల్ కంపెనీలుగా 2018లో గుర్తించారు.
►నాడు చంద్రబాబు సచివాలయంలో ఉన్న ఈ కాంట్రాక్టు ఒప్పందాలను మాయం చేశారు.
►స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో 90% వాటా ఉన్న సీమన్స్ కంపెనీ 3300 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు వాస్తవాన్ని చూపారని అది తమ సంస్థకు సంబంధం లేదని  జర్మనీలోని సీమన్స్ ఎండీ మెయిల్ ద్వారా తెలిపారు.
►ఈ కేసులో చంద్రబాబు పిఏ పెండ్యాల శ్రీనివాస్  కీలక భూమిక పోషించాడు.
►ఈడీ ఇప్పటికే 112 మందిని విచారించి అందులో నలుగురు నారెస్టు చేశారు.
►చంద్రబాబు ఈ కేసులో తనకు ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తున్నారు.
►40 సంవత్సరాల రాజకీయ అనుభవం 14 ఏళ్ళు సీఎం గా ఉన్న వ్యక్తి గుర్తులేదు నాకు ఏదీ తెలియదు అంటున్నాడు.
► విశాఖలో భూముల కుంభకోణాన్ని చేసిన వ్యక్తి చంద్రబాబు.
►రాజధాని అంశంలో తన బినామీలతో వేల కోట్లు కొల్లగొట్టాడు.
► క్విక్ ప్రోకో ద్వారా రాజధానిపై లీకులిఇచ్చి 25 వేల ఎకరాలను తన ఆనుంగుజుల తో కొనిపించారు.
►34,390 కోట్లు నీరు చెట్టులో దోచుకున్నారు. 
►21 వేల కోట్లు విద్యుత్ కొనుగోలులో దోచుకున్నాడు.
►పుష్కరాలు, చివరకు మజ్జిగ కొనుగోలులో సైతం దోచుకున్న వ్యక్తి చంద్రబాబు.
►1151 కోట్లు తాత్కాలిక సచివాలయ భవనాల పేరుతో దోచుకున్నాడు అందులో భవన నిర్మాణాలకు 120 కోట్లే ఖర్చు చేశారు.
►పక్క రాష్ట్రంలో కెసిఆర్ ఎనిమిది వందల కోట్లకే సచివాలయం కట్టారు.
►ప్రధాని మోడీ 1200 కోట్లకే పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు.
►రాజధాని భూ కుంభకోణంలో లక్ష కోట్లు దోచుకున్నారు.
►1200 కోట్లు హెరిటేజ్ కుంభకోణంలో దోచేశారు.
►పుష్కరాలలో 736 కోట్లు దోచేశారు.
►వరల్డ్ బ్యాంక్ నిధులు సైతం చంద్రబాబు వదిలిపెట్టలేదు.
►జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్ర ప్రజలను నిలువునా దోపిడీ చేశారు.

TIME: 02:40PM

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కామ్‌పై సభలో చర్చ

►హైదరాబాద్‌లో చేసిన మాదిరిగానే అమరావతిలోనూ చేయాలని చంద్రబాబు ప్లాన్‌: మంత్రి ధర్మాన ప్రసాదరావు
►హైదరాబాద్‌లో ప్రభుత్వ డబ్బుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌ చేశారు
►అభివృద్ధి ఫలాలను తన వర్గానికి దక్కేలా చేశారు. 
►అమరావతిలోనూ అదే అమలు చేయాలని చూశారు

►బినామీ పేర్లతో ఎన్నిక వందల ఎకరాలు కొనుగోలు  చేశారో తెలీదు
►అమరవాతిలోహెరిటేజ్‌ సంస్థ భూములు కొనుగోలు చేసింది.
►తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మి అవకతవకలకు పాల్పడ్డారు.

TIME: 02:00PM

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కామ్‌పై సభలో చర్చ

►రాజధానిపై చంద్రబాబు రోజుకో డ్రామా నడిపారు: మాజీ మంత్రి పేర్ని నాని
►చంద్రబాబు ప్రభుత్వంలోని అవినీతి కథల్లో ఇది కూడా ఒకటి
►దోపిడీకి దొంగలు రెక్కీ చేసినట్టుగా రింగ్‌ రోడ్డు స్కామ్‌ జరిగింది.
►ఇది కేబినెట్‌ నిర్ణయమంటూ చంద్రబాబు కబుర్లు చెప్పారు
►మాస్టర్‌ ప్లాన్‌ పేరుతో స్కామ్‌ నడిపించారు.
►లింగమనేని రమేష్‌ పొలం మధ్యలో నుంచి ఇన్నర్ రింగ్‌ రోడ్డు వచ్చేలా ప్లాన్‌ మార్చారు.
►హెరిటేజ్‌ సంస్థ, నారాయణ కాలేజీల కోసం ప్లాన్‌ మార్చారు

►ఏ-14గా ఉన్న లోకేష్‌ ఐఆర్‌ఆర్‌తో నాకేం సంబంధం అంటున్నారు
►2008 నుంచి 2017 వరకు హెరిటేజ్‌ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నారు
►లోకేష్‌ హెరిటేజ్‌ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నప్పుడే అమరావతిలోభూములు కొనాలని నిర్ణయించారు.

TIME: 01:20PM
ఏపీ ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ఎన్‌పీఎస్‌ ప్రయోజనాలపై అసెంబ్లీలో మంత్రి బుగ్గన
►ఎన్నోసార్లు ఆలోచించే ఉద్యోగుల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నాం.
►అందరి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు
►సీఎం జగన్‌ అన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు.
►ఉద్యోగుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యం

►ఎన్‌పీఎస్‌ హడావిడీగా తీసుకున్న నిర్ణయం కాదు
►గత కొన్నేళ్లుగా ఉన్న పెన్షన్‌ స్కీమ్‌ను అధ్యయం చేశాం
►ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనదే మెరుగైన స్కీమ్‌
►ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు పట్టించుకోలేదు
►గత ప్రభుత్వంతో పోలిస్తే ఉద్యోగులకు మరింత లబ్ధి చేకూర్చాం.

TIME: 12:40PM
►జీపీఎస్‌తో ప్రభుత్వంపై రూ. 2500 కోట్ల అదనపు భారం: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌
►ఆశా వర్కర్లకు గతంలో రూ. 3వేలు మాత్రమే ఇచ్చేవారు.
►ప్రస్తుత ప్రభుత్వంలో ఆశా వర్కర్ల జీతాలను రూ. 10వేలకు పెంచాం.
►108 డ్రైవర్లకు జీతాలు పెంచాం.
►హామీ ఇచ్చిన మేరకు ప్రతి విభాగానికీ మేలు చేకూర్చాం.
►ఉద్యోగుల జీతాల గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు.
► ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు గత ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగింది.
►పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ఇచ్చి మాట నిలబెట్టుకున్నాం

►కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ బిల్లుకు ఆమోదం
►ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌
►ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది.
►ప్రభుత్వ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తున్నారు.
►ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62కు పెంచాం.
►2014 నాటి నుంచి ఉద్యోగం చేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్‌ చేస్తున్నాం.
►ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం.
►విలీనంతో దాదాపు 53 వేల మందికి ప్రయోజనం

► శాసనమండలిలో చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాంపై స్వల్పకాలిక చర్చ.

TIME: 12:20PM
►చివరి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
►పలు బిల్లులకు సభ ఆమోదం
►కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ బిల్లుకు ఆమోదం
►అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్‌ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

TIME: 12:00PM

శాసనమండలి

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
► ప్రభుత్వం నాణ్యమైన పోర్టి ఫైడ్  రైసును పేదలకు చెరువచేస్తుంది:
►ఈ రైస్‌లో ఐరన్ పోలీక్ ఆమ్లం, విటమిన్ B12 ఉన్నాయి.
►ఇది ప్లాస్టిక్ రైస్ అని కొంతమంది విషయ ప్రచారం చేస్తున్నారు.
►ఇప్పటికే సాటెక్స్ బియ్యం పేదలకు చేరువ చేసేందుకు 300 కోట్లు ఖర్చు చేస్తున్నాము.
►ఈ రైస్‌ను కడిగినా, ఉడికించినా, గంజి వారపెట్టినా పోషకాలు పోవు.
►ప్లాస్టిక్ రైస్ అని ట్రోల్‌ చేస్తున్న వారికి అవగాహన కల్పిస్తున్నాం.
►26 జిల్లాలలో రెండు లక్షల 9 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా పేదలకు అందిస్తున్నాం.

డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కామెంట్స్‌
►గత ప్రభుత్వ హయాంలో సన్నా వడ్డీ పథకాన్ని నీరు కార్చారు: 
►డ్వాక్రా మహిళలను రుణమాఫీ పేరుతో చంద్రబాబు నాయుడు మోసం చేశారు.
►3వేల 36 కోట్లను ఎగ్గొట్టారు.
►పాదయాత్రలోసీఎం జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా మహిళల కష్టాలను చూసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
►గతంలో డ్వాక్రా మహిళలు తీసుకునే రుణాలకు వడ్డీ 13 శాతం గా ఉండేది.
►సీఎం జగన్‌ బ్యాంకర్లతో మాట్లాడి ఆ వడ్డీని ఏడు శాతానికి తగ్గించారు.
►చంద్రబాబు డ్వాక్రా మహిళలను పూర్తిగా కష్టాల్లో ముంచారు.
►25,571 కోట్ల బకాయిలు పెట్టారు.
►వైఎస్‌ అధికారం చేపట్టాక ఆసరా పథకాన్ని తీసుకువచ్చి వారికి అండగా నిలిచారు.
►మూడు విడతల్లో  19 వేల 178 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు.

TIME: 11:40 AM
శాసనమండలిలో మంత్రి విడదలరజినీ కామెంట్స్

►ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో  ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నాము.
►105 రకాల మందులు 14 రకాల టెస్టులు చేస్తున్నారు.
►పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు ఉంటే ఒక డాక్టర్ విధులు నిర్వహిస్తూ మరొక డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో పాల్గొంటున్నారు.
►జీరో వేకెన్సీ విధానాన్ని సీఎం జగన్‌ తీసుకొచ్చారు.
►రాష్ట్రంలో 53 వేల 190 మంది మెడికల్ స్టాఫ్‌ను రిక్రూట్మెంట్ చేశాము.
►పేదవారికి ఆరోగ్య సమస్యలు వస్తే గతంలో వైద్యం అందని పరిస్థితి ఉండేది, టెస్టులో పరికరాలు కొరతగా ఉండేవి.
►సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక గ్రామస్థాయిలోనే వైద్య సేవలను మెరుగుపరిచారు.
►ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా రెండు కోట్ల 30 లక్షల మంది ఈ సేవలనువినియోగించుకున్నారు.

►సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో 17 నూతన మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారు.
►8500 కోట్లతో ఈ కళాశాలలో ఏర్పడనున్నాయి.
►ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక మెడికల్ కాలేజీ ఉండా లన్నది సీఎం ఆకాంక్ష.
►ఈ విద్యా సంవత్సరంలో విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు ,మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కళాశాలలు ప్రారంభమయ్యాయి.
►150 మెడికల్ సీట్లతో ఐదు మెడికల్ కాలేజీలలో 750 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
►రానున్న విద్యాసంవత్సరాల్లో మరిన్ని మెడికల్ కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి.
►భారత దేశ చరిత్రలోనే నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటుతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించారు.

TIME: 11:20AM
►కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టడం చారిత్రక నిర్ణయం
►రాజ్యాంగ నిర్మాతను గౌరవించుకోవడం అందరి బాధ్యత
►అన్ని వర్గాలనూ సమానంగా చూసేవాడే నాయకుడు
►సీఎం జగన్‌ సామాజిక న్యాయం అమలు చేస్తున్నారు
►కోనసీమ ముఖద్వారంలో అంబేద్కర్‌ విగ్రహం పెడతాం

TIME: 10:45AM
►రాజ్యాంగ నిర్మాత విగ్రహ నిర్మాణం చేపట్టడం అభినందనీయం: గూడురు ఎమ్మెల్యే వరప్రసాదరావు
►బీఆర్‌ అంబేద్కర్‌కు మనమిచ్చే నివాళి ఇదే
►సమాజంలో అందరూ సమానమే
►దళితుల కోసం అంబేద్కర్‌ చూపిన బాటలోనే సీఎంజగన్‌ నడుస్తున్నారు
►దళితుల సంక్షేమ కోసం అనేక నిరర్ణయాలు తీసుకున్నారు
►బడుగు, బలహీన వర్గాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు

TIME: 10:30AM
►విజయవాడలో బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి: మంత్రి మేరుగు నాగార్జున
►అన్ని పనులూ తుది దశకు చేరుకున్నాయి.
►అత్యంత ప్రతిష్టాత్మకంగా అంబేద్కర్‌ విగ్రహాన్ని నిర్మిస్తున్నాం
►రాజ్యాంగ నిర్మాతకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నాం
►టూరిజం స్పాట్‌గా దీనిని తీర్చిదిద్దుతున్నాం

TIME: 10:20AM
►విద్య అనేది తల్లిదండ్రులకు భారం కాకూడదు: మంత్రి బొత్స సత్యనారాయణ
►సీఎం జగన్‌ తీసుకొచ్చిన సంస్కరణలతోనే పేదవాడికి విద్య చేరువైంది.
►ట్యాబ్‌ల పంపిణీలతో డిజిటల్‌ విద్యను మరింత చేరువ చేశాం
►అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు సత్తా చాటాలి.
►దేశం మొత్తం ఏపీ విద్యావిధానాలను ప్రశంసిస్తోంది.

TIME: 10:07AM
ప్రారంభమైన మండలి సమావేశం
►శాసనమండలిలో రాష్ట్రంలో రోడ్లు, రహదారుల ఏర్పాటు అంశంపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన పీడీఎఫ్‌ సభ్యులు
►వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్

TIME: 10:00AM
►ఇంగ్లీష్‌ మీడియా, సీబీఎస్‌ఈ సిలబస్‌ వంటివి మన విద్యారంగాన్ని మార్చాయి.
►అమ్మ ఒడి ద్వారా 42 లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగింది.
►నాడు-నేడు కింద 56 వేల స్కూల్స్‌ను బాగు చేశారు.
►నాణ్యమైన చదువు అందించడమే లక్ష్యంగా మార్పులు తీసుకొచ్చారు.

►విద్యారంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది
► విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు ఫలితాలనిస్తున్నాయి.
►నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి.
►విద్యా విధానాల్లో మార్పుతోనే విద్యార్థులు హాజరు శాతం పెరిగింది.
►గతంలో స్కూల్స్‌లో టాయిలెట్స్‌ కూడా లేని పరిస్థితి ఉండేది.

►విద్యారంగం రాష్ట్ర అభివృద్ధిలో కీలకం.
►విద్యారంగంపై సీఎం జగన్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
►డిజిటల్‌ విద్యను పేదవారికి చేరువచేసిన నాయకుడు జగన్‌.
►గత ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మార్చేసింది.

TIME: 9:35AM
►అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
►ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ. 23,167.93 కోట్లు ఖర్చు చేసింది. 
►మైనార్టీ సంక్షేమానికి టీడీపీ హయాంలో చేసిన ఖర్చు రూ. 2,665 కోట్లు మాత్రమే

TIME: 9:20AM
► చివరి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
►కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
►మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది: డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా
►మైనార్టీ సంక్షేమం అంటే గుర్తొచ్చే పేరు వైఎస్సార్‌
►తండ్రి అడుగుజాడల్లో సీఎం జగన్‌ మైనార్టీల సంక్షేమంపై దృష్టి పెట్టారు

సాక్షి, అమరావతి: అయిదోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. అదే విధంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ కుంభకోణంపై చర్చ జరగనుంది. వైద్య ఆరోగ్య రంగంలో సంస్కరణలు, దేవాలయాల అభివృద్ధిపై చర్చించనున్నారు.

ఇటు శాసన మండలిలోనూ స్కిల్ డెవలప్‌మెంట్‌, విద్య రంగంలో, వైద్య రంగంలో సంస్కరణలపై సబ్యులు చర్చించనున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాలకు నేడే చివరిరోజు. ఈ రోజుతో సమావేశాలు ముగియనున్నాయి.

Advertisement
Advertisement