మహిళ రిజర్వేషన్‌కు మద్దతుగా తీర్మానం చేసిన ఏపీ అసెంబ్లీ | AP Assembly Sessions 3rd Day Live Updates, Latest News And Highlights In Telugu - Sakshi
Sakshi News home page

మహిళ రిజర్వేషన్‌కు మద్దతుగా తీర్మానం చేసిన ఏపీ అసెంబ్లీ

Published Mon, Sep 25 2023 8:56 AM | Last Updated on Mon, Sep 25 2023 4:54 PM

AP Assembly Session 3rd Day Live Updates - Sakshi

Live Updates

►మహిళ రిజర్వేషన్‌కు మద్దతుగా తీర్మానం చేసిన ఏపీ అసెంబ్లీ
►ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఏపీ అసెంబ్లీ
►అసెంబ్లీ రేపటికి వాయిదా

మహిళా సాధికారతపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ

ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
►సీఎం జగన్‌ సారథ్యంలో మహిళా సాధికారతకు అడుగులు
►వైఎస్సార్‌ చేయూతలో మహిళలను సీఎం జగన్‌ ఆదుకుంటున్నారు
►యువత పేరుతో చంద్రబాబు దోచుకుంటున్నారు
►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా చంద్రబాబు యువతను మోసం చేశారు
►హెరిటేజ్‌కు లబ్ధి చేకూర్చేందుకు మిగతా డైయిరీలకు నష్టం కలిగించారు.
►స్కాముల సీఎంగా చంద్రబాబు గుర్తుండిపోతారు
►సీఎం జగన్‌ సారథ్యంలో మహిళా సాధికారత కోసం గత ప్రభుత్వాల కంటే పదిరెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నాం
►పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు పాస్‌ కాకముందే.. మూడేళ్లు ముందుగానే రాష్ట్రంలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు సీఎం జగన్‌


మంత్రి ఆర్‌కే రోజా ప్రసంగంలోని ముఖ్యాంశాలు

►నాలుగున్నరేళ్ల కాలంలో ప్రతి ఆడబిడ్డ కన్నీళ్లు సీఎం జగన్‌ తుడిచారు
►మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేశారు
►ప్రతి ఆడబిడ్డ కష్టాలు సీఎం జగన్‌ తీర్చుతున్నారు
►సీఎం జగన్‌ మహిళల కోసం చేసిన కృషిన చూసి.. మహిళలందరూ జయహో జగన్‌ అంటున్నారు
► సంక్షేమం అంటే ఏమిటో సీఎం జగన్‌ నాలుగున్నరేళ్లలో చేసి చూపించారు
►సీఎం జగన్‌ పాలనలో మహిళలు ఆర్థికంగా ఎంతో బలంగా మారారు

►14 ఏళ్లలో చంద్రబాబు ఏం చేశారో చెప్పగలరా?
►ఆడపుట్టకనే ఎగతాళి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు
►చంద్రబాబు చీటర్‌.. జగన్‌ లీడర్‌
►చంద్రబాబు చెప్పేవన్నీ మాయమాటలేనని మహిళలందరికీ తెలుసు
►చంద్రబాబును ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ నమ్మరు
►బాలకృష్ణ మొన్న తొడగొట్టారు.. ఇవాళ తోక ముడిచారు
►చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ
►సీఎం జగన్‌ సంక్షేమ పథకాలపై బాలకృష్ణ చర్చకు రాగలరా?
►రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్ష పార్టీ కాదు.. పనికిమాలిన పార్టీ
►మహిళలకు రాజకీయంగా సీఎం జగన్‌ ఎన్నో అవకాశాలు కల్పించారు
►దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే రాజకీయంగా సీఎం జగన్‌ అవకాశాలు ఇచ్చారు.

►రాష్ట్రంలో ప్రతి పేదింటి ఆడబిడ్డకు సీఎం జగన్‌ అండగా ఉన్నారు: ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి 
►రాష్ట్రంలో మహిళలకు రాజకీయంగా అవకాశం కల్పిస్తున్నారు: ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి 


మ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ప్రసంగంలోని ముఖ్యాంశాలు

►మహిళలకు రాజకీయంగా అనేక అవకాశాలు కల్పించారు సీఎం జగన్‌
►రాష్ట్రంలో మహిళలకు ఎన్నో పథకాలు అమలవుతున్నాయి.. అందుకు కారణం సీఎం జగన్‌
►మహిళల సాధికారత కోసం వైఎస్సార్‌సీపీ  కట్టుబడి ఉంది. 


ఎమ్మెల్యే కె. శ్రీదేవి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
►మహిళలకు అన్ని విధాలుగా సీఎం జగన్‌ చేయూత అందిస్తున్నారు
►పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నారు
►మహిళలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు
►మహిళల రక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నారు
►దిశా యాప్‌, మహిళా పోలీసుల ద్వారా రక్షణ కల్పిస్తున్నారు
►గత ప్రభుత్వంలో చంద్రబాబు పొదుపు సంఘాలను మోసం చేశారు

ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
►మహిళా రైతులకు సీఎం జగన్‌ అండగా ఉంటున్నారు
►మహిళా సంక్షేమంలో దేశంలో ఏపీ ఆదర్శంగా నిలిచింది
►మహిళలను శక్తివంతులుగా తయారు చేస్తున్నారు
►​​​మహిళలకు ఆదాయ మార్గాలను చూపిస్తున్నారు సీఎం జగన్‌

►మహిళల అభ్యున్నతి కోసం సీఎం జగన్‌ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు
►మహిళల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్‌ పాలన
►జగనన్న అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేస్తున్నారు.
►గత ప్రభుత్వంలో మహిళలు ఎన్నో కష్టాలు పడ్డారు


సమగ్ర భూసర్వేపై అసెంబ్లీలో చర్చ

మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రసంగంలోని ముఖ్యాంశాలు

►ప్రభుత్వ సంస్కరణలను అంతా అభినందించాలి
►అందుకే ఇన్ని సంస్కరణలు తీసుకొస్తున్నాం
► ఏ సంస్కరణ తీసుకొచ్చినా అవినీతి లేకుండా చేయాలనేదే సీఎం జగన్‌ సంకల్పం

►రైతుపై ఒక్క రూపాయి భారం లేకుండానే సర్వే చేశాం
►ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే పూర్తవుతుంది
►మరో రూ. 500 కోట్లు ఖర్చు పెడతాం

►4వేల గ్రామాల్లో సర్వే పూర్తయింది
►భూసర్వేకు 10వేల మంది సిబ్బందిని నియమించాం
►సర్వే కోసం ఇప్పటిదాకా రూ. 500 కోట్లు ఖర్చు పెట్టాం
►సర్వే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం
►భూసర్వే ఓట్ల కోసం చేసింది కాదు..భవిష్యుత్తు తరాల కోసం చేసింది

►అసెన్డ్‌ ల్యాండ్స్‌పై గతంలో ఎవరూ దృష్టిపెట్టలేదు
►వైఎస్సార్‌ హయాంలో 7 లక్షల ఎకరాలు అసెన్డ్‌ ల్యాండ్‌ అందజేశారు
►లంక భూములపై సాగుదారులకు సంపూర్ణహక్కు కల్పిస్తున్నాం
►అసైన్డ్‌ ల్యాండ్‌పై సర్వహక్కులు ప్రభుత్వం కల్పిస్తోంది


►ప్రజల పక్షాన నిలబడే నాయకుడు సీఎం జగన్‌
►రెవెన్యూశాఖలో సంస్కరణలు ఎంతో మేలు చేస్తున్నాయి
►అందరూ గర్వపడేలా సంస్కరణలు తీసుకొచ్చాం
►సంస్కరణలు చేయాలంటే సమాజాన్ని అర్థం చేసుకోవాలి.
►సీఎం జగన్‌ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నారు
►పాదయాత్రలో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తున్నారు.
►భూములు బలవంతంగా లాక్కునే పరిస్థితులు నేడు లేవు
►అసైన్డ్‌ ల్యాండ్‌పై సర్వ హక్కులు ప్రభుత్వం కల్పిస్తోంది.
►ఈ చట్ట సవరణ ద్వారా లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుంది. 

►అత్యాధునిక పద్దతిలో భూ సర్వే జరుగుతోంది: ఎమ్మెల్యే జగన్మోహన్‌రావు
►భూసర్వేతో కొన్నేళ్లుగా మిగిలిపోయిన సమస్యలకు పరిష్కారం 
►అన్ని వర్గాలకూ న్యాయం చేసే ఉద్ధేశంతోనే భూసమగ్ర సర్వే
►పేదలకు అసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కు గొప్పవరం: పాడేరు ఎమ్మెల్యే భాగలక్ష్మి

సమగ్ర భూసర్వేపై ఏపీ అసెంబ్లీలో చర్చ
►సీఎం జగన్‌ పేదవారికి అండగా నిలుస్తున్నారు: సుధాకర్‌ బాబు
►గత ప్రభుత్వం వదిలేసిన సమస్యలను సీఎం జగన్‌ పరిష్కరించారు.
►హామీలు ఇవ్వడమే కాదు దానిని అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే
►అందదికీ సమానమైన స్థాయి, న్యాయం జరగాలన్నదే ప్రభుత్వ ఆలోచన
►వ్యవసాయాన్ని పండుగలా చేసింది సీఎం జగన్‌
►సీఎం జగన్‌ కార్మికులు, కర్షకులను ప్రేమిస్తారు.
►భూమాతను కొందరికే సొంతం చేసిన వ్యక్తి చంద్రబాబు

►పవన్‌ విలన్లకు సపోర్టు చేస్తున్నాడు
►స్కిల్‌ స్కామ్‌లో దొరికిన వ్యక్తికి పవన్‌ సపోర్టు చేస్తున్నారు.
►రాజకీయాల్లో ఉండేందుకు చంద్రబాబు అనర్హుడు.
►ఏ వర్గానికీ చంద్రబాబు న్యాయం చేయలేదు
►ఏ రోజైనా పేదలకు ఇళ్ల పట్టలిచ్చావా చంద్రబాబూ?

4 బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ అసెంబ్లీ
►ఏపీ ప్రైవేటు యూనివర్సిటీస్‌ సవరణ బిల్లు
►గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ సవరణ బిల్లు 2023
►ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సవరణ బిల్లు 2023
►ఏపీ వస్తు సేవల పన్నుల సవరణ బిల్లు-2023

కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
►రెవెన్యూలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం: ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
►గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేసింది.
►సమగ్ర భూ సర్వే గొప్ప కార్యక్రమం.
►క్యూఆర్‌ కోడ్‌ ద్వారా భూ వివరాలు తెలుసుకోవచ్చు.
►అన్ని వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
►అసైన్డ్‌ భూములపై హక్కులు కల్పించడం పేదవారికి వరం.

భూదాన్‌-గ్రామదాన్‌ సవరణ బిల్లుకు ఆమోదం
►భూదాన్‌-గ్రామదాన్‌ సవరణ బిల్లుకు ఏపీ శాసన సభ ఆమోదం
►ఉమ్మడి రాష్ట్రంలో చట్టానికి ప్రస్తుతం కొన్ని మార్పులు చేశాం
►ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరణలు చేశాం
: మంత్రి ధర్మాన

శాసన సభలో..
►చర్చకు రమ్మంటే టీడీపీ సభ్యులు పారిపోయారు
►సాక్ష్యాధారాలతోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్‌ చేసింది
►బాబు పిటిషన్లను కోర్టు తిరస్కరిస్తుందంటే కేసు ఎంత బలంగా ఉందో అందరికీ అర్థమవుతోంది
►ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారు
►అసెంబ్లీలో మీసాలు మెలేసి, తొడలు కొడుతున్నారు
►అన్యాయాలు, అక్రమాలతో చంద్రబాబు రాజ్యాధికారం
►దొరికినవి కొన్నే.. దొరకని స్కామ్‌లు చాలానే ఉండొచ్చు
► దొరికిన దొంగ ఇక తప్పించుకోలేడు
::: మంత్రి అంబటి రాంబాబు
 

శాసనమండలిలో..
►24వేల 876 మత సంస్థలు సత్రాలకు సంబంధించిన నాలుగు లక్షల 65 వేల ఎకరాల భూమి దేవదాయశాఖ ఆధీనంలో ఉంది 
► 1,44,000 ఎకరాల భూమి భూమి లీజుకు ఇచ్చాము
►దానిద్వారా 1. 55 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది
►దేవాదాయ భూముల పరిరక్షణ కోసం సెక్షన్ 83 జీవో ను తీసుకు వచ్చాము
►దేవాదాయ శాఖ భూములు ఆక్రమించిన సెక్షన్ 83 ద్వారా 8 సంవత్సరాలు జైలు శిక్ష ,ఒక లక్ష జరిమానా విధించ బడును
►దేవాదాయ శాఖ భూముల పై లీజు చెల్లించుకున్న ఆక్రమణ చేసిన కఠిన చర్యలు తీసుకుంటాము
►తిరుమలలో  భక్తుల రక్షణ కోసం ట్రాప్ 330 కెమెరాలను ఏర్పాటు చేశాము
►ఇప్పటికే ఆరు చిరుతలు ట్రాప్ కెమెరాలకు  చిక్కాయి
►ఏడో మైలురాయి వద్ద వన్యప్రాణి సంరక్షణ నిమిత్తం టీటీడీ, అటవీశాఖ ఆధ్వర్యంలో స్టేషన్ ఏర్పాటు చేశాము
►భక్తులకు వెదురు కర్ర సైతం అందజేస్తున్నాము
►ఏడో మైలు రాయి వద్ద వంద నుండి 200 మందిని గుంపులు గుంపులుగా పంపుతున్నాము
►కాలినడక మార్గంలో 500 మీటర్ల పొడవునాలైటింగ్ ఏర్పాటు చేస్తున్నాము
►చిరుత దాడిలో  మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని సైతం ప్రభుత్వం ఆదుకుని ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేసింది
►వైల్డ్ లైఫ్ ఇండియా డెహ్రాడూన్ వారిచే ఒక అధికారుల బృందం చే సర్వే చేయిస్తున్నాము
►ఆ నివేదిక ఆధారంగా పలు చర్యలు తీసుకుంటాము.
:::దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కామెంట్స్
 

సీఎం జగన్‌ పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
►ఏపీ విద్యార్థులు ఐక్యరాజ్యసమితిలోప్రసంగించడం హర్షనీయం
►విద్యావ్యవస్థలో సమూల మార్పులు రావడమే దీనికి కారణం


ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అసెంబ్లీలో చర్చ

►గత ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ఆంక్షలు పెట్టింది
►సీఎం జగన్‌ పేదవాడి సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అందిస్తున్నారు.
►రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ. 160.23 కోట్లు
►మత్స్యాకార భరోసా కింద రూ. 6.10 కోట్లు
►వైఎస్సార్‌ సున్నా వదడ్డీ రూ. 817.61 కోట్లు
►వైఎస్సార్‌ పింఛన్‌ కానుక రూ. 13,410.52 కోట్లు

శాసనమండలి
► చేనేత కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటాం: మంత్రి గుడివాడ అమర్నాథ్‌
►బడ్జెట్‌లోనూ చేనేత కార్మికులకు ప్రాధాన్యత
 ►గత ప్రభుత్వ చేనేతలకు అందించాల్సిన సబ్సిడీలో రూ. 106 కోట్ల బకాయిలను పెట్టింది
►వైఎస్సార్‌ నేతన్న నేస్తం రూపంలో సీఎం జగన్‌ అండగా నిలిచారు.
►ఐదు విడదల్లో 82 వేల మందికి రూ.960 కోట్లు వారి  ఖాతాలో జమచేశారు.
►ఇతర సబ్సిడీల రూపంలో రూ.40 కోట్ల మీర నేతన్నలకు ప్రయోజనం చేకూర్చారు
►ఆప్కో వస్త్రాలను ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా మార్కెటింగ్‌ చేస్తున్నాం

►నేషనల్‌ హ్యాండ్లూమ్‌ బోర్డు కేంద్రం రద్దు చేసింది
►దానిని పునురద్దరించాలని కేంద్రానికి లేఖ రాస్తాం
►రాష్ట్రంలో లక్షా 65వేల మంది చేనేత కార్మికులు ఉన్నారు
►చేనేతలకు సంబంధించిన 11 రకాల వస్త్రాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు హ్యండ్లూమ్‌ రిజస్ట్రేషన్‌ యాక్ట్‌ తెచ్చాం
►కేంద్ర జౌళి శాఖలో 55 శాతం చేనేతకు బడ్జెట్‌ కేటాయింపులనుప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతాం

అసెంబ్లీకి చేరుకున్న సీఎం జగన్‌

►విద్యలో సీఎం జగన్‌ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు.  దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి

►రైతులకు మేలు చేసింది సీఎం జగన్‌ మాత్రమే: వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు 
►పాలవెల్లువ కార్యక్రమంతో పాడి రైతులకు ఎంతో మేలు చేశారు

►జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనతో లక్షలాది మందికి లబ్ధి: మంత్రి మేరుగు నాగార్జున
►చదవుకు మా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది
►రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమం కోసం చర్యలు తీసుకున్నాం
►ప్రతీ సంక్షేమ పథకం పారదర్శకంగా అమలు చేస్తున్నాం

రైతు సంక్షేమ ప్రభుత్వం ఇది
►గత ప్రభుత్వం రైతుల్ని మోసం చేసింది
►రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం జగన్‌ సిద్ధాంతం
►కోవిడ్‌ సంక్షోభంలోనూ మా ప్రభుత్వం రైతులను ఆదుకుంది.
►రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది
►రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం
►ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం
::: మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన వ్యక్తి సీఎం జగన్‌: గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి
►రుణమాఫీపై చంద్రబాబు మోసం చేశారు.
►ఇచ్చిన హామీల్లో 10శాతం కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు.
►చంద్రబాబు పెట్టి వెళ్లిపోయిన బకాయిలన్నీ సీఎం జగనే చెల్లించారు.
► గత నాలుగేళ్లుగా సీఎం జగన్‌ రైతుభరోసా కింద రూ.31వేల కోట్లు అందించారు.

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ
►పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నేడు సమావేశం
►- భేటీకి హాజరుకానున్న టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు
►అసెంబ్లీ సమావేశాలకు సమాంతర కార్యక్రమాల నిర్వహణపై చర్చ
►తదుపరి కార్యాచరణపై ఎన్టీఆర్ భవన్‌లో జరిగే టీడీఎల్పీ భేటీలో చర్చ

► మూడో రోజు ఏపీ  అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

సాక్షి, అమరావతి: మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభలో ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు.  మహిళ సాధికారతపై చర్చించనున్నారు. మహిళ రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా అసెంబ్లీ తీర్మానం చేయనుంది. అనంతరం అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ, భూ సంస్కరణలపై చర్చ సాగనుంది. మరోవైపు 10 గంటలకు శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి చర్యలపై చర్చించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement