5:00 PM
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 5 రోజులపాటు సమావేశాలు కొనసాగాయి. పలు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. కీలక రంగాలపై చర్చలు జరిగాయి. పోలవరం, నాడు-నేడు, వ్యవసాయంపై సభా సభ్యులు చర్చించారు.
4:40 PM
పోడియంపైకి వచ్చి వపక్ష ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం బాధాకరమని స్పీకర్ అన్నారు. అలాంటి వాళ్లు సభకు రావడం దురృష్టకరమన్నారు. సభలో ప్రతిపక్ష సభ్యులు వ్యహరించిన తీరుపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. మార్షల్స్‌ను టీడీపీ సభ్యులు కొట్టడం సరికాదన్నారు. చైర్‌ను ఉద్ధేశించి వాడిన పదజాలం సరికాదన్నారు. సమష్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
4:00 PM
‘బాబు హయాంలో రైతులకు బీమా పరిహారం అందలేదు. సున్నా వడ్డీ కింద నేరుగా రైతుల ఖాతాల్లో వడ్డీ జమ చేస్తున్నాం. రైతులకు వడ్డీ రాయితీ నవంబర్‌లో అందిస్తాం. మూడేళ్లలో 65.65 లక్షల మంది రైతులకు రూ.1,282 కోట్లు చెల్లించాం. బాబు పెట్టిన బకాయిలు రైతులకు మనమే చెల్లించాం. రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తానని బాబు వాగ్ధానం చేశారు. రుణమాఫీ చేయకుండ బాబు రైతులను దగా చేశారు. చివరికి రైతులకు సున్నా వడ్డీని బాబు ఎగ్గొట్టారు’ అని సీఎం జగన్ మండిపడ్డారు.
4:00 PM
ఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా పడింది.
3:45 PM
►గత మూడేళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సగటున 167.99 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. 40 నెలల్లో వ్యవసాయ రంగంపై లక్షా 28 వేల 634 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.
► ‘ఆర్బీకేలతో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. రైతులకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తున్నాం. ఈ మూడేళ్లలో 98.4% హామీలు అమలు చేశాం. బాబు హయాంలో ప్రతి సంవత్సరం కరువే. కరువు, బాబు ఇద్దరూ కవలలు.
►కుప్పం నుంచి ఇచ్చాపురం వరు వాగులు, వంకలు కళకళలాడుతున్నాయి. రాష్ట్రంలోని 5 ప్రధాన నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కృష్ణా, గోదావరి డెల్టాలతోపాటు రాయలసీమ రైతులకు అత్యధికంగా సాగునీరు. గత మూడేళ్లలో రికార్డు స్థాయిలో పంట దిగుబడులు. సగటున 13, 29 లక్షల టన్నుల దిగుబడి పెరిగింది. రైతులో కాదు.. రైతుల కూలీలూ సంతోషంగా ఉన్నారు.’ అని సీఎం జగన్ తెలిపారు.
3:30 PM
►ఒకప్పుడు రాష్ట్రంలో రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారని చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా అన్నారు. వైఎస్సార్ హయాంలో రైతులకు స్వర్ణయుగం ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ మూడేళ్లలో సీఎం జగన్ రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు
3:10 PM
►రాష్ట్రంలో 65 లక్షల కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడ్డాయని ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తెలిపారు. వైఎస్సార్ రైతులకు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించారని ప్రస్తావించారు. చంద్రబాబు హయాంలో రైతులు కరువుతో ఇబ్బందులు పడ్డారని అన్నారు. 52 లక్షల మందికి రైతు భరోసా అందుతోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో అగ్రీ ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
►‘నేడు రాష్ట్రంలో కరువు లేదు. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండంగా ఉంటోంది. ఆర్బీకేల ద్వారా రైతులకు అండగా నిలుస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మన ఆర్బీకేల పనితీరును పరిశీలించింది. తమిళనాడు ప్రభుత్వం నుంచి మన ఆర్బీకేల పనితీరుకు ప్రశంసలొచ్చాయి’ అని సామినేని ఉదయభాను తెలిపారు
2:45 PM
చంద్రబాబు హయాంలో వ్యవసాయ రంగం నిర్వీర్యం అయిపోయిందని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని ప్రస్తావించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై అసెంబ్లీలో బుధవారం చర్చ జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ హయాంలో మళ్లీ రైతులకు మంచి రోజులొచ్చాయని గుర్తు చేశారు. వ్యవసాయ రంగానికి మహానేత వైఎస్సార్ ప్రాధాన్యత ఇచ్చారన్నారు..
►రైతు భరోసా కింద మూడేళ్లలో రూ. 23,850 కోట్లు అందించారు. చంద్రబాబు పాలనలో ఇన్‌పుట్ సబ్సిడీ రాని పరిస్థితి. టీడీపీ హయాంలో విద్యుత్ బకాయిలను పెట్టారు. టీడీపీ హయాంలో పెట్టిన బకాయిలను సీఎం జగన్ ప్రభుత్వం తీర్చుతోంది’ అని పేర్కొన్నారు.
2:30 PM.
►వైఎస్సార్ ఆశయాలను సీఎం జగన్ నెరవేర్చుతున్నారని ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నామని, సకాలంలో ఎరువులు అందిస్తున్నామన్నారు. ఆక్వా రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. మత్స్యకారులను ఆదుకుంటున్నామన్నారు.
►‘రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ధరల స్థిరీకరణ కోసం రూ. 3 వేల కోట్లు అందుబాటులో ఉంచాం. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి. చంద్రబాబు హయాంలో రైతులకు ఇచ్చిన హామీలేవి అమలు చేయలేదు’ అని కోన రఘుపతి పేర్కొన్నారు.
1:28 PM
►2019 మార్చి నాటికి రూ. 40, 172 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉంటే.. ప్రస్తుతం రూ.21 673 కోట్ల బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. చంద్రబాబు హయాంలోని రూ. 20 వేల కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాం. గత ప్రభుత్వం కంటే తక్కువ అప్పులే చేశాం. ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ప్రగతి సాధించాం. కోవిడ్ సంక్షోభంలోనూ ఏపీలో స్థూల ఉత్పత్తి పెరిగింది.
► ఇతర రాష్ట్రాలతో పోలీస్తే ఏపీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. క్రిసిల్ రేటింగ్ పేరుతలో ఆర్థిక వ్యవస్థపై ఎల్లో మీడియా దుష్ప్రచారం. రాష్ట్రానికి ఎటువంటి సహాయం అందకూడదని టీడీపీ కుట్ర.చంద్రబాబు అప్పులు చేస్తే గొప్ప అన్నట్లు ప్రచారం. ఈ ప్రభుత్వం అప్పు చేస్తే తప్పంటూ దుష్ర్పచారం: మంత్రి బుగ్గన
13:26
►సభను ఎల్లో మీడియా అవమానపరుస్తోంది. అసెంబ్లీలో చెప్పిన లెక్కలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. క్రిసిల్ రేటింగ్ పేరుతో ఆర్థిక వ్యవస్థపై ఎల్లో మీడియా దుష్ప్రచారం. రాష్ట్రానికి ఎటువంటి సహాయం అందకూడదని టీడీపీ కుట్ర- మంత్రి బుగ్గన
13:16 PM
►ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం.
►ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం.
► సీఆర్డీఏ చట్ట సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీలో ఆమోదం లభించింది. పేదల కోసం చేపట్టే ఇళ్ల నిర్మాణానికి అనుమతిస్తూ చట్ట సవరణ జరిగింది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు కేటాయించేందుకు చట్ట సవరణ చేశారు.
12:21PM
►ఎన్టీఆర్‌ను తక్కువ చేసి మాట్లాడేవారు దేశంలోనే ఉండరు. ఎన్టీఆర్‌పై చంద్రబాబు కంటే నాకే ఎక్కువ గౌరవం. నేను ఎప్పుడూ ఎన్టీఆర్‌ను ఒక్కమాట కూడా అనలేదు. ఎన్టీఆర్ పేరు తీసుకుంటే చంద్రబాబుకు నచ్చదు. చంద్రబాబు పేరు తీసుకుంటే పైనున్న ఎన్టీఆర్‌కు నచ్చదు. వెన్నుపోటు పొడవకపోయి ఉంటే ఎన్టీఆర్ ఎక్కువ కాలం సీఎంగా ఉండేవారు. చంద్రబాబు ఎప్పటికీ సీఎం అయ్యేవారు కాదు: సీఎం జగన్
12:13PM
హెల్త్‌వర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం సంతోషకరం. ఆరోగ్య శ్రీ అనే పథకాన్ని వైఎస్సార్ తెచ్చారు. వేల ప్రాణాలను ఆరోగ్యశ్రీ కాపాడింది. ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే ఎందుకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చరిత్ర చంద్రబాబుది: మంత్రి రోజా
12:00PM
►ఎన్టీఆర్ పట్ల చంద్రబాబుకు గౌరవం లేదు. ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ పేరు తీసేస్తామని బాబే చెప్పారు. ఎన్టీఆర్ అవసరం లేదని చంద్రబాబే చెప్పారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. వైఎస్సార్ గొప్ప మానవతావాది. కేంద్రంతో టీడీపీకి పొత్తు ఉన్నప్పుడు ఏపీకి ఏం చేశారు?. రాష్ట్ర ప్రజలు బాగుపడటం టీడీపీకి ఇష్టం లేదు.: విడదల రజని
11:58
► ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మారుస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి విడదల రజిని
11:32AM
►సభలో టీడీపీ సభ్యుల తీరు చాలా బాధాకరం. అధికారం కోల్పోయినప్పుడు మాత్రమే చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తుకువస్తారు: అబ్బయ్య చౌదరి
►మార్షల్స్‌పై టీడీపీ సభ్యులు దాడి చేశారు. దాడికి దిగిన టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలి: మంత్రి మేరుగ
11:24AM
►ఎన్టీఆర్‌ను గౌరవించిన పార్టీ వైఎస్సార్‌సీపీ. ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేశాం. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ ►కుమారుల్ని వాడుకుని వదిలేసిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ కుటుంబాన్ని చిందరవందర చేసిన వ్యక్తి చంద్రబాబు: మంత్రి అంబటి రాంబాబు
11: 16AM
►అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
►స్పీకర్ పోడియం వద్ద దురుసుగా ప్రవర్తించిన టీడీపీ ఎమ్మెల్యేలు
►వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తన
►పేపర్లు చించి స్పీకర్‌పైకి పదే పదే విసిరికొట్టిన టీడీపీ సభ్యులు
►సభకు పదే పదే ఆటంకం కల్గిస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం
9:29AM
► అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల రభస
►టీడీపీ ఎమ్మెల్యేల అనుచిత ప్రవర్తన
►పేపర్లు చించి స్పీకర్ పైకి విసిరి కొట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు
►స్పీకర్ చైర్ వద్ద దురుసుగా ప్రవర్తించిన టీడీపీ ఎమ్మెల్యేలు
►టీడీపీ ఎమ్మెల్యేల పై అసభ్య ప్రవర్తన తో వెల్ లోకి వెళ్లిన వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు
► ఉద్రిక్తత తలెత్తడంతో సభ వాయిదా
9:17AM
►చంద్రబాబును చూసి ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుంటుంది. ఈ టీడీపీ నేతలంతా ఎన్టీఆర్‌కు ద్రోహం చేయలేదా?, చంద్రబాబు విశ్వాస ఘాతకుడు. ఔరంగజేబుకు, చంద్రబాబుకు తేడా లేదు: నారాయణ స్వామి
09:09AM
►టీడీపీ సభ్యులు చంద్రబాబు ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నారు. టీడీపీ సభ్యులు పోడియ దగ్గరకు ఎందుకు వస్తున్నారు. త్వరగా సస్పెన్షన్ చేయించుకోవాలని ఆరాటపడుతున్నారు. టీడీపీ సభ్యుల బాధ ఏంటో అర్థం కావడం లేదు: మంత్రి అంబటి రాంబాబు
09:08AM
09:05AM
► అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. ప్రశ్నోత్తరాలు చేపట్టారు శాసనసభ స్పీకర్ తమ్మినేని. అయితే.. సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే టీడీపీ సభ్యులు గొడవకు దిగారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకునే యత్నం చేస్తున్నారు.
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఐదవ రోజు ప్రారంభం అయ్యాయి. ఇవాళ సభలో తొమ్మిది బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. వ్యవసాయ అనుబంధ రంగాలపై చర్చ సాగనుంది. 2020-21 సీజన్ కాగ్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టనున్న మంత్రి బుగ్గన.
Comments
Please login to add a commentAdd a comment