నాడు-నేడుతో విద్యావ్యవస్థలో గొప్ప మార్పులు తెచ్చాం: మంత్రి బొత్స | AP Assembly Sessions Sep 16th 2022: Day 2 Live Updates | Sakshi
Sakshi News home page

ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2022 : ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా

Published Fri, Sep 16 2022 8:50 AM | Last Updated on Fri, Sep 16 2022 6:41 PM

AP Assembly Sessions Sep 16th 2022: Day 2 Live Updates - Sakshi

ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. డే-2 అప్‌డేట్స్‌

4:20PM
►నాడు-నేడుతో విద్యావ్యవస్థలో గొప్ప మార్పులు తెచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నాడు-నేడుతో స్కూల్స్‌ రూపురేఖలే మారిపోయాయి అన్నారు. నాణ్యమైన విద్యా అందించడమే ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. బైజూస్‌ సంస్థతో ఒప్పందం చేసుకన్నామని పేర్కొన్నారు. విద్యార్థులకు 8వ తరగతి నుంచే ట్యాబ్‌లు అందించనున్నామని వెల్లడించారు.

3:30PM
►ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి.

3:00PM
►‘కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర అప్పులు తక్కువగానే ఉన్నాయని సీఎం జగన్‌ అన్నారు. చంద్రబాబు హయాంలో అప్పులు 17.45 శాతం పెరిగాయని తెలిపారు. కేంద్రం కంటే ఎక్కువ అప్పులు చేసిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. ఈ మూడేళ్లలో కేంద్ర రుణాలు 135 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. ఈ మూడేళ్లలో కేంద్రం అప్పులు 43.8 శాతం పెరిగాయని తెలిపారు.

►‘విభజన నాటికి రాష్ట్ర రుణాలు రూ.1.26 లక్షల కోట్లు. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ. 2.69 లక్షల కోట్లు. బాబు హయాంలో ఐదేళ్లలో రాష్ట్రంలో 123.52% అప్పులు పెరిగాయి. ఈ మూడేళ్లలో రాష్ట్ర రుణాలు 3.82 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ మూడేళ్లలో రాష్ట్ర రుణాలు 41.4 శాతం పెరిగాయి. కేంద్రంతో పోలిస్తే ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అప్పు తగ్గింది’ అని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు.

2. 30PM
►మేనిఫెస్టోలో చెప్పిన 98.4 శాతం హామీలు అమలు చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. కోవిడ్‌ సహా ఎన్నో సవాళ్లు ఎదురైనా రాష్ట్ర ఆర్థిక ‍ వ్యవస్థ అద్భుతంగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ఢోకా ఏమీ లేదని స్పష్టం చేశారు.

►రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్‌ విమర్శించారు. చంద్రబాబు అండ్‌ దొంగల ముఠా లేనిది సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, మీడియా వ్యవస్థలను చేతిలో పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పుడు కేసులతో కొన్ని శక్తులు పథకాలను అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు.

2. 10PM
►లక్షా 57 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు పెట్టిన బకాయిలు కూడా చెల్లించామని తెలిపారు. ఏపీ అసెంబ్లీలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ తొలిస్థానంలో ఉందన్నారు.

►గతంలో ప్రభుత్వం పంపిన నివేదికల ఆధారంగా ర్యాంక్‌లు వచ్చాయన్నారు. ఈసారి 301 అంశాలపై సర్వే చేసి ర్యాంక్‌లు ఇచ్చారని పేర్కొన్నారు. బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పరిశ్రమలు వస్తుంటే టీడీపీ నేతలకు కడుపు మంటగా ఉందని దుయ్యబట్టారు. 

1:45PM
ఏపీలో వందేళ్ల తర్వాత రీ సర్వే జరుగుతోంది. రీ సర్వే ద్వారా ఎంతో మంది రైతులకు ప్రయోజనం. గతంలో చంద్రబాబు ముంచేసిన పరిశ్రమలకు సీఎం జగన్‌ చేయూత అందించారు. స్పిన్నింగ్‌ మిల్లులకు 700 కోట్ల సబ్సిబీని అందించారు: బ్రహ్మనాయుడు

01:22PM
బాబు చేసిన అప్పుల భారాన్ని జగన్‌ మోస్తున్నారు 

► ఏపీ అసెంబ్లీలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధి అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి మాట్లాడుతూ.. ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఏనాడూ అభివృద్ధిని పట్టించుకోలేదు. పరిశ్రమల స్థాపన కేవలం కాగితాలకే పరిమితమైంది. చంద్రబాబు తన వైఫల్యాలను మాపై మోపుతున్నారు. చంద్రబాబు చేసింది అప్పులే తప్ప అభివృద్ధి లేదు. పోతూపోతూ లక్షకోట్ల భారం మోపారు. గ్రాఫిక్స్‌తో రాజధాని రైతులను మోసం చేశారు. రుణమాఫీ పేరిట రైతులు, మహిళలను ముంచేశారు. ఆ అప్పులను సీఎం జగన్‌ పెద్ద మనసుతో తీర్చారు. రాష్ట్రంలో ప్రతీ రూపాయిని ప్రజలకు చేరవేస్తున్నారని అన్నారు. 

12:55PM
► అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఎనిమిది కీలక బిల్లులకు శాసనసభ ఆమోదం.

12:35PM
పార్టీలకతీతంగా ఏపీలో సంక్షేమ పథకాలు. లబ్దిదారులకు నేరుగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.  గత ప్రభుత్వం దోచుకుని దాచుకోవడానికి పరిమితమైంది.  ఏపీ అప్పులపై ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది.  అప్పులపై కేంద్ర ప్రభుత్వమే స్పష్టత ఇచ్చింది. స్టార్టప్‌ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చేందుకు సీఎం కృషి చేస్తున్నారు: అబ్బయ్య చౌదరి

11:55AM

►రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం జగన్‌ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు.మూడేళ్లుగా రాష్ట్ర ఇమేజ్‌పై ప్రతిపక్షం విషం చిమ్ముతోంది. రాష్ట్రానికి పట్టిన దరిద్రమే ప్రతిపక్ష నేత చంద్రబాబు. తప్పుడు నివేదికలతో ప్రజలను చంద్రబాబు మభ్యపెట్టారు. చంద్రబాబు తీరును మాకీ సంస్థ తీవ్రంగా తప్పుబట్టింది. గత టీడీపీ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైంది. గతంలో కేవలం కాగితాల్లో మాత్రమే పెట్టుబడులు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ప్రజలు బాదేస్తారు: పార్థసారథి

పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులపై చర్చ

11:53AM
►అసెంబ్లీలో సభ్యుల హక్కులను టీడీపీ హరిస్తోంది. టీడీపీ సభ్యుల తీరును ప్రజలు గమనించాలి. అసెంబ్లీ అంటే టీడీపీకి గౌరవం లేదు. ప్రతిరోజూ ఇదే విధంగా వ్యవహరిస్తోంది: స్పీకర్‌ తమ్మినేని

11:49AM

►టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్‌ చేశారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం. టీడీపీ సభ్యుల తీరు మారకపోవడంతో వారిని సస్పెండ్‌ చేశారు స్పీకర్‌.  సభా కార్యక్రమాలకు పదే పదే ఆటకం కల్గిస్తుండటంతో ఒక్కరోజు పాటు సస్పెండ్‌ చేశారు.

11:35AM
అసెంబ్లీలో మారని టీడీపీ తీరు
►అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ తీరు ఎంత మాత్రం మారలేదు. రెండో రోజు సమావేశాల్లో సభ జరుగుతుండగా.. నినాదాలతో మంత్రులు, స్పీకర్‌ ప్రసంగాలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీ సభ్యులు. సజావుగా సాగాలనే విజ్ఞప్తులను వాళ్లు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు.

11:30AM
శాసన సభలో 8 బిల్లులు
► అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. ఎనిమిది బిల్లులను ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం. సభ ముందుకు సివిల్‌ సర్వీసెస్‌ రిపీల్‌ బిల్లు, అగ్రికల్చర్‌ అండ్‌ మార్కెటింగ్‌ బిల్లు, ల్యాండ్‌ టైటిలింగ్‌ బిల్లు, యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, పంచాయితీ రాజ్‌ సవరణ బిల్లు.. ఇతరాలు వచ్చాయి. మరోవైపు  ఆర్థికాభివృద్ధి పైనా కొనసాగుతున్న స్వల్ప చర్చ కొనసాగుతోంది.

10:49AM
ఏపీ శాసనమండలిలో.. 
► ఏపీ శాసనసభ సమావేశాలు రెండోరోజు సమావేశాల్లో భాగంగా.. ఉద్దేశపూర్వకంగా శాసనమండలిని అడ్డుకునేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నించారు. ఈ సందర్భంలో.. వ్యవసాయ దండుగ నుంచి వ్యవసాయ పండుగ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు స్పందించడం.. దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్న చందాన ఉందని మంత్రి అంబటి ఎద్దేవా చేశారు. ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి అంబటి ఈ సందర్భంగా తెలిపారు. సభాకార్యక్రమాలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే యత్నం చేస్తున్నారని, మంత్రి ప్రసంగాన్ని అడ్డుకోవడం సముచితమేనా? అని మండలి చైర్మన్‌ టీడీపీ సభ్యులను ప్రశ్నించారు.

9:56AM
►ప్రతి పౌరుడికి చౌకగా వైద్యం అందించేందుకు సీఎం జగన్‌ కృషి. వైద్యం కోసం ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళ్లకూడదన్నదే ధ్యేయం.రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. మెడికల్‌ కాలేజ్‌ల పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గత టీడీపీ హయాంలో ఒక్క మెడికల్‌ కాలేజ్‌నూ తీసుకురాలేదు. టీడీపీ హయాంలో దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే జరిగింది: విడదల రజని

9:39 AM
►టీడీపీ హయాంలో దేవాలయాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. టీడీపీ హయాంలో 23 దేవాలయాలను కూలగొట్టారు. రూ. కోటికి పైగా ఖర్చు చేసి రథాన్ని తయారు చేశాం. రూ. 3 కోట్లతో రామతీర్థం ఆలయాన్ని పునరుద్ధరించాం. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక భక్తుల విశ్వాసాలను నిలబెట్టారు. చంద్రబాబు షూటింగ్‌ పిచ్చికి అమాయకులు బలయ్యారు: కొట్టు సత్యనారాయణ

9:30 AM
► పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకునేందుకు టీడీపీ యత్నాలు. పరిశ్రమల ఏర్పాటుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. పరిశ్రమల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ వద్దంటూ లేఖ రాశారు. కడప స్టీల్‌ప్టాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: గుడివాడ అమర్నాథ్‌

9:22 AM
► స్టీల్‌ ప్లాంట్‌ కోసం బడ్జెట్‌లో రూ. 250 కోట్లు పెట్టాం.  480 ఎకరాలకు రూ. 37 కోట్ల పరిహారం ఇచ్చాం.  చట్టంలో ఏముందో టీడీపీ నేతలు చదివారా? మంత్రి బుగ్గన

09:10 AM
► ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. రెండో రోజు సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టారు స్పీకర్‌ తమ్మినేని. 

09:07 AM
► సోమవారం మధ్యాహ్నాం 12 గంటల ప్రాంతంలో డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఉంటుందని స్పీకర్‌ తమ్మినేని ప్రకటించారు. 

09:02 AM
► ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభం అయ్యాయి.

08:40 AM
► ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండో రోజు.. కాసేపట్లో ప్రారంభం కానున్నాయి.

07:55 AM
► ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 2022: రెండో రోజు సమావేశాల్లో  ఎనిమిది బిల్లులను ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. ఇండియన్ స్టాంప్స్ సవరణ బిల్లు, యూనివర్సిటీ ల చట్ట సవరణ బిల్లు,ఆర్.జి.యూ.కె.టి సవరణ బిల్లు,పంచాయతీ రాజ్ సవరణ బిల్లు,రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లు,సివిల్ సర్వీసెస్ రిపీల్ బిల్లు,అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ సవరణ బిల్లు,ల్యాండ్ టైటిలింగ్ బిల్లులు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. 

07:50AM
► ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 2022: రెండో రోజు సమావేశాల్లో..  ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ వార్షిక నివేదికలను సభ లో ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం.

07:32AM
► ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 2022: రెండో రోజు సమావేశాల్లో.. శాసన మండలిలో బీఏసీ నివేదిక ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. ఆపై విద్యా సంస్కరణలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.

07:30AM
► ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 2022: పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, ఆర్ధికాభివృద్ధి అనే అంశంపై ఇవాళ రెండో రోజు సమావేశాల్లో స్వల్ప కాలిక చర్చ జరగనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement