లింగమనేని పొలం మధ్యలో నుంచి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌: పేర్ని నాని ఫైర్‌ | Ex Minister Perni Nani Serious Comments On Chandrababu Over Inner Ring Road Scam Case In AP Assembly - Sakshi
Sakshi News home page

లింగమనేని పొలం మధ్యలో నుంచి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌: పేర్ని నాని ఫైర్‌

Published Wed, Sep 27 2023 2:51 PM | Last Updated on Wed, Sep 27 2023 3:23 PM

Ex Minister Perni Nani Serious Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కొనసాగుతున్నాయి. సమావేశాల్లో భాగంగా అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కామ్‌పై సభలో చర్చ జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నేత లింగమనేని రమేష్‌ పొలం మధ్యలో నుంచి ఇన్నర్ రింగ్‌ రోడ్డు వచ్చేలా ప్లాన్‌ మార్చారని తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని.

హెరిటేజ్‌, నారాయణ కాలేజ్‌ కోసం ప్లాన్‌ మార్పు..
కాగా, అసెంబ్లీలో పేర్ని నాని మాట్లాడుతూ.. రాజధానిపై చంద్రబాబు రోజుకో డ్రామా నడిపారు. చంద్రబాబు ప్రభుత్వంలోని అవినీతి కథల్లో ఇది కూడా ఒకటి. దోపిడీకి దొంగలు రెక్కీ చేసినట్టుగా రింగ్‌ రోడ్డు స్కామ్‌ జరిగింది. ఇది కేబినెట్‌ నిర్ణయమంటూ చంద్రబాబు కబుర్లు చెప్పారు. మాస్టర్‌ ప్లాన్‌ పేరుతో స్కామ్‌ నడిపించారు. లింగమనేని రమేష్‌ పొలం మధ్యలో నుంచి ఇన్నర్ రింగ్‌ రోడ్డు వచ్చేలా ప్లాన్‌ మార్చారు. హెరిటేజ్‌ సంస్థ, నారాయణ కాలేజీల కోసం ప్లాన్‌ మార్చారు. ఏ-14గా ఉన్న లోకేష్‌ ఐఆర్‌ఆర్‌తో నాకేం సంబంధం అంటున్నారు. 2008 నుంచి 2017 వరకు హెరిటేజ్‌ సంస్థకు లోకేష్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. లోకేష్‌ హెరిటేజ్‌ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నప్పుడే అమరావతిలో భూములు కొనాలని నిర్ణయించారు.

నారా భువనేశ్వరి సూక్తులు..
చంద్రబాబు, నారాయణ దళితుల పేదల నుంచి అసైన్డ్‌ భూములను లాక్కున్నారు. చట్టం ప్రకారం అసైన్డ్‌ భూములు లాక్కోవడం సాధ్యం కాదని చెప్పినా వినలేదు. న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పినా జీవో-41 విడుదల చేశారు. దొంగలు రెక్కీ చేసినట్టుగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కామ్‌ చేశారు. కేసులు ఎక్కువగా ఉన్నవారికి నామినేటెడ్‌ పదవులు ఇస్తామన్న లోకేష్‌ ఇప్పుడు ఎక్కడ?. ఇక్కడ యువతను రెచ్చగొట్టి ఇప్పుడు ఢిల్లీలో తిరుగుతున్నారు. రూ.371 కోట్లకు ఇంత రాద్ధాంతం దేనికని నారా భువనేశ్వరి సూక్తులు చెబుతున్నారు. రూ. 371​కోట్లు టిప్పే అనుకుంటే అమరావతిలో 10 ఎకరాలు ఎందుకు కొన్నారు?. 

ఎకరం భూమి తక్కువకు కొనుగోలు..
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును అటు తిప్పి.. ఇటు తిప్పి పాల కంపెనీకి 5 ఎకరాలు ఇచ్చారు. దేశభక్తితోనే నా ఇల్లును చంద్రబాబుకు ఇచ్చినట్టు లింగమనేని హైకోర్టులో చెప్పారు. సీఎం పదవి పోయిన వెంటనే రూ.27లక్షలు లింగమనేనికి అద్దె ఇచ్చారు. రూ.27లక్షల లావాదేవీలపై నారా, లింగమనేని కుటుంబాలు చెప్పవు. రాజధాని ఏర్పాటుపై కమిటీ ఇచ్చిన రిపోర్టును చంద్రబాబు తుంగలో తొక్కారు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో రాజధాని ఏర్పాటుకు జీవో ఇచ్చారు. ల్యాండ్‌ పూలింగ్‌కు ఒప్పుకోని వారిని ఏ-2, ఏ-14 బెదిరించారు. ప్రభుత్వ భూమిని గవర్నమెంట్‌ లాక్కుంటుదని భయపెట్టారు. ఎకరం భూమిని రెండు నుంచి ఐదు లక్షలకే రాయించుకున్నారు. ఇలాంటి వాళ్లకు శిక్ష పడాల్సిందే అని అన్నారు. 

ఇది కూడా చదవండి: ఇన్నర్‌ రింగ్‌రోడ్డు స్కామ్‌: నారా లోకేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement