
‘‘పచ్చని చిలకలు తోడుంటే.. పాడే కోయిల వింటుంటే.. భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింకా చెల్లు! ఓ పాటలోని పల్లవి ఈ వృద్ధ దంపతులను చూస్తుంటే సరిగ్గా సరిపోతుందని అనిపిస్తుంది.’’
సాక్షి, మేడ్చల్(హైదరాబాద్): ఆంధ్రప్రదేశ్ కు చెందిన కోసం నాగమ్మ, రంగారావు దంపతులు. మేడ్చల్ మున్సిపాలిటీ గిర్మాపూర్‌కు వచ్చి కూలీ పనిచేస్తు జీవనం సాగిస్తున్నారు. భార్య నాగమ్మ కూలి పని చేసే సమయంలో ఇనుప రాడ్ పైన పడటంతో చేతికి గాయమయ్యింది. మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. గిర్మాపూర్‌కు రోజు వెళ్లి రావాలంటే రూ.40 ఖర్చు అవుతుండటంతో వారు మేడ్చల్ బస్టాండ్‌లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.
భార్య చేతికి నొప్పి ఎక్కువ కావడంతో ఆ బాధను తట్టుకోలేని రంగారావు ఆమె చేతికి కట్టు కడుతూ సపర్యాలు చేశారు. బుధవారం ఉదయం ఈ దృశ్యాన్ని సాక్షి మేడ్చల్ ప్రతినిధి క్లిక్‌మనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment