జగనాభిమానం | YSRCP Fan tell the Affection in Innovative mode | Sakshi
Sakshi News home page

జగనాభిమానం

Published Sun, Jul 9 2017 12:13 PM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM

YSRCP Fan tell the Affection in Innovative mode

► వినూత్న రీతిలో అభిమానం తెలుపుతున్న ఆటోడ్రైవర్‌

గజపతినగరం: మెంటాడ మండలం కంటుభుక్తవలస గ్రామానికి చెందిన చౌదరి జగన్‌ వినూత్న రీతిలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులపై అభిమానం వ్యక్తపరుస్తున్నాడు. తలకు వైఎస్సార్‌, జగన్‌మోహన్‌రెడ్డి పేర్లు చెక్కించి సంబరపడుతున్నాడు. తమ తల్లిదండ్రులు నిత్యం వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుంటుంబాన్ని తలచుకుంటారని చెప్పాడు. వైఎస్సార్‌ ఫొటోకు ప్రతిరోజు పూజ చేస్తామన్నారు.

ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి అంటే చెప్పలేని అభిమానమని తెలిపాడు. అందుకే ప్రతి మూడు నెలలకోసారి విజయవాడ వెళ్లి వైఎస్సార్‌, జగన్‌మోహన్‌రెడ్డి పేర్లు తలపై చెక్కించుకుంటానని అన్నారు. భార్య సరస్వతి, నా తల్లిదండ్రులు నారాయణ, సింహాచలం, పిల్లలు దివ్య, స్వరూపలు జగన్‌ పేరుతో ఉన్న కటింగ్‌ కోసం ఎదురు చూస్తుంటారని తెలిపారు. గ్రామం‍లో నాతో పాటు జగన్‌మోహన్‌ రెడ్డి అంటే పల్లి శంకర్‌, పల్లిచిన్న, గణేష్‌ తదితర వీరాభిమానులు ఉన్నారన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement