
బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయుడు రవిని భుజాలపై ఎత్తుకుని ఊరేగిస్తున్న అళ్లగడ్డ గ్రామస్తులు
గడివేముల: గురువు దేవుడితో సమానం. విద్యార్థిని సమాజంలో గొప్పమనిషిగా తీర్చిదిద్దడంలో ఉపా«ధ్యాయుడి పాత్ర కీలకం. అలాంటి ఉపాధ్యాయులు విద్యార్థుల్లోనే కాదు.. గ్రామస్తుల హృదయాల్లోనూ చెరగని ముద్ర వేసుకుంటారు. కర్నూలు జిల్లా గడివేముల మండలం బిలకలగూడూరు పంచాయతీ మజరా గ్రామమైన అళ్లగడ్డ ప్రాథమిక పాఠశాల ఏకోపాధ్యాయుడిగా 11 ఏళ్లపాటు సేవలందించిన రవి కూడా ఆ కోవలోకే వస్తారు. ఈయన ఆ పాఠశాలకు వెళ్లిన కొత్తలో పలువురు గ్రామస్తులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించేవారు.
కానీ వారి దృక్పథాన్ని రవి మార్చేశారు. పాఠశాలకు దగ్గరలోనే ఇల్లు అద్దెకు తీసుకుని, తన ఇద్దరు పిల్లలనూ అదే పాఠశాలలో చేర్పించారు. ఆయన బోధనా విధానం, వ్యవహారశైలి నచ్చడంతో గ్రామస్తులు కూడా తమ పిల్లలను సర్కారు బడికి పంపిస్తున్నారు. కాగా..గ్రామంలో 11 ఏళ్ల పాటు విద్యనందించిన రవి ప్రస్తుతం బదిలీ అయ్యారు. దీంతో బుధవారం పనులన్నీ మానేసి.. గ్రామస్తులంతా కదిలొచ్చి ఆయనకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఉపాధ్యాయుడు రవిని విద్యార్థుల తల్లిదండ్రులు భుజాలపైకెత్తుకుని ఊరేగించి ఆత్మీయాభిమానం చాటుకున్నారు.
చదవండి:
సంక్షేమ క్యాలెండర్: పథకాల అమలు ఇలా..
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై బహిష్కరణ..
Comments
Please login to add a commentAdd a comment