‘క్రాస్’ అయిన అభిమానం
అభిమానిస్తే గుళ్లు కట్టడం, ద్వేషిస్తే సమాధి చేయడం వంటి రెండు వైపరీత్యాలు, విపరీతపైత్యాలు మన దగ్గర తప్ప ఇంకెక్కడా కనిపించవేమో! నటులకు గుళ్లు కట్టడం, నేతలకు అభిషేకాలు చేయించడం, పాదుకలతో ప్రచారం చేయడం వంటివి ఈ దేశంలో సర్వసాధారణం. తమిళనాడులో మరీ ఎక్కువ.
మొన్నటికి మొన్న జయలలితకు ఆమె పార్టీ(ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం) సభ్యుడు గుడి కడితే.. ఇంకో విశ్వాసపాత్రుడు ఏకంగా శిలువెక్కేశాడు. షైహాన్ హుస్సైనీ అనే వ్యక్తి అమ్మ 67 పుట్టినరోజునాడు ఆమెకు కానుకగా ఈ దుస్సాహసానికి ఒడిగట్టాడు. పిచ్చి పీక్‌కి వెళ్లిపోవడం అంటే ఇదేనేమో!