World's Largest Cat Is Almost As Tall As A 4 Year Old - Sakshi
Sakshi News home page

అతిపెద్ద పిల్లి..అచ్చం మనిషిలా..

Published Sun, Aug 20 2023 12:56 PM | Last Updated on Sun, Aug 20 2023 1:07 PM

Worlds Largest Cat Is Almost As Tall As A 4 Year Old - Sakshi

ఈ ప్రపంచంలో అతిపెద్ద పిల్లిని ఎప్పుడైనా చూశారా... అయితే ఇప్పుడు చూడండి... ఫొటో కనిపిస్తున్న ఈ పిల్లి పేరు కెఫిర్‌. శరీర పరిమాణం దాదాపు పెద్ద పులికి సమానంగా కనిపిస్తుంది. ఈ పిల్లి హావభావాలు, దీని చేష్టలు అచ్చం మనిషిని పోలి ఉంటాయి. రష్యాలోని ఓస్కోల్కు చెందిన యులియా మినినా అనే మహిళ దీనిని పెంచుకుంటోంది. అయితే ఈ పిల్లి, ఆమె. నాలుగేళ్ల కుమార్తె అనెష్కా నిలబడి ఉన్నప్పుడు ఇద్దరూ ఇంచుమించు ఒకే ఎత్తులో ఉంటారు.

ఎప్పుడూ ఇద్దరూ తోటలో ఆడుకుంటూ, సోఫాలో కూర్చుని టీవీ చూస్తుంటే అది ఒక పిల్లి అనే అనిపించదు. ఈ పిల్లి అచ్చం మనుషుల్లానే ప్రవర్తిస్తుంది. స్వయంగా తలుపులు తెరుచుని బయటకు వెళ్తుంది. అలా ఈ పిల్లి ఫొటోలు, వీడియోలను ఆమె తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఈ పిల్లి సెలబ్రిటీగా మారింది. అతిపెద్ద పిల్లిని చూసిన నెటిజన్లు షాక్‌ అవుతూ పిల్లిపై రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు.  

(చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద పూల సంబరం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement