చూడటానికి ఇది అచ్చంగా చిరుతపులిలా ఉంటుంది గాని, నిజానికి ఇది అడవిపిల్లి. సహారా ఎడారి చుట్టుపక్కల ఉండే ఆఫ్రికా దేశాల్లోని అడవుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని ‘సెర్వల్’ అంటారు.
ఇది దాదాపు రెండు అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. దీని బరువు తొమ్మిది నుంచి పద్దెనిమిది కిలోల వరకు ఉంటుంది. అంటే, చిరుతపులితో పోల్చుకుంటే సగం పరిమాణంలో ఉంటుంది. శరీర పరిమాణంతో పోల్చుకుంటే, దీని కాళ్లు పొడవుగా ఉంటాయి. చిరుత కంటే దీని తల పరిమాణం చిన్నగా ఉంటుంది. ఇది చాలా వేగంగా వేటాడుతుంది.
పగలు, రాత్రి కూడా చురుగ్గానే ఉంటుంది. ఎక్కువగా ఎలుకలు, కప్పలు, చిన్న చిన్న పక్షులను వేటాడి తింటుంది. ఆఫ్రికాలో వలస రాజ్యాలు ఏర్పరచుకున్న కాలంలో ఫ్రెంచ్ శాస్త్రవేత్త జార్జస్ లూయీ లెక్లెర్క్ కామ్టే డి బఫన్ 1765లో తొలిసారిగా ఈ జంతువును గుర్తించి, దీని గురించిన విశేషాలను ప్రపంచానికి వెల్లడించాడు.
ఇవి చదవండి: ఆ దీవిలో మూడు రోజులు బస ఉచితం! ఎందుకంటే?
Comments
Please login to add a commentAdd a comment