వానలు కురవడం ఆలస్యమైతే కప్పల పెళ్లిళ్లు జరిపించడం మనవాళ్లకు తెలిసిన ఆచారం. వానలు కురవడం ఆలస్యమై, కరవు దాపురించే పరిస్థితులు ఎదురైతే పిల్లుల ఊరేగింపు జరపడం కంబోడియా, థాయ్‌లాండ్, మయాన్మార్, వియత్నాం తదితర ఆగ్నేయాసియా దేశాలలో చిరకాలంగా కొనసాగుతున్న ఆచారం. ఇవన్నీ ప్రధానంగా వ్యవసాయాధారిత దేశాలే! ఈ దేశాలలో వరి ప్రధానమైన పంట.
వరి బాగా పండాలంటే వర్షాలు కీలకం. వర్షాలు సకాలంలో కురవకుంటే, దేవతల ప్రీతి కోసం ఇక్కడి జనాలు ఊరూరా పిల్లుల ఊరేగింపు జరుపుతారు. వానల కోసం పిల్లుల ఊరేగింపు జరిపే ఈ వేడుకను ‘హే న్యాంగ్ మ్యావ్’ అంటారు. ఆడపిల్లులను, ముఖ్యంగా నల్లపిల్లులను, ప్రస్ఫుటమైన నల్లని మచ్చలు ఉన్న పిల్లులను ఎంపిక చేసుకుని, వాటిని వెదురు బుట్టల్లో కూర్చుండబెట్టి ఊళ్లోని ప్రతి ఇంటి వద్ద ఆగుతూ ఊరేగింపు జరుపుతారు.
ఈ ఊరేగింపులో ఉపయోగించడానికి సయామీస్ జాతికి చెందిన పిల్లులు శ్రేష్ఠమైనవని భావిస్తారు. అసలు పిల్లులతో పాటు బుట్టల్లో పిల్లుల బొమ్మలను కూడా పెట్టి జనాలు ఊరేగింపులో పాల్గొంటారు. ఆడపిల్లుల ‘మ్యావ్’ రావాలకు వానదేవుడు కరుణిస్తాడని జనాల నమ్మకం. పిల్లుల ఊరేగింపులో ఊళ్లలోని పిల్లా పెద్దా ఉత్సాహంగా పాల్గొంటారు. సంప్రదాయ వాద్యాలను వాయిస్తూ, పాటలు పాడుతూ ఊరంతా తిరుగుతారు. ఊరేగింపు తర్వాత ప్రార్థనలు జరిపి, సామూహికంగా విందు భోజనాలు చేస్తారు.
ఇవి చదవండి: ఈ గొడుగు ఖరీదు వింటే.. వ్హా.. అంటూ నోరెల్లబెట్టాల్సిందే!!
Comments
Please login to add a commentAdd a comment