అప్పులపాలై ఇంటికి తిరిగొచ్చిన పిల్లి! | Missing Cat Returned Home With Debt In Thailand | Sakshi
Sakshi News home page

అప్పులపాలై ఇంటికి తిరిగొచ్చిన పిల్లి!

Published Sun, Nov 1 2020 2:03 PM | Last Updated on Sun, Nov 1 2020 2:14 PM

Missing Cat Returned Home With Debt In Thailand - Sakshi

బ్యాంకాక్‌ : మూడు రోజుల పాటు కనిపించకుండా పోయిన ఓ గండు పిల్లి అప్పులపాలై ఇంటికి చేరుకున్న వింత సంఘటన థాయ్‌లాండ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి పెంచుకుంటున్న పిల్లి కొద్దిరోజుల క్రితం ఇంటినుంచి కనిపించకుండా పోయింది. మూడు రోజుల తర్వాత క్షేమంగా ఇంటికి తిరిగివచ్చింది. అయితే దాని మెడలో ఓ ట్యాగ్‌ను యజమాని గుర్తించాడు. ‘‘ మీ పిల్లి మా షాపు దగ్గరకి వచ్చి మాకెరల్స్‌(తినుబండారం)పై కన్నేసింది. దీంతో నేను దానికి ఓ మూడు మాకెరల్స్‌ ఇచ్చాను’’ అని రాసి ఉంది. ( పిచ్చి ప్రయోగాలకు పోతే జరిగేది ఇదే )

‘ఆంటీ మే’ అనే వ్యక్తి ఆ ట్యాగ్‌ను తగిలించి దాని మీద తన అడ్రస్‌ను కూడా రాశాడు. పిల్లి అప్పు కథను ‘చంగుపుఆక్‌సియామ్‌’ అనే ఫేస్‌బుక్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘‘మూడు రోజులు కనిపించకుండా పోయింది. అప్పుల్తో తిరిగొచ్చింది. ఎలా ఉంది?’ అనే శీర్షిక జోడించారు. ఈ వార్త సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు పిచ్చ కామెడీగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement