సీరియస్‌గా సాగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పిల్లి ప్రత్యక్షమై ఆటగాళ్లను ఉరుకులు.. పరుగులు పెట్టించింది. ఈ ఫన్నీ ఘటన థర్డ్‌టైర్ ఇంగ్లీష్ లీగ్ వన్‌లో చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా మంగళవారం రాత్రి షెఫీల్డ్ వెడ్‌నెస్‌డే, విగన్ అథ్లెటిక్ మధ్య మ్యాచ్‌లో జరిగింది. విగన్స్ ఆటగావడు జాసన్ కెర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఎక్కడనుంచి వచ్చిందో తెలియదు గానీ సడెన్‌గా మైదానంలో ఒక పిల్లి ప్రత్యక్షమైంది.
చదవండి: Cristiano Ronaldo: గర్ల్‌ఫ్రెండ్ నుంచి ఖరీదైన గిఫ్ట్ అందుకున్న స్టార్ ఫుట్‌బాలర్
దానిని పట్టుకొని బయటికి పంపిచాలని ఆటగాళ్లు ప్రయత్నించారు. కానీ వారికి ఆ చాన్స్ ఇవ్వకుండా పిల్లి పరుగులు పెట్టింది. దాని వెంటే వెళ్లిన జాసన్ కెర్ చివరికి ఎలాగోలా పిల్లిని పట్టుకొని గ్రౌండ్ సిబ్బందికి అందించాడు. అయితే పిల్లి గాయపడకుండా చాకచక్యంగా వ్యవహరించిన జాసన్ కేర్‌ను తోటి ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు అభినందనల్లో ముంచెత్తారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో షెఫీల్డ్ వెడ్‌నెస్‌డే జట్టు 1-0 తేడాతో విగన్‌పై విజయం సాధించింది.
A cat ran on the pitch at Hillsborough tonight and Wigan’s Jason Kerr gave it a little tickle before carefully helping it off. Not kicked pic.twitter.com/3Blp9zVDWV
— Jack Kenmare (@jackkenmare_) February 8, 2022
Comments
Please login to add a commentAdd a comment