interrupt
-
అతిథిలా వచ్చి ఆటగాళ్లను పరుగులు పెట్టించింది
సీరియస్‌గా సాగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పిల్లి ప్రత్యక్షమై ఆటగాళ్లను ఉరుకులు.. పరుగులు పెట్టించింది. ఈ ఫన్నీ ఘటన థర్డ్టైర్ ఇంగ్లీష్ లీగ్ వన్‌లో చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా మంగళవారం రాత్రి షెఫీల్డ్ వెడ్నెస్డే, విగన్ అథ్లెటిక్ మధ్య మ్యాచ్‌లో జరిగింది. విగన్స్ ఆటగావడు జాసన్ కెర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఎక్కడనుంచి వచ్చిందో తెలియదు గానీ సడెన్‌గా మైదానంలో ఒక పిల్లి ప్రత్యక్షమైంది. చదవండి: Cristiano Ronaldo: గర్ల్‌ఫ్రెండ్ నుంచి ఖరీదైన గిఫ్ట్ అందుకున్న స్టార్ ఫుట్‌బాలర్ దానిని పట్టుకొని బయటికి పంపిచాలని ఆటగాళ్లు ప్రయత్నించారు. కానీ వారికి ఆ చాన్స్ ఇవ్వకుండా పిల్లి పరుగులు పెట్టింది. దాని వెంటే వెళ్లిన జాసన్ కెర్ చివరికి ఎలాగోలా పిల్లిని పట్టుకొని గ్రౌండ్ సిబ్బందికి అందించాడు. అయితే పిల్లి గాయపడకుండా చాకచక్యంగా వ్యవహరించిన జాసన్ కేర్‌ను తోటి ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు అభినందనల్లో ముంచెత్తారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో షెఫీల్డ్ వెడ్నెస్డే జట్టు 1-0 తేడాతో విగన్పై విజయం సాధించింది. A cat ran on the pitch at Hillsborough tonight and Wigan’s Jason Kerr gave it a little tickle before carefully helping it off. Not kicked pic.twitter.com/3Blp9zVDWV — Jack Kenmare (@jackkenmare_) February 8, 2022 -
ప్రోత్సహించేవారూ బాధ్యులే
కఠ్మాండు: ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తున్న దేశాలను గుర్తించి ఉగ్ర హింసకు వాటినీ బాధ్యుల్ని చేయాలని బిమ్స్టెక్(బంగాళాఖాత దేశాల ఆర్థిక, సాంకేతిక కూటమి) దేశాలు పిలుపునిచ్చాయి. ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాద చర్యలు సమర్థనీయం కావని ఎండగట్టాయి. ఉగ్రవాదం, సీమాంతర వ్యవస్థీకృత నేరాలు ప్రపంచ శాంతికి పెను విఘాతం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి. నేపాల్ రాజధాని కఠ్మాండులో నాలుగో బిమ్స్టెక్ దేశాల సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా 7 సభ్యదేశాలు ఏకాభిప్రాయంతో కఠ్మాండు డిక్లరేషన్‌ను విడుదల చేశాయి. భారత్ నుంచి ప్రధాని మోదీ ఈ సమావేశానికి హాజరయ్యారు. రెండు రోజుల సదస్సు ఫలప్రదంగా జరిగిందని, విభిన్న రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని సభ్యదేశాలు పునరుద్ఘాటించాయని మోదీ తెలిపారు. ఇంధన రంగంలో సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి బిమ్స్టెక్ గ్రిడ్ ఇంటర్కనెక్షన్ ఏర్పాటుకు అవగాహనా ఒప్పందం కుదిరింది. పశుపతినాథ్ ఆలయ పరిసరాల్లో యాత్రికుల కోసం కొత్తగా నిర్మించిన ‘భారత్ నేపాల్ మైత్రి ధరమ్‌శాల’ను నేపాల్ ప్రధాని ఓలితో కలసి మోదీ ప్రారంభించారు. అనంతరం నేపాల్, థాయ్‌లాండ్, మయన్మార్, భూటాన్ దేశాధినేతలతో విడిగా భేటీ అయ్యారు. తదుపరి బిమ్స్టెక్ సదస్సుకు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. డిక్లరేషన్ ముఖ్యాంశాలు.. ► ఉగ్రభూతం, సీమాంతర నేరాలపై పోరాటానికి గట్టి ప్రయత్నాలు జరగాలి. సభ్య దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పోత్సహించే సమగ్ర విధానాలు అవలంబించాలి. ► సభ్య దేశాల పోలీసులు, నిఘా వర్గాలు, న్యాయ వ్యవస్థ మధ్య సమన్వయం పెంచాలి. ► హోం మంత్రులు, జాతీయ భద్రతా అధికారుల సమావేశాలు తరచుగా నిర్వహించాలి. ► పరస్పర ఆర్థికాభివృద్ధి నిమిత్తం బహుళ రంగాల్లో సభ్యదేశాల మధ్య అనుసంధానత పెరగాలి. ► అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలు న్యాయబద్ధంగా, అన్ని దేశాలకు ఒకే విధంగా వర్తించేలా ఉండాలి. ► దక్షిణ, ఆగ్నేయాసియాకు వారధిగా ఉన్న బిమ్స్టెక్ను ప్రాంతీయ సర్వతోముఖాభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలి. ► అభివృద్ధి లక్ష్యాల సాధనకు పేదరికం పెద్ద అడ్డుగోడగా ఉంది. సుస్థిరాభివృద్ధికి 2030 ఎజెండాను అమలుచేయడానికి కృషి జరగాలి. ► వాతావరణ మార్పుపై అంతర ప్రభుత్వ నిపుణుల కమిటీ నియామకానికి అవకాశాలను పరిశీలించాలి. ► చివరగా, శాంతియుత, సుస్థిర, బలోపేత బిమ్స్టెక్ సాధనకు సభ్యదేశాలు కలసికట్టుగా పాటుపడాలి. భాగమతి తీరంలో యాత్రికులకు బస.. పశుపతినాథ్ ఆలయ పరిసరాల్లో యాత్రికులు విశ్రాంతి తీసుకునేందుకు నిర్మించిన 400 పడకల విడిది భవనాన్ని మోదీ, నేపాల్ ప్రధాని ఓలితో ప్రారంభించారు. భారత ఆర్థిక సాయంతో భాగమతి నదీ ఒడ్డున నిర్మించిన ఈ భవనంలో యాత్రికులు బస చేసేందుకు విశ్రాంతి గదులు, కిచెన్, భోజన శాల, లైబ్రరీ తదితర సౌకర్యాలను ఏర్పాటుచేశారు. ఇది కేవలం విశ్రాంతి భవనమే కాదని, భారత్–నేపాల్‌ల స్నేహానికి చిహ్నమని మోదీ వ్యాఖ్యానించారు. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీ రచనల్ని నేపాలీ భాషలో ప్రచురించాలని నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. మరోవైపు, బిమ్స్టెక్ సదస్సు సందర్భంగా మోదీ నేపాల్, థాయ్‌లాండ్, మయన్మార్, భూటాన్ దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రాక్సాల్ (బిహార్)–కఠ్మాండు మధ్య వ్యూహాత్మక రైల్వే లైను నిర్మాణానికి భారత్, నేపాల్‌లు అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) కదుర్చుకున్నాయి. -
ఎక్కడికక్కడే అరెస్టులు
-
కేసీఆర్ తీరు అప్రజాస్వామికం
-
కేసీఆర్ తీరు అప్రజాస్వామికం
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో అన్ని వర్గాల వారు స్వేచ్ఛగా ఉండొచ్చని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు తమ సభకు అనుమతించకపోవడమే కాకుండా పలువురిని గృహనిర్బంధం చేయడమేంటని విప్లవ రచయిత వరవరరావు ప్రశ్నించారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కవులు, రచయితలు, మేధావులు ఆదివారం నాడు నిర్వహించాలనుకున్న ‘ప్రత్నామ్నాయ రాజకీయ వేదిక’ సదస్సుకు పోలీసులు అనుమతించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ సమావేశం నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అనంతరం వరవరరావు మీడియాతో మాట్లాడారు. నిజానికి హాళ్లలో నిర్వహించే సభలు, సదస్సులకు పోలీసుల అనుమతి అవసరం లేదనే ఉద్దేశంతో ముందస్తు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు. ఈ సదస్సులో చర్చించే అంశాలు కూడా నిషేధం పరిధిలోకి రావని, చట్టవ్యతిరేకం అంతకన్నా కావని ఆయన అన్నారు. ఏదో ఘోరం జరిగిపోతోందన్న రీతిలో పోలీసులు తీవ్రంగా స్పందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ వంటి మేధావిని కూడా గృహ నిర్బంధం చేయడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొంటూ నిరసన వ్యక్తం చేశారు. ఎలాంటి అడ్డంకులు, ఆంక్షలు లేని బంగారు తెలంగాణను నిర్మిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్.. తమ కార్యక్రమాన్ని అప్రజాస్వామికంగా అడ్డుకోవడం శోచనీయమన్నారు. నక్సలైట్ల సిద్ధాంతమే తన సిద్ధాంతమని చెప్పిన ఎన్టీఆర్.. అప్పట్లో అధికారంలోకి వచ్చాక తన నిజ స్వరూపాన్ని బయపెట్టిన తీరుగానే ఇప్పుడు కేసీఆర్ కూడా వ్యవహరిస్తున్నారని వరవరరావు విమర్శించారు. మావోయిస్టు ఎజెండా తన ఎజెండా ఒక్కటేనని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ బాటలో నడుస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ అభద్రతలో ఉన్నారు సాక్షి,న్యూఢిల్లీ: పౌరహక్కుల సమావేశాలను అడ్డుకోవడం, మీడియాను నియంత్రించడం చూస్తుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ అభద్రతా భావంలో ఉన్నట్టు అనిపిస్తోందని సీపీఐ నేత నారాయణ ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఢిల్లీలో జరిగిన సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు. ‘హైదరాబాద్‌లో విరసం సభలు, ప్రదర్శనలు అనుమతించకపోవడం, చివరికి హాల్ మీటింగ్‌ను ఆటంక పరుస్తున్నారు. ఇది అన్యాయం. నియంతృత్వ పోకడలకు ప్రభుత్వం ఎందుకు పోతుందో అర్థం కావడం లేదు. పౌరహక్కులు, స్వేచ్ఛ కోసం పెట్టుకున్న సభ. పౌరులు శాంతియుతంగా సమావేశమయ్యేందుకు రాజ్యాంగం అవకాశమిచ్చింది.పెపైచ్చు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా చేయడం ఆశ్చర్యం’ అని అన్నారు. టీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని వామపక్షాలు ఉద్యమాన్ని బలపర్చాయి. ‘వరవరరావు వంటి వారిని అరెస్టు చేయడంద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం మలిన పడుతుంది’. అని అన్నారు. వారి అరెస్టులు అసమంజసం విరసం నేతలు వరవరరావు, కళ్యాణరావుల అరెస్టు తగదని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర మహాసభ ఒంగోలులో తీవ్రంగా ఖండించింది.ఉద్యమాల తీరును సమీక్షించేందుకే హైదరాబాదులో సదస్సు నిర్వహించుకునేందుకు నేతలు యత్నిస్తుంటే అరెస్టులేమిటని ప్రశ్నించింది. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న కళ్యాణరావును మార్గమధ్యంలోనే అరెస్టుచేయడం, వేదిక కన్వీనర్ వరవరరావును ఇంటి వద్దే నిర్బంధించడం దారుణమని సీ.హెచ్.జాలన్న ఒక ప్రకటనలో అన్నారు. దాడులు అసమంజసం తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నగరం పోలీసుల దిగ్భంధంలో ఉందని, నగరం ఎమర్జెన్సీని తలపిస్తుందని పౌరహక్కుల సంఘం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ జి. లక్ష్మణ్ అన్నారు. ఆదివారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హక్కులను హరించడమే.. హైదరాబాద్‌లో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఆధ్వర్యంలో జరుపతలపెట్టిన సభను,ర్యాలీని పోలీసులు అనుతించకుండా ఆ నేతలను అరెస్టు చేయడంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ తీరును నిరసించాయి అణచివేత తగదు : సీపీఐ కొత్త ప్రభుత్వం పౌర హక్కులను కాపాడుతుందనే నమ్మకం వమ్మయిందని తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఉద్యమపార్టీగా అధికారంలోకి వచ్చి గత పాలకుల మాదిరిగానే హక్కుల అణచివేతనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఉందని పేర్కొన్నారు. నియుంతృత్వ చర్య : సీపీఎం ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడం, వారి సభలు, ప్రదర్శనలను రద్దుచేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, నిరంకుశ ధోరణిని తెలియజే స్తున్నదనిస్తోందని తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అప్రజాస్వామికం : పొన్నాల విరసం నేత వరవరరావు అరెస్టు ప్రజాస్వామ్యానికి చేటు అని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యవాదులంతా కేసీఆర్ వైఖరిపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పొన్నాల ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వేదికను అడ్డుకోవడం తగదు : రావుకృష్ణ తెలంగాణలో ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే విధంగా ఉందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా తలపెట్టిన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సభను పోలీసులు అడ్డుకోవడాన్ని ఆదివారం ఆయున ఒక ప్రకటనలో ఖండించారు. సీమాంధ్ర పాలకుల్లా సీఎం విరసం సభ్యులు వరవరరావు, మరికొందరిని అరెస్టు చేయడాన్ని ఓయూ విద్యార్థులు ఖండించారు. టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు డి.విజయ్, టీవీఎస్ అధ్యక్షుడు కోట శ్రీనివాస్‌గౌడ్, డీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణాంక్ మాట్లాడుతూ సదస్సును అడ్డుకోవడం అప్రజాస్వామ్యమన్నారు. గొంతు నొక్కే ప్రయత్నం: ఏఐఎస్ఎఫ్ ప్రజా హక్కులను కాలరాయడం సరికాదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు స్టాలిన్, ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలన ప్రజలకు భావప్రకటన స్వేచ్ఛ లేకుండా గొంతు నొక్కేలా ఉందని విమర్శించారు. -
ఎక్కడికక్కడే అరెస్టులు
ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సభను అడ్డుకున్న పోలీసులు నగరంలోని పలుచోట్ల బారికేడ్లు.. ముళ్లకంచెల ఏర్పాటు విరసం నేత వరవరరావుతో సహా 174 మంది అరెస్టు ఉస్మానియా వర్సిటీలోనూ ఉద్రిక్తత అదుపులో ఇతర రాష్ట్రాల కళాకారులు, జిల్లాల నాయకులు రోజంతా ఠాణాలోనే నేతలు సాక్షి, హైదరాబాద్: నిరసనలు, నినాదాలు, వాగ్వాదాలు, తోపులాటలు, అరెస్టులు, గృహ నిర్బంధాలతో సుందరయ్యు విజ్ఞాన కేంద్రం పరిసరాలు అట్టుడికారుు. సభలు, సవూవేశాలతో నిత్యం ప్రశాంతంగా ఉండే ఆ పరిసరాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మావోయిస్టు విప్లవోద్యమ ప్రస్థానం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్యు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన సభను ప్రభుత్వం అడ్డుకుంది. దీనికి అనువుతి లేదంటూ వేదిక కన్వీనర్, విరసం నేత వరవరరావు సహా 174 వుంది విప్లవకారులను అరెస్టు చేసి, 14 పోలీస్ స్టేషన్లలో పోలీసులు నిర్బంధించారు. అరెస్టయిన వారిని రాత్రి ఎనిమిదిగంటల సమయంలో విడిచిపెట్టారు. శనివారం అర్ధరాత్రి నుంచే అలజడి ప్రత్యావ్నూయు సభకు అనువుతి లేదంటూ పోలీసులు శనివారం రాత్రే సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని తవు అధీనంలోకి తీసుకున్నారు. కార్యకర్తలు రాకుండా రోడ్డుకు అడ్డంగా బారికేట్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాంధీనగర్‌లోని తన నివాసంలో ఉన్న వేదిక కన్వీనర్, విరసం నేత వరవరరావును ఆదివారం ఉదయుం అరెస్టు చేసి కంచన్‌బాగ్ పోలీసుస్టేషన్‌కు తరలించి రోజంతా అక్కడే నిర్బంధించారు. కాచిగూడ తుల్జాభవన్ విడిదిలో ఉన్న జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన నేతలు, కళాకారులను అరెస్టు చేసి అబిడ్స్, ఫలక్‌నుమా పోలీసుస్టేషన్లకు తరలించారు. వీరిలో జార్ఖండ్ కళాకారుడు జీతన్ మరాండితో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సభ్యురాలు పద్మకుమారి, పినాకపాణి, విరసం నాయకురాలు వరలక్ష్మి, తదితరులున్నారు. ఉస్మానియూలోనూ ఉద్రిక్తత ఉస్మానియా వర్సిటీ నుంచి సభకు తరలివస్తున్న 60 వుంది విద్యార్థులను ఎన్సీసీ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల వుధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కర్నూలు, కడప, అనంతపురం చిత్తూరు, గుంటూరు జిల్లాల నుంచి రైల్లో కాచిగూడ స్టేషన్‌కు చేరుకున్న కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. పోలీసుల చర్యను నిరసిస్తూ పలు ప్రజా సంఘాలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఆయూ స్టేషన్ల వుుందు అందోళనకు దిగాయి. వురికొంత వుంది ట్యాంక్‌బండ్‌పై నిరసన తెలిపారు. సభకు బయులుదేరిన విరసం నేత కల్యాణ్‌రావుతో సహా పలువురు కార్యకర్తలను ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోనే అరెస్టు చేశారు. రాక్షస పాలన గుర్తుకొస్తోంది: వేణుగోపాల్ రాష్ట్రంలో రాక్షస సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాక్షస పాలన సాగుతోందని చెప్పడానికి ఈ నిర్బంధాలే సాక్ష్యమని వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ మండి పడ్డారు. వరవరరావు అరెస్టును తెలుసుకున్న ఆయన వరవరరావు భార్య హేమలత, ఆయన కుమార్తెలతో కలిసి కంచన్‌బాగ్ పోలీసుస్టేషనుకు చేరుకున్నారు. తొలుత వారికి అనుమతి నిరాకరించిన పోలీసులు అనంతరం అంగీకరించడంతో వారు వరవరరావును కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా స్టేషను బయట విలేకరులతో మాట్లాడిన వేణుగోపాల్ ప్రస్తుత పరిస్థితులు ఎమర్జన్సీని తలపిస్తున్నాయన్నారు. తమది మావోల ఎజెండా అని చెప్పుకున్న కేసీఆర్ ఇప్పుడది విస్మరించారన్నారు. రాజ్యం మళ్లీ పోలీసుల చేతుల్లోకి వెళుతోందన్నారు. తమ ర్యాలీకి హోం మంత్రి అనుమతించినా....పోలీసులు అడ్డుకోవడం తగదన్నారు. సీఎంను కలిసేందుకు వెళ్లిన హరగోపాల్ గృహనిర్బంధం... తమ సభకు, ర్యాలీకి అనుమతినివ్వాలని తొలుత ఆదివారం ఉదయం పౌరహక్కుల నేత హరగోపాల్ మరో ఇరువురు నేతలు రఘనాథ్, బల్లారవిలతో కలిసి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావును కలసేందుకు ఆయన క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లారు. ఈ సమయంలో వారిని అదుపలోకి తీసుకున్న పోలీసులు హరగోపాల్‌ను ఆయన ఇంటికి తరలించిన గృహనిర్బంధలో ఉంచారు. మిగతా ఇరువురినీ పంజగుట్ట పోలీసు స్టేషనుకు తరలించారు. ఈ అంశాన్ని హరగోపాల్ , ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్యల దృష్టికి తేవడంతో వారు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డితో మాట్లాడి పోలీసుల చర్యలను ఖండించారు. దీనితో నిర్బంధంలో ఉన్న హరగోపాల్ తనతో కలవ వచ్చని కమిషనర్ చెప్పడంతో పోలీసులు ఆయనను విడుదల చేశాక మహేంద్ర రెడ్డిని పొత్తూరి, చుక్కా రామయ్యలతో కలసి వెళ్లి సభకు అనుమంతించాలని విజ్ఞప్తి చేశారు. అరెస్టయిన వారిపై ఎలాంటి కేసులూ నమోదు చేయడం లేదని రాత్రికి విడచి పెడతామని నేతలకు కమిషనర్ హామీ ఇచ్చారు. బొల్లారం పీఎస్‌లో విరసం సభ్యులు బొల్లారం: బాగ్‌లింగంపల్లిలో సదస్సు నిర్వహించేందుకు ప్రయత్నించిన విరసం సభ్యులను అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మొత్తం 43 మంది విరసం సభ్యులను పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా నిర్బంధంలో ఉన్న విరసం సభ్యులు పద్మకుమారి, ఫణి, తదితరులు విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య రక్షణ తమ ఎజెండా అంటూ అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. -
సికింద్రాబాద్-డోన్ మధ్య రైళ్లకు అంతరాయం
హైదరాబాద్: సికింద్రాబాద్-డోన్ మధ్య బ్రిడ్జి నిర్మాణ పనుల దృష్ట్యా ఆ మార్గంలో నడిచే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22, 25, 27 తేదీలలో గుంతకల్-కాచిగూడ మధ్య నడిచే ప్యాసింజర్ మహబూబ్‌నగర్-మన్యంకొండ స్టేషన్ల మధ్య మొదటి రోజు 2.50 గంటలు, మిగతా రెండు రోజులు 1.15 గంటలు ఆలస్యంగా నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో కాచిగూడ-గుంతకల్ (57425) ప్యాసింజర్ కూడా మొదటి రోజులు 3 గంటలు, మిగతా రెండు రోజులు గంటన్నర ఆలస్యంగా నడిచేటట్లుగా వేళలను క్రమబద్ధీకరిస్తారు. అలాగే కాచిగూడ-బోధన్ (57473) ప్యాసింజర్ కూడా మొదటి రోజు 2.40 గంటలు, మిగతా రెండు రోజులు గంటా 15 నిమిషాలు ఆలస్యంగా నడువనుంది. కాగా, ఈ నెల 29వ తేదీన మహబూబ్‌నగర్-కాచిగూడ (57456) ప్యాసింజర్ మహబూబ్‌నగర్-గొల్లపల్లి మధ్య పాక్షికంగా రద్దు కానుంది. అలాగే కాచిగూడ-గుంతకల్ (57425), గుంతకల్-కాచిగూడ (57426) ప్యాసింజర్లు గొల్లపల్లి-జడ్చర్ల మధ్య ఆలస్యంగా నడుస్తాయి. కాచిగూడ-బోధన్ ప్యాసింజర్ (57473) బోధన్ నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుంది. -
టెన్త్ సైన్స్ పరీక్షలకు ‘స్థానిక’ అడ్డంకి
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో 10వ తరగతి జనరల్ సైన్స్ పరీక్షల నిర్వహణపై సందిగ్ధత ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఏప్రిల్ 6, 8 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఏప్రిల్ 7న పదో తరగతి సైన్స్ మొదటి పేపర్, 9న సైన్స్ రెండో పేపర్ పరీక్షలున్నాయి. అన్ని కేంద్రాల్లో పోలింగ్ సజావుగా జరిగి, రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం రాకుంటే.. పదో తరగతి పరీక్షలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొదటి, రెండో విడతల్లో ఏవైనా గొడవలు జరిగి పోలింగ్‌కు అంతరాయం ఏర్పడితే, మరుసటి రోజు రీపోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. పాఠశాలలనే పోలింగ్ కేంద్రాలుగా వినియోగిస్తున్నందున.. రెండింటినీ ఒకేసారి నిర్వహించడం సాధ్యం కాదు. ఇదే విషయాన్ని వివిధ జిల్లాల కలెక్టర్లు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాఠశాల విద్యా కమిషనర్‌తో ఎన్నికల సంఘం అధికారులు మాట్లాడారు. పరీక్షల వాయిదా వల్ల ఇబ్బందులు ఉంటాయని, రీపోలింగ్ అవసరమైన ప్రాంతాల్లో పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటే విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుందని విద్యాశాఖ అధికారులు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. విద్యాశాఖ అధికారుల విజ్ఞప్తికి ఎన్నికల సంఘం కూడా సానుకూలంగా స్పందించిందని సమాచారం. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి జిల్లాల అధికారులతో చర్చిస్తామని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ఇబ్బందులు ఉండవని సమాచారం వస్తే సైన్స్ పరీక్షలు వాయిదా వేయాల్సిన అవసరం ఉండదని ఎన్నికల సంఘం చెప్పినట్లు తెలిసింది. లేని పక్షంలో సైన్స్ పేపర్లు రెండూ వాయిదా వేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ అంశంపై వచ్చే వారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ పరీక్షలు వాయిదా వేస్తే.. ఏప్రిల్ 13, 14 తేదీల్లో నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.