హైదరాబాద్: సికింద్రాబాద్-డోన్ మధ్య బ్రిడ్జి నిర్మాణ పనుల దృష్ట్యా ఆ మార్గంలో నడిచే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22, 25, 27 తేదీలలో గుంతకల్-కాచిగూడ మధ్య నడిచే ప్యాసింజర్ మహబూబ్‌నగర్-మన్యంకొండ స్టేషన్‌ల మధ్య మొదటి రోజు 2.50 గంటలు, మిగతా రెండు రోజులు 1.15 గంటలు ఆలస్యంగా నడుస్తుంది.
తిరుగు ప్రయాణంలో కాచిగూడ-గుంతకల్ (57425) ప్యాసింజర్ కూడా మొదటి రోజులు 3 గంటలు, మిగతా రెండు రోజులు గంటన్నర ఆలస్యంగా నడిచేటట్లుగా వేళలను క్రమబద్ధీకరిస్తారు. అలాగే కాచిగూడ-బోధన్ (57473) ప్యాసింజర్ కూడా మొదటి రోజు 2.40 గంటలు, మిగతా రెండు రోజులు గంటా 15 నిమిషాలు ఆలస్యంగా నడువనుంది. కాగా, ఈ నెల 29వ తేదీన మహబూబ్‌నగర్-కాచిగూడ (57456) ప్యాసింజర్ మహబూబ్‌నగర్-గొల్లపల్లి మధ్య పాక్షికంగా రద్దు కానుంది. అలాగే కాచిగూడ-గుంతకల్ (57425), గుంతకల్-కాచిగూడ (57426) ప్యాసింజర్‌లు గొల్లపల్లి-జడ్చర్ల మధ్య ఆలస్యంగా నడుస్తాయి. కాచిగూడ-బోధన్ ప్యాసింజర్ (57473) బోధన్ నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుంది.
సికింద్రాబాద్-డోన్ మధ్య రైళ్లకు అంతరాయం
Published Tue, Apr 22 2014 3:56 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 AM
Advertisement
Advertisement