సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని ఏడు రైల్వేస్టేషన్లలో మల్టీకాంప్లెక్స్ భవనాలు నిర్మించనున్నట్లు సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ధర్మవరం, కాచి గూడ, కరీంనగర్, నెల్లూరు, నిజామాబాద్, విజయవాడ, జహీరాబాద్ రైల్వేస్టేషన్లలో బహుళ ప్రయోజన భవనాలను కట్టించేందుకు రైల్ లాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఆర్‌ఎల్‌డీఎ)కి అనుమతిని ఇచ్చినట్లు పేర్కొన్నారు.
రూ.22.34 కోట్ల వ్యయంతో భవనాలు నిర్మించి వ్యాపార సంస్థలకు లీజ్‌కు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వీటిల్లో షాపింగ్, ఫుడ్ స్టాల్స్, ప్లాజాలు, టెలి ఫోన్ బూత్‌లు, ఏటీఎం లు, మందుల షాపులు, బడ్జెట్ హోటళ్లు, పార్కింగ్ వం టి సదుపాయాలు ఉంటాయని తెలి పారు. ఇప్పటివరకు నాంపల్లి, రాజమండ్రిల్లో మల్టీకాంప్లెక్స్ భవనాలు నిర్మించి లీజ్‌కు ఇచ్చారు. ఔరంగాబాద్, గుంటూరుల్లో నిర్మాణాలు పూర్తయ్యా యి. త్వరలో లీజ్‌కు ఇవ్వనున్నారు.
ఏడు రైల్వేస్టేషన్‌లలో మల్టీ కాంప్లెక్స్‌లు
Published Fri, Nov 14 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM
Advertisement