K.samba shiva rao
-
యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. రామేశ్వరం-కన్యాకుమారి-నాగర్సోయిల్-మధురై, ఢిల్లీ-జైపూర్-ఆగ్రా-మధుర ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్-రామేశ్వరం ట్రైన్ 2015 జనవరి 28, మార్చి 4 తేదీలలో బయలుదేరుతుంది. 5 రాత్రులు, 6 పగళ్లు ఈ పర్యటన ఉంటుంది. అలాగే 7 రాత్రులు, 8 పగళ్లతో కూడిన హైదరాబాద్-గోల్డెన్ ట్రయాంగిల్ పర్యటన 2015 ఫిబ్రవరి 20న ప్రారంభమవుతుంది. వివరాలకు 97013 60701,040-27702407 నంబర్లలో సంప్రదించవచ్చు. -
ఏడు రైల్వేస్టేషన్లలో మల్టీ కాంప్లెక్స్‌లు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని ఏడు రైల్వేస్టేషన్లలో మల్టీకాంప్లెక్స్ భవనాలు నిర్మించనున్నట్లు సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ధర్మవరం, కాచి గూడ, కరీంనగర్, నెల్లూరు, నిజామాబాద్, విజయవాడ, జహీరాబాద్ రైల్వేస్టేషన్లలో బహుళ ప్రయోజన భవనాలను కట్టించేందుకు రైల్ లాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్‌ఎల్‌డీఎ)కి అనుమతిని ఇచ్చినట్లు పేర్కొన్నారు. రూ.22.34 కోట్ల వ్యయంతో భవనాలు నిర్మించి వ్యాపార సంస్థలకు లీజ్‌కు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వీటిల్లో షాపింగ్, ఫుడ్ స్టాల్స్, ప్లాజాలు, టెలి ఫోన్ బూత్‌లు, ఏటీఎం లు, మందుల షాపులు, బడ్జెట్ హోటళ్లు, పార్కింగ్ వం టి సదుపాయాలు ఉంటాయని తెలి పారు. ఇప్పటివరకు నాంపల్లి, రాజమండ్రిల్లో మల్టీకాంప్లెక్స్ భవనాలు నిర్మించి లీజ్‌కు ఇచ్చారు. ఔరంగాబాద్, గుంటూరుల్లో నిర్మాణాలు పూర్తయ్యా యి. త్వరలో లీజ్‌కు ఇవ్వనున్నారు. -
టికెట్ బుకింగ్ సేవక్
త్వరలో అందుబాటులోకి..రైల్వే స్టేషన్లలో టికెట్లు ఇచ్చేందుకు..కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకం 207 స్టేషన్లలో ఏర్పాటు దక్షిణమధ్య రైల్వే ప్రకటన సాక్షి, సిటీబ్యూరో: రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు టికెట్లు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ‘స్టేషన్ టికెట్ బుకింగ్ సేవక్ ’లు అందుబాటులోకి రానున్నారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో గుర్తించిన 207 స్టేషన్లలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇలాంటి సిబ్బందిని నియమించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం స్టేషన్‌మాస్టర్లు, సహాయ స్టేషన్‌మాస్టర్లే అన్నిరకాల విధులు నిర్వహిస్తున్న దృష్ట్యా వారిపై పని ఒత్తిడిని తగ్గించేం దుకు కొత్తగా ‘స్టేషన్ టిక్కెట్ బుకింగ్ సేవ క్’లకు (ఎస్‌టీబీఎస్) శ్రీకారం చుట్టినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. చాలా స్టేషన్లలో రైళ్ల రాకపోకల సమయంలో సిగ్నలింగ్ విధులు నిర్వహించడంతో పాటు స్టేషన్ మాస్టర్లే ప్రయాణికులకు టికెట్లు ఇవ్వడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉంటారు. అదే సమయంలో ఏదో ఒక ట్రైన్‌కు సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో స్టేషన్‌మాస్టర్ టికెట్ బుకింగ్‌ను నిలిపివేసి ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లవలసి వస్తుంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దికి గురవుతారు. ఇలాంటి ప్రతికూలతలను అధిగమించేందుకు ఎస్‌టీబీఎస్‌లు దోహదం చేస్తారని రైల్వే అధికారులు భావిస్తున్నారు. దరఖాస్తుల ఆహ్వానం పదోతరగతి చదివిన 18 - 35 ఏళ్ల వయసున్న వాళ్లు ఎస్‌టీబీఎస్‌లు కావచ్చని సీపీఆర్వో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకొనే సమయంలో మొదట రూ.2000 చెల్లించాలి. ఎంపికైన తరువాత ఈ సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు. అలాగే ఎంపికైన ఎస్‌టీబీఎస్‌లు రూ.20 వేల బ్యాంక్ గ్యారెంటీతోపాటు, రూ.ఐదు వేల విలువైన సెక్యూరిటీ డిపాజిట్ డిమాండ్డ్రాఫ్ట్లను రైల్వేకు అందజేయాలి. అలాగే అభ్యర్థి కాండక్ట్, నివాస ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. సికింద్రాబాద్ డివిజన్లోని 57స్టేషన్లు, హైదరాబాద్ డివిజన్లోని 27 స్టేషన్లు, విజయవాడ డివిజన్లో 58, గుంటూరు డివిజన్లో 13, గుంతకల్ డివిజన్లో 37, నాందేడ్‌లో 14 స్టేషన్లలో ఎస్టీబీఐలను నియమిస్తారు. -
సికింద్రాబాద్-డోన్ మధ్య రైళ్లకు అంతరాయం
హైదరాబాద్: సికింద్రాబాద్-డోన్ మధ్య బ్రిడ్జి నిర్మాణ పనుల దృష్ట్యా ఆ మార్గంలో నడిచే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22, 25, 27 తేదీలలో గుంతకల్-కాచిగూడ మధ్య నడిచే ప్యాసింజర్ మహబూబ్‌నగర్-మన్యంకొండ స్టేషన్ల మధ్య మొదటి రోజు 2.50 గంటలు, మిగతా రెండు రోజులు 1.15 గంటలు ఆలస్యంగా నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో కాచిగూడ-గుంతకల్ (57425) ప్యాసింజర్ కూడా మొదటి రోజులు 3 గంటలు, మిగతా రెండు రోజులు గంటన్నర ఆలస్యంగా నడిచేటట్లుగా వేళలను క్రమబద్ధీకరిస్తారు. అలాగే కాచిగూడ-బోధన్ (57473) ప్యాసింజర్ కూడా మొదటి రోజు 2.40 గంటలు, మిగతా రెండు రోజులు గంటా 15 నిమిషాలు ఆలస్యంగా నడువనుంది. కాగా, ఈ నెల 29వ తేదీన మహబూబ్‌నగర్-కాచిగూడ (57456) ప్యాసింజర్ మహబూబ్‌నగర్-గొల్లపల్లి మధ్య పాక్షికంగా రద్దు కానుంది. అలాగే కాచిగూడ-గుంతకల్ (57425), గుంతకల్-కాచిగూడ (57426) ప్యాసింజర్లు గొల్లపల్లి-జడ్చర్ల మధ్య ఆలస్యంగా నడుస్తాయి. కాచిగూడ-బోధన్ ప్యాసింజర్ (57473) బోధన్ నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుంది. -
భువనేశ్వర్-యశ్వంత్‌పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: భువనేశ్వర్-యశ్వంత్‌పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భువనేశ్వర్-యశ్వంత్‌పూర్(02845) సూపర్‌ఫాస్ట్ మార్చి 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 11 గంటలకు భువనేశ్వర్ నుంచి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో యశ్వంత్‌పూర్-భువనేశ్వర్(02846) మార్చి 7, 14, 21, 28 తేదీల్లో మధ్యాహ్నం 1.30 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరుతుంది. ఈ రైళ్లు రాష్ట్రంలో పలాస, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఆగుతాయి. పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కు అదనపు బోగీలు గుంటూరు జిల్లా గోరంట్లలో మార్చి 6 నుంచి 9 వరకు జరిగే హోసన్న మినిస్ట్రీస్ వేడుకల సందర్భంగా అనకాపల్లి-గుంటూరు మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు సీపీఆర్వో తెలిపారు. అదేవిధంగా మచిలీపట్నం-యశ్వంత్‌పూర్ మధ్య నడిచే మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్, గుంటూరు-వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లకు మార్చి 5 నుంచి 9 వరకు అదనంగా 2 జనరల్ బోగీలను ఏర్పాటు చేస్తారు. నర్సాపూర్-నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్‌కు ఏసీ త్రీటైర్ కాజీపేట్ మీదుగా వెళ్లే నర్సాపూర్-నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్ (17213/17214)కు ఏప్రిల్ ఒకటి నుంచి, వయా గుంటూరు మీదుగా వెళ్లే నర్సాపూర్-నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్ (17231/17232)కు ఏప్రిల్ 4 నుంచి ఒక ఏసీ త్రీటైర్ బోగీ ని అదనంగా ఏర్పాటు చేస్తున్నట్టు సీపీఆర్వో తెలిపారు.