భువనేశ్వర్-యశ్వంత్‌పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు | Bhubaneswar to Yesvantpur special train | Sakshi
Sakshi News home page

భువనేశ్వర్-యశ్వంత్‌పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు

Published Thu, Feb 27 2014 3:22 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Bhubaneswar to Yesvantpur special train

సాక్షి, హైదరాబాద్: భువనేశ్వర్-యశ్వంత్‌పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భువనేశ్వర్-యశ్వంత్‌పూర్(02845) సూపర్‌ఫాస్ట్ మార్చి 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 11 గంటలకు భువనేశ్వర్ నుంచి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో యశ్వంత్‌పూర్-భువనేశ్వర్(02846) మార్చి 7, 14, 21, 28 తేదీల్లో మధ్యాహ్నం 1.30 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరుతుంది. ఈ రైళ్లు రాష్ట్రంలో పలాస, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్‌లలో ఆగుతాయి.
 
 పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కు అదనపు బోగీలు
 గుంటూరు జిల్లా గోరంట్లలో మార్చి 6 నుంచి 9 వరకు జరిగే హోసన్న మినిస్ట్రీస్ వేడుకల సందర్భంగా అనకాపల్లి-గుంటూరు మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు సీపీఆర్వో తెలిపారు. అదేవిధంగా మచిలీపట్నం-యశ్వంత్‌పూర్ మధ్య నడిచే మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్, గుంటూరు-వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లకు మార్చి 5 నుంచి 9 వరకు అదనంగా 2 జనరల్ బోగీలను ఏర్పాటు చేస్తారు.
 
 నర్సాపూర్-నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్‌కు ఏసీ త్రీటైర్
 కాజీపేట్ మీదుగా వెళ్లే నర్సాపూర్-నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ (17213/17214)కు ఏప్రిల్ ఒకటి నుంచి, వయా గుంటూరు మీదుగా వెళ్లే నర్సాపూర్-నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ (17231/17232)కు ఏప్రిల్ 4 నుంచి ఒక ఏసీ త్రీటైర్ బోగీ ని అదనంగా ఏర్పాటు చేస్తున్నట్టు సీపీఆర్వో తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement