ఎక్కడికక్కడే అరెస్టులు
ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సభను అడ్డుకున్న పోలీసులు
నగరంలోని పలుచోట్ల బారికేడ్లు.. ముళ్లకంచెల ఏర్పాటు
విరసం నేత వరవరరావుతో సహా 174 మంది అరెస్టు
ఉస్మానియా వర్సిటీలోనూ ఉద్రిక్తత
అదుపులో ఇతర రాష్ట్రాల కళాకారులు, జిల్లాల నాయకులు
రోజంతా ఠాణాలోనే నేతలు
సాక్షి, హైదరాబాద్: నిరసనలు, నినాదాలు, వాగ్వాదాలు, తోపులాటలు, అరెస్టులు, గృహ నిర్బంధాలతో సుందరయ్యు విజ్ఞాన కేంద్రం పరిసరాలు అట్టుడికారుు. సభలు, సవూవేశాలతో నిత్యం ప్రశాంతంగా ఉండే ఆ పరిసరాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మావోయిస్టు విప్లవోద్యమ ప్రస్థానం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్యు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన సభను ప్రభుత్వం అడ్డుకుంది. దీనికి అనువుతి లేదంటూ వేదిక కన్వీనర్, విరసం నేత వరవరరావు సహా 174 వుంది విప్లవకారులను అరెస్టు చేసి, 14 పోలీస్ స్టేషన్లలో పోలీసులు నిర్బంధించారు. అరెస్టయిన వారిని రాత్రి ఎనిమిదిగంటల సమయంలో విడిచిపెట్టారు.
శనివారం అర్ధరాత్రి నుంచే అలజడి
ప్రత్యావ్నూయు సభకు అనువుతి లేదంటూ పోలీసులు శనివారం రాత్రే సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని తవు అధీనంలోకి తీసుకున్నారు. కార్యకర్తలు రాకుండా రోడ్డుకు అడ్డంగా బారికేట్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాంధీనగర్‌లోని తన నివాసంలో ఉన్న వేదిక కన్వీనర్, విరసం నేత వరవరరావును ఆదివారం ఉదయుం అరెస్టు చేసి కంచన్‌బాగ్ పోలీసుస్టేషన్‌కు తరలించి రోజంతా అక్కడే నిర్బంధించారు. కాచిగూడ తుల్జాభవన్ విడిదిలో ఉన్న జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన నేతలు, కళాకారులను అరెస్టు చేసి అబిడ్స్, ఫలక్‌నుమా పోలీసుస్టేషన్లకు తరలించారు. వీరిలో జార్ఖండ్ కళాకారుడు జీతన్ మరాండితో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సభ్యురాలు పద్మకుమారి, పినాకపాణి, విరసం నాయకురాలు వరలక్ష్మి, తదితరులున్నారు.
ఉస్మానియూలోనూ ఉద్రిక్తత
ఉస్మానియా వర్సిటీ నుంచి సభకు తరలివస్తున్న 60 వుంది విద్యార్థులను ఎన్‌సీసీ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల వుధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కర్నూలు, కడప, అనంతపురం చిత్తూరు, గుంటూరు జిల్లాల నుంచి రైల్లో కాచిగూడ స్టేషన్‌కు చేరుకున్న కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. పోలీసుల చర్యను నిరసిస్తూ పలు ప్రజా సంఘాలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఆయూ స్టేషన్ల వుుందు అందోళనకు దిగాయి. వురికొంత వుంది ట్యాంక్‌బండ్‌పై నిరసన తెలిపారు. సభకు బయులుదేరిన విరసం నేత కల్యాణ్‌రావుతో సహా పలువురు కార్యకర్తలను ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోనే అరెస్టు చేశారు.
రాక్షస పాలన గుర్తుకొస్తోంది: వేణుగోపాల్
రాష్ట్రంలో రాక్షస సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాక్షస పాలన సాగుతోందని చెప్పడానికి ఈ నిర్బంధాలే సాక్ష్యమని వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ మండి పడ్డారు. వరవరరావు అరెస్టును తెలుసుకున్న ఆయన వరవరరావు భార్య హేమలత, ఆయన కుమార్తెలతో కలిసి కంచన్‌బాగ్ పోలీసుస్టేషనుకు చేరుకున్నారు. తొలుత వారికి అనుమతి నిరాకరించిన పోలీసులు అనంతరం అంగీకరించడంతో వారు వరవరరావును కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా స్టేషను బయట విలేకరులతో మాట్లాడిన వేణుగోపాల్ ప్రస్తుత పరిస్థితులు ఎమర్జన్సీని తలపిస్తున్నాయన్నారు. తమది మావోల ఎజెండా అని చెప్పుకున్న కేసీఆర్ ఇప్పుడది విస్మరించారన్నారు. రాజ్యం మళ్లీ పోలీసుల చేతుల్లోకి వెళుతోందన్నారు. తమ ర్యాలీకి హోం మంత్రి అనుమతించినా....పోలీసులు అడ్డుకోవడం తగదన్నారు.
సీఎంను కలిసేందుకు వెళ్లిన హరగోపాల్ గృహనిర్బంధం...
తమ సభకు, ర్యాలీకి అనుమతినివ్వాలని తొలుత ఆదివారం ఉదయం పౌరహక్కుల నేత హరగోపాల్ మరో ఇరువురు నేతలు రఘనాథ్, బల్లారవిలతో కలిసి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావును కలసేందుకు ఆయన క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లారు. ఈ సమయంలో వారిని అదుపలోకి తీసుకున్న పోలీసులు హరగోపాల్‌ను ఆయన ఇంటికి తరలించిన గృహనిర్బంధలో ఉంచారు. మిగతా ఇరువురినీ పంజగుట్ట పోలీసు స్టేషనుకు తరలించారు. ఈ అంశాన్ని హరగోపాల్ , ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్యల దృష్టికి తేవడంతో వారు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డితో మాట్లాడి పోలీసుల చర్యలను ఖండించారు. దీనితో నిర్బంధంలో ఉన్న హరగోపాల్ తనతో కలవ వచ్చని కమిషనర్ చెప్పడంతో పోలీసులు ఆయనను విడుదల చేశాక మహేంద్ర రెడ్డిని పొత్తూరి, చుక్కా రామయ్యలతో కలసి వెళ్లి సభకు అనుమంతించాలని విజ్ఞప్తి చేశారు. అరెస్టయిన వారిపై ఎలాంటి కేసులూ నమోదు చేయడం లేదని రాత్రికి విడచి పెడతామని నేతలకు కమిషనర్ హామీ ఇచ్చారు.
బొల్లారం పీఎస్‌లో విరసం సభ్యులు
బొల్లారం: బాగ్‌లింగంపల్లిలో సదస్సు నిర్వహించేందుకు ప్రయత్నించిన విరసం సభ్యులను అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మొత్తం 43 మంది విరసం సభ్యులను పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా నిర్బంధంలో ఉన్న విరసం సభ్యులు పద్మకుమారి, ఫణి, తదితరులు విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య రక్షణ తమ ఎజెండా అంటూ అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు.