జాస్మిన్ స్టార్క్(26) అనే మహిళ షాపింగ్ చేసేందుకు బయటకు వెళ్లింది. అయితే ఎప్పుడు వెంట తీసుకెళ్లే తన పెంపుడు పిల్లి అంబర్‌ను ఆరోజు మాత్రం ఇంట్లోనే వదిలివెళ్లింది. యజమాని తనని తీసుకెళ్లలేదనే కోపంతో అంబర్ ఒక తుంటరి పని చేసింది. మెల్లిగా బాత్‌రూంలోకి వెళ్లిన అంబర్ సింక్ మీదకు వెళ్లి కుళాయి ఆన్‌చేసింది. ఆ తర్వాత సింక్‌లోని ప్లగ్‌హోల్‌ను సబ్బుతో మూసేసింది. ఇంకేముంది నీరంతా సింక్‌లో నుంచి గది మొత్తం నిండిపోయి.. ఆ నీరంతా పైకప్పు నుంచి కింది ప్లోర్‌కు జాలువారింది. (చదవండి : ఒక్క పనితో రియల్ హీరో అనిపించుకున్నాడు)
షాపింగ్ ముగించుకొని ఇంటికి వచ్చిన జాస్మిన్ స్టార్క్ ఇంటి డోర్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. అసలు ఈ నీళ్లు ఎలా వచ్చాయో మొదట జాస్మిన్‌కు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆలోచించి చూస్తే తన పెంపుడు పిల్లి అంబర్ ఈ తుంటరి పని చేసిందని ఆమె గ్రహించింది. బాత్‌రూంలోకి వెళ్లి చూసేసరికి జాస్మిన్‌కు అక్కడ అంబర్ కనిపించింది. దీంతో వెంటనే కుళాయిని కట్టేసి నీరును మొత్తం బయటికి ఎత్తి పోసింది. అయితే నీరుతో ఇంట్లోని పలు విలువైన వస్తువులు పాడైపోయాయి. అంబర్ చేసిన అల్లరి పని వల్ల జాస్మిన్‌కు దాదాపు వేల పౌండ్ల నష్టం కలిగించింది. అయితే దీనిపై జాస్మిన్ స్పందిస్తూ.. 'ఇంకా నయం.. షాపింగ్ వెళ్లి తొందరగా వచ్చాను కాబట్టి సరిపోయింది..లేకపోతే నా ఇల్లు మొత్తం నీటిపాలయ్యేది’ అని చెప్పుకొచ్చింది. కాగా ఈ వీడియోను జాస్మిన్ తన ట్విటర్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారింది.
Anyone ever had to ring their boss and say they can’t work cause their cat flooded the house, or just me? pic.twitter.com/lIi5bgpTVc
— Jasmin Stork (@JasminStork) October 8, 2020
Comments
Please login to add a commentAdd a comment