ఓరెగాన్ : కుటుంబం మొత్తాన్ని అంతమొందించి మరో చిన్నారిని కూడా హత్య చేయబోయిన మానవ మృగాన్ని పోలీసులు కాల్చి చంపారు. అమెరికాలోని ఓరెగాన్‌లో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మార్క్ లియో గ్రెగరీ గాగో(42) తన తల్లిదండ్రులు, గర్ల్‌ఫ్రెండ్ షైనా స్వీజర్(31), కూతురు(9 నెలలు)తో కలిసి క్లాకమస్ కంట్రీలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంటికి వచ్చిన లియో కుటుంబ సభ్యులను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. అనంతరం తమ ఇంటి పక్కనే ఉంటున్న మరో ఎనిమిదేళ్ల చిన్నారి(గర్ల్‌ఫ్రెండ్ మొదటి భర్త కూతురు)ని కూడా చంపేందుకు ఆమె వెంటపడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన పొరుగింటి వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కాల్పులు జరుపగా అతడు మృతి చెందాడు.
వారిని ఎలా చంపాడో తెలియదు
ఈ ఘటన గురించి క్లాకమస్ కంట్రీ షెరిఫ్ ఆఫీస్ అధికారి జెన్‌సెన్ మాట్లాడుతూ.. ‘ బాధితులను చంపడానికి లియో ఏ ఆయుధాన్ని ఉపయోగించాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అతడి గదిలో వివిధ రకాల ఆయుధాలు, కత్తులు, రాడ్లు లభించాయి. గది మొత్తం రక్తంతో నిండిపోయి ఉంది. 20 ఏళ్ల సర్వీసులో ఇటువంటి క్రైం సీన్ చూడటం ఇదే తొలిసారి. ఈ హత్యకు గల కారణాలు అన్వేషిస్తున్నాం’ అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment