shot dead by police
-
ఆస్ట్రేలియా పోలీసుల కాల్పుల్లో భారతీయుడు మృతి.. కారణం ఇదే!
ఆస్ట్రేలియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆ దేశ పోలీసులు జరిపిన కాల్పుల్లో భారతీయ యువకుడు మృతిచెందాడు. కాగా, మృతుడిని తమిళనాడుకు చెందిన మహ్మద్ రెహ్మత్తుల్లా సయ్యద్ అహ్మద్‌గా గుర్తించారు. ఇక, ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం కూడా స్పందించింది. వివరాల ప్రకారం.. సయ్యద్ అహ్మద్(32) బ్రిడ్జింగ్ వీసాపై ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు. అయితే, మంగళవారం సయ్యద్.. సిడ్నీ రైల్వే స్టేషన్లో ఓ క్లీనర్‌ను కత్తితో పొడవడమే కాకుండా అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై అటాక్ చేయబోయాడు. దీంతో, పోలీసులు.. అహ్మద్‌పై మూడు రౌండ్లలో కాల్పులు జరిపారు. ఈ క్రమంలో రెండు బుల్లెట్స్ అతడి చాతీలోకి దూసుకెళ్లాయి. అనంతరం, పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించగా.. సయ్యద్ అహ్మద్ మృతిచెందినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సిడ్నీ ఏసీపీ స్మిత్ మీడియాతో మాట్లాడుతూ.. సయ్యద్ అహ్మద్‌పై ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదన్నారు. దీన్ని తీవ్రవాద దాడిగా తాము పరిగణించడంలేదని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు, సయ్యద్ మృతిపై ఆస్ట్రేలియాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయమని ఆవేదన వ్యక్తపరిచింది. అలాగే, విదేశీ వ్యవహారాలు, వాణిజ్య విభాగంతోపాటు పోలీసు అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని పేర్కొంది. Australia 🇦🇺: A 32-year-old Mohamed Rahmathullah Syed Ahmed was shot dead by the Australian Police after he stabbed a railway station cleaner & threatened police officials with a knife at the Auburn train station in Sydney + #Australia #Sydney #India pic.twitter.com/GuXskFvmqE — Ashwini Shrivastava (@AshwiniSahaya) March 1, 2023 -
‘ఇటువంటి క్రైం సీన్ చూడటం ఇదే తొలిసారి’
ఓరెగాన్ : కుటుంబం మొత్తాన్ని అంతమొందించి మరో చిన్నారిని కూడా హత్య చేయబోయిన మానవ మృగాన్ని పోలీసులు కాల్చి చంపారు. అమెరికాలోని ఓరెగాన్‌లో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మార్క్ లియో గ్రెగరీ గాగో(42) తన తల్లిదండ్రులు, గర్ల్‌ఫ్రెండ్ షైనా స్వీజర్(31), కూతురు(9 నెలలు)తో కలిసి క్లాకమస్ కంట్రీలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంటికి వచ్చిన లియో కుటుంబ సభ్యులను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. అనంతరం తమ ఇంటి పక్కనే ఉంటున్న మరో ఎనిమిదేళ్ల చిన్నారి(గర్ల్‌ఫ్రెండ్ మొదటి భర్త కూతురు)ని కూడా చంపేందుకు ఆమె వెంటపడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన పొరుగింటి వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కాల్పులు జరుపగా అతడు మృతి చెందాడు. వారిని ఎలా చంపాడో తెలియదు ఈ ఘటన గురించి క్లాకమస్ కంట్రీ షెరిఫ్ ఆఫీస్ అధికారి జెన్సెన్ మాట్లాడుతూ.. ‘ బాధితులను చంపడానికి లియో ఏ ఆయుధాన్ని ఉపయోగించాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అతడి గదిలో వివిధ రకాల ఆయుధాలు, కత్తులు, రాడ్లు లభించాయి. గది మొత్తం రక్తంతో నిండిపోయి ఉంది. 20 ఏళ్ల సర్వీసులో ఇటువంటి క్రైం సీన్ చూడటం ఇదే తొలిసారి. ఈ హత్యకు గల కారణాలు అన్వేషిస్తున్నాం’ అని పేర్కొన్నాడు. -
అమెరికాలో భారత సంతతి లాయర్ కాల్పులు
భారత సంతతికి చెందిన ఓ న్యాయవాది సైనిక దుస్తులు ధరించి.. నాజీ సానుభూతిపరుడిలా స్వస్తిక్ గుర్తు ధరించి.. అమెరికాలో కాల్పులు జరిపాడు. హ్యూస్టన్ నగరంలో జరిగిన ఈ కాల్పులలో తొమ్మిది మంది గాయపడ్డారు. తర్వాత పోలీసులు అతడిని కాల్చి చంపారు. నాథన్ దేశాయ్ (46) అనే ఆ వ్యక్తి ఒక హ్యాండ్‌గన్, మరో సబ్ మిషన్‌గన్ పట్టుకుని దాదాపు 20 నిమిషాల పాటు వచ్చిపోయే కార్ల మీద, పోలీసుల మీద కాల్పులు జరిపినట్లు స్థానిక టీవీ చానల్ పేర్కొంది. మందుగుండు సామగ్రిని కారులో నిల్వ చేశాడని, ఒక చెట్టు వెనక నిలబడి కాల్పులు జరిపాడని సదరు చానల్ తెలిపింది. దేశాయ్ ఎందుకు ఇలా కాల్పులు జరిపాడన్న విషయం ఇంకా తెలియలేదు. హ్యూస్టన్‌లోని మీడియా కథనాలలో దేశాయ్ పేరులో ఎస్ అక్షరాన్ని పెద్దగా రాసి, అది యూరోపియన్ పేరు అనిపించేలా చేశారు. కానీ అతడి తండ్రి పేరు ప్రకాష్ దేశాయ్ అని తెలియడంతో.. అతడికి భారతీయ మూలాలున్న విషయం తెలిసింది. క్షతగాత్రులలో ఒకరు తప్ప మిగిలిన అందరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఒక్కరు మాత్రం తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. మరో ఐదుగురు ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారని హ్యూస్టన్ పోలీసు చీఫ్ మార్తా మోంటావ్లో చెప్పారు. దేశాయ్‌కి అతడి న్యాయసంస్థలో కొన్ని సమస్యలున్నాయని, పోలీసులు అక్కడకు రాగానే వారి మీద కూడా కాల్పులు జరిపాడని, వాళ్లు జరిపిన ఎదురు కాల్పుల్లో అతడు మరణించాడని అన్నారు. అతడి న్యాయవాద ప్రాక్టీసు పెద్దగా బాగోకపోవడంతో బాగా ఆవేదన చెందేవాడని నాథన్ తండ్రి ప్రకాష్ దేశాయ్ తెలిపారు. అయితే తన కొడుకు ఇలా చేస్తాడంటే మాత్రం ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, కాల్పులకు 12 గంటల ముందే ఇద్దరం కలిసి భోజనం చేశామని ఆయన అన్నారు.