అమెరికాలో భారత సంతతి లాయర్ కాల్పులు | Indian origin lawyer shoots at 9 people in usa, shot dead by police | Sakshi
Sakshi News home page

అమెరికాలో భారత సంతతి లాయర్ కాల్పులు

Published Wed, Sep 28 2016 11:03 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

అమెరికాలో భారత సంతతి లాయర్ కాల్పులు - Sakshi

అమెరికాలో భారత సంతతి లాయర్ కాల్పులు

భారత సంతతికి చెందిన ఓ న్యాయవాది సైనిక దుస్తులు ధరించి.. నాజీ సానుభూతిపరుడిలా స్వస్తిక్ గుర్తు ధరించి.. అమెరికాలో కాల్పులు జరిపాడు. హ్యూస్టన్ నగరంలో జరిగిన ఈ కాల్పులలో తొమ్మిది మంది గాయపడ్డారు. తర్వాత పోలీసులు అతడిని కాల్చి చంపారు. నాథన్ దేశాయ్ (46) అనే ఆ వ్యక్తి ఒక హ్యాండ్‌గన్, మరో సబ్ మిషన్‌గన్ పట్టుకుని దాదాపు 20 నిమిషాల పాటు వచ్చిపోయే కార్ల మీద, పోలీసుల మీద కాల్పులు జరిపినట్లు స్థానిక టీవీ చానల్ పేర్కొంది. మందుగుండు సామగ్రిని కారులో నిల్వ చేశాడని, ఒక చెట్టు వెనక నిలబడి కాల్పులు జరిపాడని సదరు చానల్ తెలిపింది. దేశాయ్ ఎందుకు ఇలా కాల్పులు జరిపాడన్న విషయం ఇంకా తెలియలేదు. హ్యూస్టన్‌లోని మీడియా కథనాలలో దేశాయ్ పేరులో ఎస్ అక్షరాన్ని పెద్దగా రాసి, అది యూరోపియన్ పేరు అనిపించేలా చేశారు. కానీ అతడి తండ్రి పేరు ప్రకాష్ దేశాయ్ అని తెలియడంతో.. అతడికి భారతీయ మూలాలున్న విషయం తెలిసింది.

క్షతగాత్రులలో ఒకరు తప్ప మిగిలిన అందరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఒక్కరు మాత్రం తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. మరో ఐదుగురు ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారని హ్యూస్టన్ పోలీసు చీఫ్ మార్తా మోంటావ్లో చెప్పారు. దేశాయ్‌కి అతడి న్యాయసంస్థలో కొన్ని సమస్యలున్నాయని, పోలీసులు అక్కడకు రాగానే వారి మీద కూడా కాల్పులు జరిపాడని, వాళ్లు జరిపిన ఎదురు కాల్పుల్లో అతడు మరణించాడని అన్నారు. అతడి న్యాయవాద ప్రాక్టీసు పెద్దగా బాగోకపోవడంతో బాగా ఆవేదన చెందేవాడని నాథన్ తండ్రి ప్రకాష్ దేశాయ్ తెలిపారు. అయితే తన కొడుకు ఇలా చేస్తాడంటే మాత్రం ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, కాల్పులకు 12 గంటల ముందే ఇద్దరం కలిసి భోజనం చేశామని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement