ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరో మారు సంచలనం సృష్టించాడు. అమెరికాలోని యుజీన్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2022లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో 88.13 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా.. సిల్వర్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. నీరజ్ చోప్రా తన తొలి ప్రయత్నాన్ని ఫౌల్ త్రో తో ప్రారంభించాడు. రెండో ప్రయత్నంలో 82.39మీ విసిరి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఇక మూడో ప్రయత్నంలో 86.37 మీటర్లు విసిరాడు. నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్లు త్రో చేశాడు.
ఇక తన అఖరి ప్రయత్నంలో నీరజ్ ఫౌల్ త్రో చేశాడు. దీంతో నాలుగో ప్రయత్నంలో విసిన దూరాన్ని అత్యధికంగా లెక్కించారు. ఇక గ్రెనేడియన్ జావెలిన్ త్రోయర్ అండర్సన్ పీటర్స్ 90.54 దూరం విసిరి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. ఇక సిల్వర్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన రెండో భారత అథ్లెట్‌గా నీరజ్ చోప్రా రికార్డులకెక్కాడు. అంతకు ముందు 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత లాంగ్ జంపర్ అంజూ బాబి జార్జ్ కాంస్య పతకం సాధించింది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: World Athletics Championship: పసిడి... ప్రపంచ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment