ప్యారిస్ ఒలింపిక్స్‌లో పాకిస్తాన్ స్టార్ అథ్లెట్ అర్షద్ నదీమ్ పసడి పతకంతో మెరిశాడు. జావెలిన్ త్రో ఈవెంట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన అర్షద్ నదీమ్ స్వర్ణపతకం కైవసం చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు.
గురువారం ఆర్ధ రాత్రి దాటాక జరిగిన ఫైనల్లో తన జావెలిన్‌ను 92.97 మీటర్లు విసిరిన జావెద్ ..తొలి ఒలింపిక్స్ గోల్డ్‌మెడల్‌ను ముద్దాడాడు. ఫైనల్లో 27 ఏళ్ల జావెద్ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను వెనక్కినెట్టి అగ్రస్ధానాన్ని కైవసం చేసుకున్నాడు.
నీరజ్ చోప్రా జావెలిన్‌ను 89.45 మీటర్లు విసిరి రజత పతకం సొంతం చేసుకున్నాడు. అదే విధంగా ప్రపంచ మాజీ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) 88.54 మీటర్లతో కాంస్య పతకాన్ని సాధించాడు.
చరిత్ర సృష్టించిన అర్షద్ నదీమ్..
ఇక ఈ విశ్వక్రీడల్లో అర్షద్ నదీప్ గోల్డ్‌మెడల్‌తో పాటు మరో అరుదైన రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఒలింపిక్స్‌లో జావెలిన్‌ను అత్యధిక దూరం విసిరిన భల్లెం వీరుడుగా అర్షద్ రికార్డులకెక్కాడు.
గతంలో ఈ రికార్డు నార్వేకు చెందిన ఆండ్రియాస్ పేరిట ఉండేది. బీజింగ్ 2008 ఒలింపిక్స్‌లో ఆండ్రియాస్ 90.57 మీటర్లు విసిరి ఈ ఫీట్ సాధించాడు. అయితే ప్యారిస్ ఒలింపిక్స్‌లో 92.97 మీటర్లు విసిరిన జావెద్ ఆండ్రియాస్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. అదేవిధంగా ఒలింపిక్స్ చరిత్రలోనే పాకిస్తాన్ తరపున వ్యక్తిగత విభాగంలో గోల్డ్‌మెడల్ గెలుచుకున్న తొలి అథ్లెట్‌గా అర్షద్ నిలిచాడు.
ARSHAD NADEEM REWRITES OLYMPIC HISTORY WITH 9️⃣2️⃣.9️⃣7️⃣
Catch him in the Javelin final LIVE NOW on #Sports18 and stream for FREE on #JioCinema https://t.co/4IZVAsktjp#OlympicsOnJioCinema #OlympicsOnSports18 #Olympics #JavelinThrow #Athletics pic.twitter.com/5gP5iRHgph— JioCinema (@JioCinema) August 8, 2024
Comments
Please login to add a commentAdd a comment