Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు ఈ నెల (జులై) 28 నుంచి ఆగస్ట్ 8 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌లో 214 మంది సభ్యుల భారత బృందం మొత్తం 16 క్రీడా విభాగాల్లో పాల్గొంటుంది. ఈ క్రీడల్లో మహిళల క్రికెట్‌కు తొలిసారి అవకాశం లభించింది. తాజాగా ముగిసిన వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో జావెలిన్ త్రోలో రజతం సాధించిన నీరజ్ చోప్రా ప్రారంభ వేడుకల్లో భారత ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనున్నాడు.
ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరిగిన 2018 గేమ్స్‌లో 66 పతాకలు సాధించిన భారత్.. ఈసారి పతకాల సంఖ్య మరింత పెంచుకోవాలని భావిస్తుంది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా, బ్యాడ్మింటన్‌లో పీవీ సింధులతో పాటు మహిళల క్రికెట్, హాకీలలో భారత్ స్వర్ణ పతకాలు ఆశిస్తుంది. ఈ క్రీడల్లో భారత షెడ్యూల్ ఎలా ఉందంటే..
జులై 29: అశ్విని పొన్నప్ప, సుమీత్ రెడ్డి (బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్)
జులై 30: నితేందర్ రావత్ (పురుషుల మారథాన్)
ఆగస్ట్ 2: అవినాశ్ సేబుల్ (పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్)
మురళీ శ్రీశంకర్, మహ్మద్ అనీస్ (పురుషుల లాంగ్ జంప్)
జ్యోతి (మహళల 100మీ హర్డిల్స్)
నవ్‌జీత్ కౌర్ (మహిళల డిస్కస్ త్రో)
ఆగస్ట్ 3: పీవీ సింధు, ఆకర్షి కశ్యప్ (బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్)
లక్ష్య సేన్, కిదాంబి శ్రీకాంత్ (పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్)
ఆగస్ట్ 4: ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ (బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్)
సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి (పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్)
ఆగస్ట్ 5: నీరజ్ చోప్రా, డీపీ మను, రోహిత్ యాదవ్ (పురుషుల జావెలిన్ త్రో)
అబ్దుల్లా అబూబాకర్, ప్రవీణ్ చిత్రవేల్, ఎల్దోస్ పాల్ (పురుషుల ట్రిపుల్ జంప్)
సందీప్ కుమార్, అమిత్ ఖత్రి (పురుషుల 10కిమీ రేస్ వాక్)
ఆన్సీ సోజన్ (మహిళల లాంగ్ జంప్)
అన్నూ రాణి, శిల్పా రాణి (మహిళల జావెలిన్ త్రో)
మంజు బాలా సింగ్, సరితా రోమిత్ సింగ్ (మహిళల హ్యామర్ త్రో)
ఆగస్ట్ 6: అమోజ్ జాకబ్, నోవా నిర్మల్ టామ్, అరోకియా రాజీవ్, మహ్మద్ అజ్మల్, నాగనాథన్ పండి, రాజేష్ రమేష్ (పురుషుల 4X400మీ రిలే)
భావన జాట్, ప్రియాంకా గోస్వామి (మహిళల 10కిమీ రేస్ వాక్)
హిమ దాస్, ద్యుతీ చంద్, శ్రాబనీ నందా, ఎంవీ జిల్నా, ఎన్‌ఎస్ సిమి (మహిళల 4X100మీ రిలే)
మహిళల క్రికెట్:
జులై 29: భారత్ vs ఆస్ట్రేలియా
జులై 31: భారత్ vs పాకిస్థాన్
ఆగస్ట్ 3: భారత్ vs బార్బడోస్
పురుషుల హాకీ:
జులై 31: భారత్ vs ఘనా
ఆగస్ట్ 1: భారత్ vs ఇంగ్లండ్
ఆగస్ట్ 3: భారత్ vs కెనడా
ఆగస్ట్ 4: భారత్ vs వేల్స్
మహిళల హాకీ:
జులై 29: భారత్ vs ఘనా
జులై 30: భారత్ vs వేల్స్
ఆగస్ట్ 2: భారత్ vs ఇంగ్లండ్
ఆగస్ట్ 3: భారత్ vs కెనడా
బాక్సింగ్:
జులై 30: అమిత్ పంగాల్ (మెన్స్ 51 కేజీ)
మహ్మద్ హుసాముద్దీన్ (మెన్స్ 57 కేజీ)
శివ థాపా (మెన్స్ 63 కేజీ)
రోహిత్ టోకాస్ (మెన్స్ 67 కేజీ)
సుమిత్ కుందు (మెన్స్ 75 కేజీ)
ఆశిష్ చౌదరి (మెన్స్ 80 కేజీ)
సంజీత్ (మెన్స్ 92 కేజీ)
సాగర్ (మెన్స్ 92+ కేజీ)
నీతూ (వుమెన్స్ 48 కేజీ)
నిఖత్ జరీన్ (వుమెన్స్ 50 కేజీ)
జాస్మిత్ (వుమెన్స్ 60 కేజీ)
లవ్లీనా బోర్గహైన్ (వుమెన్స్ 70 కేజీ)
వెయిట్‌లిఫ్టింగ్:
జులై 30: మీరాబాయి చాను (వుమెన్స్ 55 కేజీ)
సంకేత్ మహదేవ్ (మెన్స్ 55 కేజీ)
రిషికాంతా సింగ్ (మెన్స్ 55 కేజీ)
జులై 31: బింద్రాయనీ దేవి (వుమెన్స్ 59 కేజీ)
జెరెమీ లాల్‌రినుంగా (మెన్స్ 67 కేజీ)
అచింతా (మెన్స్ 73 కేజీ)
ఆగస్ట్ 1: పాపీ హజారికా (వుమెన్స్ 64 కేజీ)
అజయ్ సింగ్ (మెన్స్ 81 కేజీ)
ఆగస్ట్ 2: ఉషా కుమార (వుమెన్స్ 87 కేజీ)
పూర్ణిమా పాండే (వుమెన్స్ 87+ కేజీ)
వికాస్ ఠాకూర్ (మెన్స్ 96 కేజీ)
రాగాల వెంకట్ రాహుల్ (మెన్స్ 96 కేజీ)
రెజ్లింగ్:
ఆగస్ట్ 5: బజరంగ్ పూనియా (మెన్స్ 65 కేజీ)
దీపక్ పూనియా (మెన్స్ 86 కేజీ)
మోహిత్ గ్రెవాల్ (మెన్స్ 125 కేజీ)
అన్షు మాలిక్ (వుమెన్స్ 57 కేజీ)
సాక్షి మాలిక్ (వుమెన్స్ 62 కేజీ)
దివ్యా కాక్రన్ (వుమెన్స్ 68 కేజీ)
ఆగస్ట్ 6:రవికుమార్ దహియా (57 కేజీ)
నవీన్ (మెన్స్ 74 కేజీ)
దీపక్ (మెన్స్ 97 కేజీ)
పూజా గెహ్లోత్ (వుమెన్స్ 50 కేజీ)
వినేష్ పోఘాట్ (వుమెన్స్ 53 కేజీ)
పూజా సిహాగ్ (వుమెన్స్ 76 కేజీ)
లైవ్ ఎందులో అంటే..
ఈసారి కామన్వెల్త్ గేమ్స్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ సొంతం చేసుకుంది.
చదవండి: భారత్‌కు వరుస షాక్‌లు.. డోప్ టెస్ట్‌లో పట్టుబడ్డ మరో అథ్లెట్
Comments
Please login to add a commentAdd a comment