నిన్ను చూసి దేశం గర్విస్తుంది: అల్లు అర్జున్‌ | Allu Arjun Wishes To Neeraj Chopra | Sakshi
Sakshi News home page

Allu Arjun: నిన్ను చూసి దేశం గర్విస్తుంది.. నీరజ్‌ చోప్రాకు బన్నీ విషెస్‌

Aug 28 2023 2:03 PM | Updated on Aug 28 2023 2:06 PM

Allu Arjun Wishes To Neeraj Chopra - Sakshi

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లొ 88.17 మీటర్లు ఈటెను విసిరి పురుషుల జావెలిన్ త్రో విజేతగా నిలిచాడు. స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. మరోసారి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు . ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో పాకిస్థాన్‌కు చెందిన త్రోయర్‌ అర్షద్‌ నదీమ్‌  (87.82 మీటర్లు) రజతం నెగ్గగా. ఈ పోటీలో నీరజ్‌ చోప్రాకు గట్టిపోటీ ఇచ్చాడని చెప్పవచ్చు.

(ఇదీ చదవండి: ఈ ఆనంద సమయంలో మీరు లేరు.. తారకరత్నను గుర్తుచేసుకున్న ఆలేఖ్య)

ఆ తర్వాత చెక్‌కు చెందిన వద్లెచ్‌ (86.67 మీటర్లు) కాంస్యం దక్కించుకున్నాడు. ఇప్పటికే చంద్రయాన్‌-3 సూపర్‌ విజయంతో ప్రపంచానికి తన సత్తా చాటిన భారత్‌ తాజాగ నీరజ్‌ చోప్రా ఈ విజయంతో మన జాతీయ జెండాను విశ్వవేదికపై మరోసారి ఎగురవేశాడు.

ఈ ఆనంద సమయంలో టాలీవుడు నుంచి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. నీరజ్‌ చోప్రాకు శుభాకాంక్షలు అందించాడు. ఈ రేస్‌లో మొదటిసారి భారత్‌కు స్వర్ణం అందించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ విజయం దేశం గర్వించతగినదని బన్నీ అన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement