టాలీవుడ్ సినీ చరిత్రలో ఎవరికీ సాధ్యపడని రికార్డును పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రియేట్ చేశాడు. 69 ఏళ్ల జాతీయ పురస్కారాల చరిత్రలో ఎవరికీ దక్కని గౌరవం బన్నీకి దక్కింది. ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న తొలి నటుడు ఆయనే అని ప్రకటన వచ్చాక. ఆయన షాక్‌కు గురయ్యాను అని కామెంట్ చేశారు. అంతలా ఈ అవార్డుకు ప్రాధాన్యత ఉంది. అల్లు అర్జున్‌కు అవార్డు దక్కడంతో డైరెక్టర్ సుకుమార్,మైత్రి మూవీ మేకర్స్ వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
(ఇదీ చదవండి: చిరంజీవి 'చూడాలని ఉంది' సినిమాకు 25 ఏళ్లు.. ఈ విషయాలు తెలుసా?)
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్‌గా ఎదిగాడు... ఇందులో నటించిన రష్మిక నేషనల్ క్రష్‌గా గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీవల్లీగా ఆమె నటన బాగా మెప్పిస్తుంది. పార్ట్-2లో శ్రీవల్లీ విశ్వరూపం మరో రేంజ్లో ఉంటుందని ఇప్పటికే సుకుమార్ కూడా తెలిపారు. తాజాగ అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కడంతో గతంలో పుష్ప సక్సెస్ మీట్లో రష్మిక మాటలు మళ్లీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: బాయ్ ఫ్రెండ్ వల్ల నరకం అనుభవించాను: రోహిణి)
పుష్ప సినిమా కోసం బన్నీ చాలా కష్టపడ్డాడని అప్పట్లో సక్సెస్ మీట్లో నేషనల్ అవార్డు గురించి రష్మిక ఇలా చెప్పింది. 'నేనైతే చెప్తున్నానండి.. పుష్పగారికి ఈసారి నేషనల్ అవార్డే కాదు.. ప్రతీ అవార్డు తప్పకుండా వస్తుంది. రాకపోతే మొదట హర్ట్ అయ్యేది నేనే అండి. ఆ స్క్రీన్ మీద ఆయన చేసిన ఫర్ఫార్మెన్స్ వల్ల సినిమాను మరో స్థాయికి తీసుకుపోయింది. కేవలం మేకప్ కోసమే ఆయనకు ప్రతిరోజు సుమారు 3గంటల సమయం పడుతుండేది. ఆ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది.' అని రష్మిక పేర్కొంది. తాజాగ ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు వస్తుందని రష్మిక అందరి కంటే ముందుగా ఎప్పుడో చెప్పిందని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment