మంచు విష్ణుకు నా కృతజ్ఞతలు: అల్లు అర్జున్‌ | Manchu Vishnu Write A Letter For Allu Arjun | Sakshi
Sakshi News home page

మంచు విష్ణుకు నా కృతజ్ఞతలు: అల్లు అర్జున్‌

Published Sun, Sep 10 2023 7:43 AM | Last Updated on Sun, Sep 10 2023 11:39 AM

Manchu Vishnu Write A Letter For Allu Arjun - Sakshi

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న మొదటి నటుడిగా బన్నీ చరిత్ర సృష్టించారు. దీంతో ఇప్పటికే చాలామంది ప్రముఖులు బన్నీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘పుష్ప’ సినిమాలో నటనకిగానూ బన్నీ ఈ అవార్డును గెలుచుకున్నారు. ఈ సందర్భంగా తాజాగా అల్లు అర్జున్‌ను అభినందిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఒక లేఖ విడుదల చేశారు. 

(ఇదీ చదవండి: 20 ఏళ్ల క్రితం జరిగిన యదార్థ ఘటన ఆధారంగా త్రిష సినిమా)

బన్నీ గురించి విష్ణు రాసిన లేఖ 
'డియర్ అల్లు అర్జున్, మీరు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. ‘పుష్ప’ చిత్రంలో మీరు అద్భుతంగా నటించారు. అందుకు గాను దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డు మిమ్మల్ని వరించింది. ఈ సంతోష సమయంలో మీకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు వెనుక మీ కృషి ఎంతో ఉంది. అంకితభావంతో పనిచేశారు. ఈ గుర్తింపునకు మీరు ఎంతో అర్హుడు. మీరు సాధించిన విజయం మీ అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఎనలేని గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా గొప్ప పేరును తీసుకొచ్చారు.

మీరు సాధించిన విజయం మన తెలుగు పరిశ్రమలో సమర్థతకు కొత్త నిదర్శనం. ఈ విజయంతో ఇతర తెలుగు నటీనటులు జాతీయ వేదికపై అలాంటి గుర్తింపు కోసం ఆకాంక్షించేలా మీరు నిరూపించారు.ప్రస్తుతం నేను విదేశాల్లో ఉన్నాను. ఇలాంటి ఆనంద సమయంలో నేను హైదరాబాద్‌లో లేనందున  మీకు వ్యక్తిగతంగా అభినందనలు తెలియజేయలేకపోతున్నాను. కానీ సెప్టెంబర్‌ 17వ తేదీన తిరిగి హైదరాబాద్‌కు వస్తున్నాను. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలుసుకుని నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.' అని మంచు విష్ణు పేర్కొన్నారు.

ఈ లేఖకు అల్లు అర్జున్‌ కూడా స్పందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌, మంచు విష్ణుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మంచు విష్ణు తెలిపిన ప్రశంసలు తన మనసును హత్తుకున్నాయన్నాయని బన్నీ తెలిపారు. త్వరలోనే వ్యక్తిగతంగా కలుసుకుందామని అల్లు అర్జున్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement