పుష్ప-2తో కన్నప్ప పోటీ.. మంచు విష్ణు పోస్ట్‌ అందుకేనా? | Vishnu Manchu Confirms Kannappa Film Release Date | Sakshi
Sakshi News home page

Kannappa: డిసెంబర్‌లో కన్నప్ప.. పుష్ప-2కు పోటీ తప్పదా?

Published Thu, Jul 18 2024 3:06 PM | Last Updated on Thu, Jul 18 2024 3:34 PM

Manchu Vishnu Kannappa Movie Release Date Goes Viral

టాలీవుడ్ హీరో మంచు విష్ణు  డ్రీమ్‌ ప్రాజెక్టుగా తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం కన్నప్ప. ఈ మూవీలో ప్రభాస్‌ సైతం అతిథిపాత్రలో కనిపించనున్నారు. ముకేశ్‌ కుమార్‌సింగ్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌, శరత్‌కుమార్‌, మోహన్‌లాల్‌ లాంటి అగ్ర సినీతారలు నటిస్తున్నారు. ఇందులో విష్ణు.. తిన్నడు పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌పై మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు.  డిసెంబర్‌ 2024 అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఏడాదిలోనే కన్నప్ప థియేటర్లలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే రిలీజ్‌ తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

అయితే డిసెంబర్‌ 6న పుష్ప-2 విడుదల చేయనున్నట్లు సుకుమార్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒకే నెలలో కన్నప్ప, పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద పోటీపడడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇటీవల ఐకాన్‌ స్టార్‌ వెకేషన్‌కు వెళ్లడం.. పుష్ప-2 షూటింగ్‌ పెండింగ్‌లో ఉండడంతో మరోసారి వాయిదా తప్పదనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే పుష్ప-2 మూవీ విడుదల వాయిదా పడే ప్రసక్తే లేదని బన్నీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement