ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత ఖాతాలో తొలి రజత పతకం వచ్చి చేరింది. జావెలిన్ త్రో ఈవెంట్‌లో భారత బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. గురువారం ఆర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో జావెలిన్‌ను 89.45 మీటర్లు విసిరిన నీరజ్.. రెండో స్ధానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇలా ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి పతకం గెలుచుకోవడం విశేషం. గతంలో టోక్యో ఒలింపిక్స్ 2020లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుందామా..!
నీరజ్ చూడటాని చక్కటి శరీరాకృతితో ఆకర్షణీయం ఉంటాడు. అతడు ఆడే జావెలిన్ త్రోలో ఎన్నో గాయలు అవుతుంటాయి. వాటన్నింటిని తట్టుకుని విశ్వవేదిక వద్దకు చేరుకోవడం వెనుక మాటలకందని కఠోర శ్రమ ఉంటుంది. అందుకోసం వారు ఆహర్నిశలు ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాల్సి ఉంటుంది.
ఇక్కడ నీరజ్ చోప్రా మంచి ఫిట్‌నెస్ ఔత్సాహికుడు, అభ్యాసకుడు అని ఆయన పిట్‌నెస్ ట్రైనర్ ఇషాన్ మార్వాహా చెబుతున్నారు. అతను ఫిట్‌నెస్ శిక్షణలో చాలా చురుకుగా ఉంటాడు. ఇతర అథ్లెట్ల కంటే భిన్నంగా ఆలోచిస్తాడు, అంకితభావంతో కృషి చేస్తాడనిన్నారు. ఆయన నీరజ్ ఫిట్‌నెస్‌కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు అవేంటంటే..
అతడివ్యాయామ దినచర్య ఎగువ, దిగువ శరీర బలాన్ని మెరుగుపరచడంపై దష్టిసారిస్తూ ప్రారంభిస్తాడని అన్నారు. తన చేతులు, మోచేతులు ఆకృతిలో ఉంచేందుకు మెడిసిన్ బాల్స్, కేబుల్‌పుల్ వ్యాయామాలపై దృష్టిపెడతాడని అన్నారు.
అలాగే బరువు నిర్వహించేందుకు బరువున్న బంతితో వర్కౌట్‌లు చేస్తాడని చెప్పారు. జావెలిన్ త్రోయర్‌లకు అత్యంత అవసరమైన వ్యాయామం అని తెలిపారు
తన ఆటకు ఉపయోగపడే స్క్వాట్స్, స్నాచ్, వెయిటెడ్ లంగ్స్, టైమ్ సర్క్యూట్‌ల వంటి ఇతర వ్యాయామాలతో కండరాలను నిమగ్నం చేస్తాడు. వీటి తోపాటు డంబెల్ ఫ్రంట్ మరియు సైడ్ రైజ్‌లు, ఏటవాలు క్రంచెస్, స్విస్ బాల్ క్రంచెస్, లెగ్ రైజ్‌లు కూడా చేస్తాడు. ఇవి అతని కోర్ బాడీ స్ట్రెంగ్త్‌ను పెంచుతాయని వివరించారు.
అయితే టోక్యో 2020 ఒలింపిక్స్ తర్వాత, నీరజ్ పెరిగిన బరువును తగ్గించుకోవడానికి టబాటా వ్యాయామంతో చేసినట్లు తెలిపారు. దీన్ని హై ఇంటెన్‌సిటీ ఇంటర్‌వెల్(హెచ్‌ఐఐటీ) వ్యాయామం అంటారు. మొత్తం విభిన్నవ్యాయామాల వర్కౌట్ 20 సెకన్లలో చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐస్ బాత్‌లు, కాంట్రాస్ట్ బాత్‌లతో విశ్రాంతి తీసుకుంటాడని అన్నారు
నీరజ్‌లా బాడీ ఉండాలంటే..
నీరజ్‌లాంచి చక్కటి శరీరాకృతి కావాలనుకుని యువకులకు నీరజ్ ఫిట్‌నెస్‌ని ఫాలో అయితే మంచి ఫలితాలు పొందగలరని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ నీరజ్‌లా అనుభవజ్ఞుడైన ఫిటెనెస్ ప్రొఫెషనల్ సలహాలు సూచనలతోనే ఇవి చేయాలని సూచించారు.
ముఖ్యంగా ఈ హెచ్‌ఐఐటీని 30, 40లలో ఉన్న పురుషుల ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.
ఇవి హృదయ ఆర్యోగాన్ని పెంచడమే గాక జీవక్రియను మెరుగుపరుస్తాయి. పైగా కొవ్వులనే ఈజీగా కరిగించేస్తుంది.
ఈ వ్యాయామం కండర ద్రవ్యరాశిని తగ్గించి, మధుమేహం, గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మూడు పదుల వయసులో ఉన్న పురుషులకు మంచి దేహ సౌష్టవాన్ని పొందేందుకు ఇవి ఉపయోగపడతాయి.
అలాగే 40, 50లలో ఉన్నవారికి ఎగువ శరీర బలాన్ని పెంపొందించుకునేందుకు, గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి.
ఇక్కడ ఆరోగ్యంతో కూడిన ఫిట్‌నెస్ కోసం క్రీడాకారుల ఫిట్‌నెస్ చిట్కాలు ఎంతగానో ఉపకరిస్తాయి. సమర్థవంతమైన ఫిట్‌నెస్ సాధించేందుకు ఉపయోగాపడతాయని చెబుతున్నారు నిపుణులు.
(చదవండి: స్పేస్‌లో ఎక్కువ కాలం ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయా..? బెస్ట్ స్పేస్ ఫుడ్స్ ఇవే..!)
Comments
Please login to add a commentAdd a comment