ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ రెండోరోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఎన్నో అంచనాలను పెట్టుకున్న మహిళల 100మీ. పరుగులో ద్యుతీ చంద్, 400మీ. హర్డిల్స్‌లో కొత్త ఆశలు రేపిన జబీర్ నిరాశపరచగా... వీకే విస్మయ అనూహ్య పరుగుతో 4x400మీ. మిక్స్‌డ్ రిలేలో భారత బృందం పతక ఆశలను చిగురింపజేసింది.హీట్స్‌లో సీజన్ బెస్ట్ ప్రదర్శనతో భారత్ మిక్స్‌డ్ రిలే ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరడంతో పాటు టోక్యో ఒలింపిక్స్ బెర్తును కొట్టేసింది.
దోహా: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్ల సత్తాపై అనుమానాలు తలెత్తుతోన్న సమయంలో 4x400మీ. మిక్స్‌డ్ రిలేలో జాతీయ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొహమ్మద్ అనస్, వెల్లువ కొరోత్ విస్మయ, జిస్నా మ్యాథ్యూ, టామ్ నిర్మల్ నోహ్‌లతో కూడిన భారత బృందం ఒకే దెబ్బతో ఫైనల్ బెర్తు, టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. రెండో హీట్‌లో పాల్గొన్న భారత్ 3 నిమిషాల 16.14 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి మూడోస్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో భారత్‌కిదే ఉత్తమ ప్రదర్శన. తొలుత పోటీని అనస్ ప్రారంభించగా... అనస్ నుంచి బ్యాటన్‌ను అందుకున్న విస్మయ చిరుతలా పరుగెత్తింది. తర్వాత జిస్నా పరుగులో కాస్త వెనుకబడినా... చివరగా నిర్మల్ వేగంగా పరుగెత్తి భారత్‌ను రేసులో నిలిపాడు. అందరిలో విస్మయ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ప్రతీ హీట్‌లో టాప్–3లో నిలిచిన వారితో పాటు, అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసిన మిగతా రెండు జట్లు ఫైనల్‌కు అర్హత పొందుతాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాక గం.1.05లకు 4్ఠ400 మీ. మిక్స్‌డ్ రిలే ఫైనల్ జరుగుతుంది.
నిరాశపరిచిన ద్యుతీ
మహిళల 100మీ. పరుగులో సెమీస్ బెర్తు ఖాయమనుకున్న తరుణంలో భారత ఏస్ స్ప్రింటర్ ద్యుతీచంద్ తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సీజన్‌లోనే అధ్వాన ప్రదర్శనతో అవకాశాన్ని చేజార్చుకుంది. పోటీల రెండోరోజు శనివారం మహిళల 100మీ. హీట్స్‌లో ద్యుతీచంద్ 11.48 సెకన్ల టైమింగ్ నమోదు చేసి ఎనిమిది మంది పాల్గొన్న మూడో హీట్స్‌లో ఏడో స్థానంతో... ఓవరాల్‌గా 37వ స్థానంతో పోటీల నుంచి ని్రష్కమించింది. సెమీస్‌కు అర్హత సాధించిన వారిలో చివరి అత్యుత్తమ టైమింగ్ 11.31 సెకన్లు కాగా... ద్యుతీ ఇదే వేదికగా ఏప్రిల్‌లో జరిగిన ఆసియా చాంపి యన్íÙప్‌లో 11.28సె. టైమింగ్ నమోదు చేసింది. కానీ ఈ మెగా టోరీ్నలో ఆ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. జమైకా స్ప్రింటర్ షెల్లీ ఫ్రేజర్ అందరికన్నా ముందుగా 10.80 సెకన్లలో లక్ష్యానికి చేరుకొని హీట్స్‌లో అత్యుత్తమ స్ప్రింటర్‌గా నిలిచింది.
ముగిసిన జబీర్ పోరాటం
పురుషుల 400మీ. హర్డిల్స్‌లో భారత ఆశాకిరణం ముదారి పిళ్లై జబీర్ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. హీట్స్‌లో 49.62సె. టైమింగ్‌తో సెమీస్‌కు అర్హత సాధించిన జబీర్... సెమీస్‌లో గొప్ప ప్రదర్శన కనబరిచలేకపోయాడు. తాను పాల్గొన్న మూడో సెమీస్ హీట్స్‌లో జబీర్ 49.71 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని ఐదో స్థానంలో నిలిచాడు. ప్రతీ హీట్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారితో పాటు, మిగిలిన వారిలో మెరుగైన టైమింగ్ ఉన్న ఇద్దరు కలిపి మొత్తం 8 మంది ఫైనల్‌కు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment