Duthie chand
-
ద్యుతీ చంద్‌కు నిరాశ
బెల్గ్రేడ్ (సెర్బియా): ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా స్టార్ అథ్లెట్ ద్యుతీ చంద్‌కు నిరాశ ఎదురైంది. 60 మీటర్ల విభాగంలో ఆమె సెమీఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. ఆరో హీట్‌లో పోటీపడ్డ ఈ ఒడిశా అథ్లెట్ 7.35 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా ఈ విభాగంలో 46 మంది బరిలోకి దిగగా ద్యుతీ చంద్‌కు 30వ ర్యాంక్ దక్కింది. -
‘ఖేల్‌రత్న’ బరిలో నీరజ్
న్యూఢిల్లీ: భారత మేటి జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈసారి కూడా ‘రాజీవ్ ఖేల్‌రత్న’ బరిలో నిలిచాడు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) 2018 కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల చాంపియన్ అయిన నీరజ్‌ను అత్యున్నత క్రీడా పురస్కారానికి వరుగా మూడో ఏడాదీ నామినేట్ చేసింది. 2016లో ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ అండర్–20 చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం నెగ్గిన నీరజ్ 2017 ఆసియా చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం దక్కించుకున్నాడు. గత రేండేళ్లుగా నీరజ్‌ను ఏఎఫ్ఐ నామినేట్ చేస్తున్నప్పటికీ చివరకు ‘ఖేల్‌రత్న’ వరించడం లేదు. 22 ఏళ్ల నీరజ్‌కు 2018లో ‘అర్జున అవార్డు’ దక్కింది. మహిళా స్ప్రింటర్ ద్యుతీ చంద్‌తో పాటు ఆసియా క్రీడల స్వర్ణ విజేతలు అర్పిందర్ సింగ్ (ట్రిపుల్ జంప్), మన్జీత్ సింగ్ (800 మీటర్ల పరుగు), మిడిల్ డిస్టెన్స్ రన్నర్ పి.యు.చిత్రలను ‘అర్జున’ అవార్డుకు సిఫారసు చేసింది. డిప్యూటీ చీఫ్ కోచ్ రాధాకృష్ణన్ నాయర్‌ను ‘ద్రోణాచార్య’... కుల్దీప్ సింగ్ భుల్లర్, జిన్సీ ఫిలిప్‌లను ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య పురస్కారం కోసం ఏఎఫ్ఐ ప్రతిపాదించింది. స్వయంగా దరఖాస్తు చేసుకోండి... ఆటగాళ్లు తమ తమ అర్హతలు, పతకాలు చరిత్రతో సొంతంగా కూడా నామినేట్ చేసుకోవచ్చని క్రీడాశాఖ తెలిపింది. బుధవారంతో ముగియాల్సిన నామినేషన్ల గడువును ఈ నెల 22 వరకు పొడిగించింది. కరోనా మహమ్మారి విలయతాండవం దృష్ట్యా ఈసారి క్రీడాశాఖ కేవలం ఈ–మెయిల్ల ద్వారానే దరఖాస్తుల్ని కోరుతోంది. నామినేషన్ల ప్రక్రియ ముగిశాక అవార్డుల కమిటీ ఎంపిక చేసే విజేతలకు ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి భవన్లో అవార్డుల్ని ప్రదానం చేస్తారు. ‘అవార్డులు... ఓ ప్రహసనం’: ప్రణయ్ భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)పై స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ అసంతృప్తి వెళ్లగక్కాడు. ఈ ఏడాదీ తనను ‘అర్జున’కు నామినేట్ చేయకపోవడంపై ఈ కేరళ ప్లేయర్ ట్విట్టర్లో స్పందించాడు. ‘అవార్డుల నామినేషన్లలో పాత కథే! కామన్వెల్త్ గేమ్స్, ఆసియా చాంపియన్‌షిప్‌లలో పతకాలు నెగ్గిన షట్లర్‌ను విస్మరిస్తారు. దేశం తరఫున ఇలాంటి మెగా ఈవెంట్స్‌లో కనీసం పోటీపడని ఆటగాడినేమో నామినేట్ చేస్తారు. ‘అవార్డులు ఈ దేశంలో ఓ ప్రహసనం...’ అని ట్వీట్ చేశాడు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణం సాధించిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న ప్రణయ్... అదే ఏడాది వుహాన్‌లో జరిగిన ఆసియా చాంపియన్íషిప్లో కాంస్య పతకం సాధించాడు. ఈ ఏడాది ‘బాయ్’ ప్రతిపాదించిన ముగ్గురిలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలు కామన్వెల్త్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణం, పురుషుల డబుల్స్‌లో రజతం గెలిచారు. కానీ సమీర్‌వర్మ మాత్రం ఇప్పటి వరకు దేశం తరఫున మెగా ఈవెంట్స్‌లో బరిలోకి దిగలేదు. ప్రణయ్‌కు మద్దతుగా భారత మరో స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్ వ్యాఖ్యానించాడు. ‘జాతీయ క్రీడా అవార్డుల కోసం దరఖాస్తు చేసే విధానం ఇప్పటికీ అర్థంకాదు. ఈ పద్ధతిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. ధైర్యం కోల్పోకుండా దృఢంగా ఉండు సోదరా’ అని ప్రణయ్‌కు కశ్యప్ మద్దతుగా నిలిచాడు. -
‘విస్మయ’ పరిచారు
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ రెండోరోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఎన్నో అంచనాలను పెట్టుకున్న మహిళల 100మీ. పరుగులో ద్యుతీ చంద్, 400మీ. హర్డిల్స్‌లో కొత్త ఆశలు రేపిన జబీర్ నిరాశపరచగా... వీకే విస్మయ అనూహ్య పరుగుతో 4x400మీ. మిక్స్డ్ రిలేలో భారత బృందం పతక ఆశలను చిగురింపజేసింది.హీట్స్‌లో సీజన్ బెస్ట్ ప్రదర్శనతో భారత్ మిక్స్డ్ రిలే ఈవెంట్లో ఫైనల్‌కు చేరడంతో పాటు టోక్యో ఒలింపిక్స్ బెర్తును కొట్టేసింది. దోహా: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్ల సత్తాపై అనుమానాలు తలెత్తుతోన్న సమయంలో 4x400మీ. మిక్స్డ్ రిలేలో జాతీయ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొహమ్మద్ అనస్, వెల్లువ కొరోత్ విస్మయ, జిస్నా మ్యాథ్యూ, టామ్ నిర్మల్ నోహ్లతో కూడిన భారత బృందం ఒకే దెబ్బతో ఫైనల్ బెర్తు, టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. రెండో హీట్‌లో పాల్గొన్న భారత్ 3 నిమిషాల 16.14 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి మూడోస్థానంలో నిలిచింది. ఈ సీజన్లో భారత్‌కిదే ఉత్తమ ప్రదర్శన. తొలుత పోటీని అనస్ ప్రారంభించగా... అనస్ నుంచి బ్యాటన్‌ను అందుకున్న విస్మయ చిరుతలా పరుగెత్తింది. తర్వాత జిస్నా పరుగులో కాస్త వెనుకబడినా... చివరగా నిర్మల్ వేగంగా పరుగెత్తి భారత్‌ను రేసులో నిలిపాడు. అందరిలో విస్మయ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ప్రతీ హీట్‌లో టాప్–3లో నిలిచిన వారితో పాటు, అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసిన మిగతా రెండు జట్లు ఫైనల్‌కు అర్హత పొందుతాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాక గం.1.05లకు 4్ఠ400 మీ. మిక్స్డ్ రిలే ఫైనల్ జరుగుతుంది. నిరాశపరిచిన ద్యుతీ మహిళల 100మీ. పరుగులో సెమీస్ బెర్తు ఖాయమనుకున్న తరుణంలో భారత ఏస్ స్ప్రింటర్ ద్యుతీచంద్ తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సీజన్లోనే అధ్వాన ప్రదర్శనతో అవకాశాన్ని చేజార్చుకుంది. పోటీల రెండోరోజు శనివారం మహిళల 100మీ. హీట్స్‌లో ద్యుతీచంద్ 11.48 సెకన్ల టైమింగ్ నమోదు చేసి ఎనిమిది మంది పాల్గొన్న మూడో హీట్స్‌లో ఏడో స్థానంతో... ఓవరాల్‌గా 37వ స్థానంతో పోటీల నుంచి ని్రష్కమించింది. సెమీస్‌కు అర్హత సాధించిన వారిలో చివరి అత్యుత్తమ టైమింగ్ 11.31 సెకన్లు కాగా... ద్యుతీ ఇదే వేదికగా ఏప్రిల్‌లో జరిగిన ఆసియా చాంపి యన్íÙప్లో 11.28సె. టైమింగ్ నమోదు చేసింది. కానీ ఈ మెగా టోరీ్నలో ఆ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. జమైకా స్ప్రింటర్ షెల్లీ ఫ్రేజర్ అందరికన్నా ముందుగా 10.80 సెకన్లలో లక్ష్యానికి చేరుకొని హీట్స్‌లో అత్యుత్తమ స్ప్రింటర్‌గా నిలిచింది. ముగిసిన జబీర్ పోరాటం పురుషుల 400మీ. హర్డిల్స్‌లో భారత ఆశాకిరణం ముదారి పిళ్లై జబీర్ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. హీట్స్‌లో 49.62సె. టైమింగ్‌తో సెమీస్‌కు అర్హత సాధించిన జబీర్... సెమీస్‌లో గొప్ప ప్రదర్శన కనబరిచలేకపోయాడు. తాను పాల్గొన్న మూడో సెమీస్ హీట్స్‌లో జబీర్ 49.71 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని ఐదో స్థానంలో నిలిచాడు. ప్రతీ హీట్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారితో పాటు, మిగిలిన వారిలో మెరుగైన టైమింగ్ ఉన్న ఇద్దరు కలిపి మొత్తం 8 మంది ఫైనల్‌కు సాధించారు. -
దుతీ చంద్ జాతీయ రికార్డు
అబ్దుల్ నజీబ్‌కు కాంస్యం న్యూఢిల్లీ: ఫెడరేషన్ కప్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు రెండు జాతీయ రికార్డులు బద్దలయ్యాయి. అయితే ఏ అథ్లెట్ కూడా రియో ఒలింపిక్స్ అర్హత ప్రమాణాలను అందుకోలేకపోయాడు. మహిళల 100 మీటర్ల విభాగం ఫైనల్లో దుతీ చంద్ (ఒడిషా) 11.33 సెకన్లతో గమ్యానికి చేరడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 2000లో 11.38 సెకన్లతో రచిత మిస్త్రీ నెలకొల్పిన జాతీయ రికార్డును దుతీ చంద్ తెరమరుగు చేసింది. హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో వ్యక్తిగత కోచ్ నాగపురి రమేశ్ వద్ద దుతీ చంద్ శిక్షణ తీసుకుంటోంది. 0.01 సెకన్లతేడాతో దుతీ చంద్ రియో ఒలింపిక్స్ అర్హతను కోల్పోయింది. మరోవైపు పురుషుల 100 మీటర్ల విభాగంలో ఓఎన్జీసీ తరఫున బరిలోకి దిగిన తెలంగాణ అథ్లెట్ అబ్దుల్ నజీబ్ ఖురేషీ 10.50 సెకన్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. అంతకుముందు హీట్స్‌లో అమియా కుమార్ మలిక్ (ఒడిషా) 10.26 సెకన్లతో ఈ విభాగంలో కొత్త జాతీయ రికార్డును సృష్టించాడు. 2010లో 10.30 సెకన్లతో అబ్దుల్ నజీబ్ నెలకొల్పిన రికార్డును అమియా బద్దలు కొట్టాడు. అయితే ఫైనల్లో అమియా నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
అథ్లెట్ దుతీ చంద్‌కు ఊరట
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) నుంచి నిషేధం ఎదుర్కొంటున్న భారత స్ప్రింటర్ దుతీ చంద్‌కు కాస్త ఊరట లభించింది. జూన్‌లో చైనాలో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు ఆమెకు అనుమతిచ్చింది. ప్రమాణాలకు మించి టెస్టోస్టెరాన్ హార్మోన్‌ను కలిగి ఉండడంతో మహిళల విభాగంలో పాల్గొనేందుకు ఆమె అనర్హురాలంటూ... గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నుంచి ఆమెను హఠాత్తుగా తప్పించారు. తుది తీర్పు వచ్చేదాకా అంతర్జాతీయ ఈవెంట్స్‌లో ఆమె పోటీపడరాదంటూ ఐఏఏఎఫ్ అప్పట్లో తేల్చింది. -
దుతీ చంద్ పై వేటు
లింగత్వ నిర్ధారణ పరీక్షలో విఫలం! న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ జట్టులో చివరి నిమిషంలో మరో మార్పు చోటు చేసుకుంది. మహిళా స్ప్రింటర్ దుతీ చంద్‌ను జట్టు నుంచి తొలగించినట్లు సమాచారం. ఒడిశాకు చెందిన 18 ఏళ్ల దుతీ చంద్ లింగత్వ నిర్ధారణ పరీక్షలో విఫలమైనట్లు తెలుస్తోంది. ‘ఒక మహిళా అథ్లెట్‌కు బెంగళూరులో లింగత్వ నిర్ధారణ పరీక్ష జరగడం వాస్తవమే. అయితే ఆమె పేరు నేను వెల్లడించను’ అని ‘సాయ్’ డీజీ జి.జి. థామ్సన్ చెప్పారు. ఆమె ప్రదర్శన బాగా లేకపోవడమే కారణమని మరో వాదన వినిపిస్తున్నా... ముందుగా ప్రకటించిన అథ్లెటిక్స్ బృందంలో దుతీ పేరు కూడా ఉంది. తాజా ఉదంతంతో కామన్వెల్త్లో పాల్గొనే అథ్లెట్ల సంఖ్య 32కు తగ్గింది.