దుతీ చంద్‌ పై వేటు | Duthie chand failed Health test | Sakshi
Sakshi News home page

దుతీ చంద్‌ పై వేటు

Published Wed, Jul 16 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM

దుతీ చంద్‌ పై వేటు

దుతీ చంద్‌ పై వేటు

లింగత్వ నిర్ధారణ పరీక్షలో విఫలం!
 న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ జట్టులో చివరి నిమిషంలో మరో మార్పు చోటు చేసుకుంది. మహిళా స్ప్రింటర్ దుతీ చంద్‌ను జట్టు నుంచి తొలగించినట్లు సమాచారం. ఒడిశాకు చెందిన 18 ఏళ్ల దుతీ చంద్ లింగత్వ నిర్ధారణ పరీక్షలో విఫలమైనట్లు తెలుస్తోంది.
 
 ‘ఒక మహిళా అథ్లెట్‌కు బెంగళూరులో లింగత్వ నిర్ధారణ పరీక్ష జరగడం వాస్తవమే. అయితే ఆమె పేరు నేను వెల్లడించను’ అని ‘సాయ్’ డీజీ జి.జి. థామ్సన్ చెప్పారు. ఆమె ప్రదర్శన బాగా లేకపోవడమే కారణమని మరో వాదన వినిపిస్తున్నా... ముందుగా ప్రకటించిన అథ్లెటిక్స్ బృందంలో దుతీ పేరు కూడా ఉంది. తాజా ఉదంతంతో కామన్వెల్త్‌లో పాల్గొనే అథ్లెట్ల సంఖ్య 32కు తగ్గింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement