అథ్లెట్ దుతీ చంద్‌కు ఊరట
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) నుంచి నిషేధం ఎదుర్కొంటున్న భారత స్ప్రింటర్ దుతీ చంద్‌కు కాస్త ఊరట లభించింది. జూన్‌లో చైనాలో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు ఆమెకు అనుమతిచ్చింది. ప్రమాణాలకు మించి టెస్టోస్టెరాన్ హార్మోన్‌ను కలిగి ఉండడంతో మహిళల విభాగంలో పాల్గొనేందుకు ఆమె అనర్హురాలంటూ... గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నుంచి ఆమెను హఠాత్తుగా తప్పించారు. తుది తీర్పు వచ్చేదాకా అంతర్జాతీయ ఈవెంట్స్‌లో ఆమె పోటీపడరాదంటూ ఐఏఏఎఫ్ అప్పట్లో తేల్చింది.