బుడాపెస్ట్ (హంగేరి): ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి నాలుగు రోజులు భారత్‌కు నిరాశ ఎదురవగా... ఐదోరోజు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల లాంగ్‌జంప్‌లో జెస్విన్ ఆ్రల్డిన్ ఫైనల్‌కు అర్హత సాధించగా... మరో లాంగ్‌జంపర్ మురళీ శ్రీశంకర్ అనూహ్యంగా క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగాడు.
మహిళల జావెలిన్ త్రో ఈవెంట్‌లో అన్ను రాణి కూడా ఆకట్టుకోలేకపోయింది. క్వాలిఫయింగ్‌లో గ్రూప్ ‘బి’లో పోటీపడ్డ తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల జెస్విన్ 8 మీటర్ల దూరం దూకి చివరిదైన 12వ క్వాలిఫయర్‌గా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించడంతోపాటు ఏడో స్థానంలో నిలిచిన శ్రీశంకర్ ఈసారి నిరాశపరిచాడు.
శ్రీశంకర్ 7.74 మీటర్ల దూరం దూకి ఓవరాల్‌గా 22వ ర్యాంక్‌లో నిలిచాడు. ఫైనల్ నేడు జరుగుతుంది. మహిళల జావెలిన్ త్రో క్వాలిఫయింగ్‌లో అన్ను రాణి ఈటెను 57.05 మీటర్ల దూరం విసిరి 19వ ర్యాంక్‌లో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment