బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషుల 4x400 మీటర్ల రిలే జట్టు తమ ప్రదర్శనతో అకట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో అనస్ యాహియా, అమోజ్ జేకబ్, అజ్మల్, రాజేశ్ రమేశ్‌లతో కూడిన భారత బృందం ఐదో స్థానాన్ని దక్కించుకుంది. భారత బృందం 2 నిమిషాల 59.92 సెకన్లలో గమ్యానికి చేరింది.
అదే విధంగా 2:57.31 సెకన్లలో గమ్యానికి చేరిన అమెరికా జట్టు అగ్రస్ధానంలో నిలిచింది. ఆ తర్వాతి స్ధానాన్ని ఫ్రాన్స్(2:57.45 సెకన్లు) కైవసం చేసుకుంది. మరోవైపు మరోవైపు మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్లో భారత అథ్లెట్ పారుల్ చౌధరీ 11వ స్థానంలో నిలిచింది. పారుల్ 9 నిమిషాల 15.31 సెకన్లలో గమ్యానికి చేరి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది.
చదవండి: భారత ట్రిపుల్ సెంచరీ వీరుడి సంచలన నిర్ణయం.. ఇకపై!
Comments
Please login to add a commentAdd a comment