
దోహా: పోటీల చివరిరోజు ఏడు ఈవెంట్స్‌లో ఫైనల్స్ జరిగాయి. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో అమెరికా అథ్లెట్, ఇద్దరు పిల్లల తల్లి అయిన 30 ఏళ్ల నియా అలీ స్వర్ణం సాధించింది. ఆమె 12.34 సెకన్లలో గమ్యానికి చేరి తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. మహిళల లాంగ్‌జంప్‌లో మలైకా మిహాంబో (జర్మనీ–7.30 మీటర్లు)... పురుషుల 1500 మీటర్లలో టిమోతీ చెరుయోట్ (కెన్యా–3ని:29.26 సెకన్లు)... పురుషుల జావెలిన్ త్రోలో పీటర్స్ (గ్రెనెడా–86.89 మీటర్లు)... పురుషుల 10,000 మీటర్లలో జోషువా చెప్‌టెగి (ఉగాండా–26ని:48.36 సెకన్లు)... మహిళల 4గీ400 మీటర్ల రిలే ఫైనల్స్‌లో అమెరికా బృందం (3ని:18.92 సెకన్లు)... పురుషుల 4గీ400 మీటర్ల రిలే ఫైనల్స్‌లో అమెరికా బృందం (2ని:56.69 సెకన్లు) స్వర్ణ పతకాలు గెల్చుకున్నారు. ఓవరాల్‌గా పతకాల పట్టికలో అమెరికా 14 స్వర్ణాలు, 11 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 29 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment