
ఖతార్ : ప్రత్యేక హోదాపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న ధ్వంద వైఖరికి నిరసనగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్లే కార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆయిన్ ఖాలిద్, రావు గారి విల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న దోహా ఖాతర్ కన్వీనర్ దొండపాటి శశికిరణ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రకు హోదా 10 ఏళ్లు అవసరమని ఒక నాయకుడు చెప్పాడని, పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వెంకేటేశ్వర స్వామి సాక్షిగా అప్పటి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారన్నారు. ఇక చంద్రబాబు అయితే 10 కాదు 15 ఏళ్లు కావాలన్నాడని, అధికారంలోకి రాగానే ఊసరవెల్లి రంగులు మార్చినట్లు మాట మార్చడాని ఆయన ధ్వజమెత్తారు. ఇలాంటి నాయకుడు మన ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టమని తెలిపారు.
దోహా ఖతార్ యూత్ ఇంచార్జ్ మనీష్ మాట్లాడుతూ.. హోదా కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని అన్నారు. హోదా వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయని, దీంతో గల్ఫ్ బాట పట్టే కష్టాలు తీరుతాయన్నారు. మన హక్కును సాధించేవరకు జననేత జగన్‌తో కలిసి పోరాటం చేయాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు షేక్ జాఫర్, గిరిధర్, ప్రధాన సలహాదారులు ఎస్ ఎస్ రావు, విల్సన్ బాబు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు వర్ధనపు ప్రకాష్ బాబు, నల్లి నాగేశ్వరరావు, సహాయ కోశాధికారి భార్గవ్, బీసీ సభ్యుడు పిల్లి మురళి కృష్ణ, స్పోర్ట్స్ సభ్యుడు నేతల జయరాజు, సోషల్ మీడియా సభ్యుడు జేటి శ్రీను, మరియు యం. రాజు, మోహన్ రెడ్డి, పవన్ రెడ్డి, నాగరాజు, కె. అరుణ్ తదితరులు పాల్గోన్నారు.
Comments
Please login to add a commentAdd a comment