
దోహా : జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా దోహాలోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పాటను విడుదల చేశారు. దోహా ఖతార్ కమిటి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో కన్వీనర్ దొండపాటి శశి కిరణ్ మాట్లాడుతూ.. మహమద్అలీ చాలా చక్కగా,పాట రాశారని, ఈ పాట ద్వారా ప్రజలను చైతన్య పరిచి, జగనన్నను 2019 లో ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు, మహమ్మద్ అలీ పార్టీకు చేస్తున్న సేవ అభినందనీయమని, ఇంకా మరెన్నో పాటలు రాయాలని ఆశించారు. జననేత జగనన్న మీద టీడీపీ ఒక ఆరోపణ చేస్తూనే ఉందని అదే ఏమిటంటే జగన్ లక్ష కోట్లు దోచుకున్నకున్నాడని.. అది వాస్తవం అని... ఆ లక్ష కోట్లు ఏంటంటే లక్షల హృదయాలు, కోట్లాదిమంది ప్రజల ప్రేమను ఆయన దోచుకున్నారని, అదే తన ఆస్థిగా భావించి, ఆ లక్షల కోట్ల లోనే, నిత్యం ఉంటూ, వాళ్ల బాధలను వింటున్నారని తెలిపారు.
కో కన్వీనర్ సూర్య ప్రకాశ్ మాట్లాడుతూ.. ఈ పాటను చాలా చక్కగా రచించిన మహమ్మద్ అలీకి అభినందనలు తెలిపారు ,ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆశాభావం వ్యక్తo చేసారు . సేవాదళ్ ఇంచార్జి విల్సన్ బాబు మాట్లాడుతూ.. ఖతార్ కమిటి నిర్మించిన పాటను ప్రజా సంకల్పయాత్రలో అన్నీ నియోజక వర్గాలలో చేరువ చేయడానికి పార్టీ పెద్దలు ముందుకు రావడం హర్షణీయమని అన్నారు, మైనారిటీ ఇన్చార్జ్ దర్బార్ బాషా మాట్లాడుతూ ,మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణతో 2019 లో జగనన్న సీఎం అవ్వడం తధ్యమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment