
శ్రీకాకుళం: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 336వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రేపు(బుధవారం) పలాస నియోజవర్గం వజ్రపుకొత్తూరు మండలంలోని నైట్ క్యాంప్ శిబిరం నుంచి పాదయాత్ర ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి హరిపురం, అంబుగామ్ మీదుగా ఇచ్ఛాపురం నియోజకవర్గం సోంపేట మండలం రాణిగాం మీదుగా మామిడిపల్లి వరకు పాదయాత్ర సాగుతుంది.
అనంతరం లంచ్ విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నాం 2.45 గంటలకు పాదయాత్ర పున: ప్రారంభమౌతుంది. లంచ్ క్యాంప్ నుంచి పాత్రపురం క్రాస్ మీదుగా తురకసా సనం క్రాస్ వరకు పాదయాత్ర సాగనుంది. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటనలో తెలిపారు.