
సాక్షి, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 332వ రోజు షెడ్యూల్ ఖరారైంది. శనివారం పాతపట్నం నియోజకవర్గం మెలియపుట్టి మండలంలోని తూముకొండ నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పెద్దమాడి స్కూల్, హేరాపురం, పెద్దమాడి గ్రామం మీదుగా చీపురుపల్లి వరకు పాదయాత్ర చేస్తారు.
అనంతరం మధ్యాహ్నా భోజన విరామం తీసుకుంటారు. భోజనం ముగిసిన తర్వాత సుమారు 2.45 గంటలకు పాదయాత్ర మళ్లీ ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి పలాస నియోజవర్గంలోని రేగులపాడు, టెక్కలిపట్నం, మోదుగులపుట్టి మీదుగా ఉండ్రుకుడియా క్రాస్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment