ఐర్లాండ్‌పై భారత్ గెలుపు
మహిళల టి20 ప్రాక్టీస్ మ్యాచ్
సావేర్ (బంగ్లాదేశ్): మహిళల టి20 ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. తొలుత భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 148 పరుగులు చేసింది.
పూనమ్ రౌత్ (40 బంతుల్లో 50; 7 ఫోర్లు), మిథాలీ రాజ్ (34 బంతుల్లో 42; 7 ఫోర్లు), మంధనా (17 బంతుల్లో 20; 2 ఫోర్లు) రాణించారు. మెక్‌కార్టీ, టైస్, ఓ రిలే తలా ఓ వికెట్ తీశారు. తర్వాత ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు చేసింది. షిల్లింగ్టన్ (43 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. శిఖా పాండే 3, సోనియా 2 వికెట్లు పడగొట్టారు.
రాణించిన పూనమ్, మిథాలీ
Published Sat, Mar 22 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 5:00 AM
Advertisement
Advertisement