బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో దురుసగా ప్రవర్తించిన భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. అంపైర్ ఔట్ ఇచ్చాడానే కోపంతో వికెట్లను తన బ్యాట్‌తో కొట్టి హర్మన్ పెవిలియన్‌కు వెళ్లింది. ప్రస్తుతం ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాకుండా మ్యాచ్ అనంతరం కూడా అంపైర్‌లపై బహిరంగంగా తీవ్ర విమర్శలు చేసింది.
"ఈ మ్యాచ్‌తో మేం చాలా నేర్చుకున్నాం. అంపైరింగ్ ప్రమాణాలను కూడా చూశాం. చాలా ఘోరంగా ఉంది. మేం మళ్లీ బంగ్లాదేశ్‌కు వచ్చినప్పుడు దాని కోసం కూడా సిద్ధమై రావాలేమో" అంటూ హర్మన్ పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో పేర్కొంది. అయితే ఈ విషయాన్ని ఐసీసీ కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆమెపై చర్యలకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సిద్దమైనట్లు సమాచారం. ఇక ఇది ఇలా ఉండగా.. చివరి వన్డేలో హర్మన్‌ప్రీత్ వ్యవహిరించిన తీరును బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా తప్పుబట్టింది. కాగా ఈఎస్పీఈన్ రిపోర్టు ప్రకారం.. బంగ్లాదేశ్‌తో పోస్ట్ సిరీస్ ఫోటోలు దిగడానికి కూడా హర్మన్ నిరాకరించినట్లు తెలుస్తోంది.
ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం ఈఎస్పీఈన్‌తో సుల్తానా మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్‌లో ఏమి జరిగిందో మనందరికి తెలుసు. అది తన వ్యక్తిగత సమస్య. కానీ సహచర (బంగ్లాదేశ్) ఆటగాళ్లతో కొంచెం మర్యాదగా ప్రవర్తించాలి. కనీసం జాయింట్ ఫోటోగ్రాఫ్ దిగేందుకు కూడా ఆమె నిరాకరించింది. అది మంచి పద్దతి కాదు.
నేను కూడా నా జట్టు ఆటగాళ్లను తీసుకుని ఫోటో సెక్షన్ నుంచి వెళ్లిపోయాను. క్రికెట్ అనేది గౌరవం క్రమశిక్షణతో కూడిన ఆట. ఈ మ్యాచ్‌లో ఉన్న వారు చాలా అనుభవజ్ఞులైన అంపైర్లు. చాలా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అంపైర్‌లుగా పనిచేశారు. మనకు నచ్చినా, నచ్చకపోయినా వారు తీసుకున్న నిర్ణయాలు అంతిమంగా పరిగణించబడతాయి" అని వాఖ్యనించింది.
చదవండి: IND vs WI: వారెవ్వా రహానే.. డైవ్ చేస్తూ ఒంటి చేత్తో! వీడియో వైరల్
Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb
— Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023
Comments
Please login to add a commentAdd a comment