Womens T20 WC 2023 India W Vs Ireland W Match Live Score Updates And Highlights - Sakshi
Sakshi News home page

Womens T20 WC Live Updates: ఐర్లాండ్‌పై విజయం.. సెమీస్‌లో అడుగుపెట్టిన భారత్‌

Published Mon, Feb 20 2023 6:11 PM | Last Updated on Mon, Feb 20 2023 10:06 PM

Womens T20 WC: India W Vs Ireland W live Match Updates and Highlights - Sakshi

ఐర్లాండ్‌పై విజయం.. సెమీస్‌లో అడుగుపెట్టిన భారత్‌
టీ20 ప్రపంచకప్‌-2023 సెమీఫైనల్లో భారత మహిళల జట్టు అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్‌..సెమీస్‌కు అర్హత సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో 5 పరుగుల తేడాతో భారత్‌ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.

భారత బ్యాటర్లలో స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన 87 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడింది. ఆమెతో పాటు జెమిమా రోడ్రిగ్స్(19) కూడా ఆఖరిలో రాణించింది. ఐర్లాండ్‌ బౌలర్లలో లారా డెలానీ మూడు వికెట్లు పడగొట్టగా.. ప్రెండర్‌గాస్ట్ రెండు, కెల్లీ ఒక వికెట్‌ సాధించింది.

అయితే ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ 54/2 వద్ద మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ నేపథ్యంలో వర్షం ఎప్పటికీ తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో..  డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో భారత్‌ను విజేతగా నిర్ణయించారు. కాగా టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్‌కు చేరడం వరుసగా ఇది మూడో సారి.
 

భారత్‌ -ఐర్లాండ్‌ మధ్య జరుగుతున్నకీలక మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఐర్లాండ్‌ స్కోర్‌: 54/2 వద్ద మ్యాచ్‌ నిలిచిపోయింది.

6 ఓవర్లు ముగిసే సరికి ఐర్లాండ్‌ 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. క్రీజులో గాబీ లూయిస్(27), డెలానీ(13) పరుగులతో ఉన్నారు.

తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు..
156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయింది. అమీ హంటర్ రనౌట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరగా..  ప్రెండర్‌గాస్ట్‌ను రేణుక సింగ్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేసింది.

అదరగొట్టిన స్మృతి మంధాన.. ఐర్లాండ్‌ ముందు భారీ టార్గెట్‌
ఐర్లాండ్‌తో జరగుతున్న కీలక మ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన 87 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడింది. ఆమెతో పాటు జెమిమా రోడ్రిగ్స్(19) కూడా ఆఖరిలో రాణించింది. ఐర్లాండ్‌ బౌలర్లలో లారా డెలానీ మూడు వికెట్లు పడగొట్టగా.. ప్రెండర్‌గాస్ట్ రెండు, కెల్లీ ఒక వికెట్‌ సాధించింది.

నాలుగో వి​కెట్‌ కోల్పోయిన భారత్‌
143 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 87 పరుగులు చేసిన భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన..ఓర్లా ప్రెండర్‌గాస్ట్ బౌలింగ్‌లో ఔటయ్యంది. 

వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా
టీమిండియా వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 16 ఓవర్‌ వేసిన లారా డెలానీ బౌలింగ్‌లో నాలుగో బంతికి హర్మన్‌ప్రీత్ కౌర్(13) పెవిలియన్‌కు చేరగా.. ఆరో బంతికి రిచా ఘోష్ డకౌట్‌గా ఔటయ్యంది. క్రీజులో క్రీజులో మంధాన(69)తో పాటు  జెమీమా రోడ్రిగ్స్(11) పరుగులతో ఉంది.

స్మృతి మంధాన హాఫ్‌ సెంచరీ
ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన హాఫ్‌ సెంచరీతో చెలరేగింది. 40 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను స్మృతి అందుకుంది.  14 ఓవర్లు ముగిసే భారత్‌ వికెట్‌ నష్టానికి 95 పరుగులు చేసింది. క్రీజులో మంధాన(53)తో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్(11) పరుగులతో ఉంది.

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌..
62 పరుగులు వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. 24 పరుగులు చేసిన షఫాలీ వర్మ.. లారా డెలానీ బౌలింగ్‌లో పెవిలియన్‌కే చేరింది. క్రీజులో స్మృతి మంధాన,హర్మన్‌ప్రీత్ కౌర్ ఉన్నారు. 10 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 63/1

పవర్‌ ప్లే ముగిసే సరికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో స్మృతి మంధాన(27), షఫాలీ వర్మ(13) పరుగులతో ఉన్నారు.

3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో స్మృతి మంధాన(10), షఫాలీ వర్మ(5) పరుగులతో ఉన్నారు.

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌తో భారత్‌ కీలక పోరుకు సిద్ధమైంది.  ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇక భారత్‌ కేవలం ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. రాధాయాదవ్‌ స్థానంలో దేవిక వైద్య తుది జట్టులోకి వచ్చింది. కాగా ఈ మెగా టోర్నీల్లో భారత్‌ సెమీఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఐర్లాండ్‌పై కచ్చితంగా విజయం సాధించాలి.

తుది జట్లు: 
ఐర్లాండ్: అమీ హంటర్, గాబీ లూయిస్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, ఐమర్ రిచర్డ్‌సన్, లూయిస్ లిటిల్, లారా డెలానీ(కెప్టెన్‌), అర్లీన్ కెల్లీ, మేరీ వాల్డ్రాన్(వికెట్‌ కీపర్‌), లేహ్ పాల్, కారా ముర్రే, జార్జినా డెంప్సే

భారత్‌ : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌), దేవికా వైద్య, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, శిఖా పాండే, రాజేశ్వరి గయాక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్‌
చదవండి: IND vs AUS: కమిన్స్‌లా టీమిండియా లేదంటే పాకిస్తాన్‌ కెప్టెన్‌ చేసి ఉంటేనా.. వెంటనే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement